Wednesday, October 21, 2026

దేవత పూనటం వెనుక ఉన్న రహస్యం | MYSTERY SOLVED

దేవత పూనటం వెనుక ఉన్న రహస్యం | MYSTERY SOLVED

Author Name:Vishwak Datta

Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZpfaTAlySxg





Title: దేవత పూనటం వెనుక ఉన్న రహస్యం | MYSTERY SOLVED

Author Name: Vishwak Datta

Description: దేవత పూనటం వెనుక ఉన్న రహస్యం | MYSTERY SOLVED

Jatharallo devatha poonatam nijamena? Dayyam pattindani cheppe valla shareeramlo asalu em jaruguthundi? Modern science deenni 'psychology' leda trance ani kottiparesthunna... vela yella krithame mana pracheena grandhalu (Sushruta Samhita, Charaka Samhita, Upanishadulu) veeti venuka unna bio-energetic science nu ela decode chesayi?

Ee episode lo, human history lone athyanta rahasyamaina 'Devatha Poonakam' gurinchi deep dive cheyabothunnam. Nadis, Chakras, Tejas, Ojas, mariyu Prana Vayuvulu mana nervous system ni ela control chesthayi anedi ancient Hindu scriptures aadharanga investigate cheddam.

Ee video lo manam charchinchina mukhyamsalu:
👉 Devathalaku, Prethalaku unna asalaina theda enti?
👉 Oka gali roopam, raktamamsala shareeram loki physical ga ela praveshisthundi?
👉 Aadawallake enduku ekkuva poonakalu vasthayi?
👉 Rathri poota juttu virabosukuni (Mukta Kesha) enduku thiragakoodadu?
👉 Pasupu rangu erupuga mare Universal Alchemy Code: Prethalaku raktam, devathalaku pasupu neellu enduku istharu?
👉 Original soul (Jivatma) venuka seat loki ela hijack avuthundi?

#possession #mysterysolved #vdcode #DevathaPoonakam #VishwakDatta #TeluguDocumentaries #MysterySolved #SpiritualScience #OjasAndTejas #GarudaPuranam #HinduScriptures #ancientsecrets


📌 Your Queries & Related Searches:
devatha poonakam real or fake telugu
science behind devatha poonakam
what happens during possession hinduism
garuda puranam secrets in telugu
sushruta samhita and charaka samhita mysteries
nadis chakras and aura explained telugu
what is tejas and ojas in ayurveda
brihadaranyaka upanishad stories telugu
tantric secrets and ancient science telugu
why loose hair is bad for women at night telugu
how prana vayu controls human nervous system
how to protect aura from negative energy telugu
prethalu pisachalu differences explained
vishwak datta latest video
telugu investigative documentary channels
mysteries of hindu mythology decoded


⚠️ Disclaimer: This documentary explores bio-energetic systems through the lens of ancient scriptures, tantric texts, and cultural perspectives. It is intended for educational purposes only and is not a substitute for modern medical or psychological advice.

Transcript:
(00:00) 15 ఏళ్ల క్రితం మా పక్క ఊరిలో నిజంగా జరిగిన ఒక సంఘటనని మీకు చెబుతాను. ఇవి వీడియోలోనో టేపుల్లోనో రికార్డ్ చేయబడినవి కావు. ఒకరోజు ఫుల్ గా తాగి పక్క ఊరి నుండి ఇంటికి వెళుతూ ఉండగా మధ్యం మత్తులో కరెంట్ వైర్నుని పట్టుకొని ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ రోజు వినాయక చవితి. అతనికి ఆ రోజే ఇద్దరు కమల పిల్లలు పుట్టారు.
(00:19) వాళ్ళని చూడటానికి వెళ్తూ ఉన్నప్పుడే చనిపోయాడు. అతను చనిపోయిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ఊర్లో వాళ్ళు ఆ దారి గుండానే టౌన్ కి వెళ్తూ ఉంటారు. వెళ్ళాలన్నా రావాలన్నా అదే దారి ఒకరోజు ఆ ఊరికి చెందిన ఒక అమ్మాయి కాలేజీ నుండి ఇంటికి ఈ దారి గుండానే వస్తూ ఉన్నప్పుడు దేనినో చూసి భయపడింది. ఆ తర్వాత నార్మల్ గానే ఇంటికి వచ్చింది ఏ సమస్య లేదు.
(00:41) దానిని ఎవరూ అంతగా పట్టించుకోలేదు కూడా కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి తన ప్రవర్తన విచిత్రంగా ఉండటం వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించారు. రాత్రి సమయాల్లో నిద్రలేచి వెళ్ళిపోతూ ఉంటుంది. తనని ఒక తాంత్రికుడికి చూపించారు. ఆ సమయంలో ఆ కుటుంబంతో పాటు కొందరు ఆ ఊరి ప్రజలు కూడా వాళ్ళతో పాటు వెళ్లి ఉన్నారు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా కొన్ని విషయాలని ఆ అమ్మాయి చెప్పింది.
(01:00) తను తన పిల్లలని చూడటానికి వెళుతున్నాను అని తన పేరు సాంబశివయ్య అని చెబుతూ వచ్చింది. అంతే కాదు కోడి రక్తాన్ని కలిపిన అన్నాన్ని పెడితే ఆవురంటూ తినేసింది అని అందరూ చెప్పారు. ఆ తర్వాత ఎన్నో ఎల్లుగా ఎన్నో పూజలు, ఎన్నో చికిత్సల తర్వాత ఆమె ఆ స్థితి నుండి బయటపడింది. ప్రస్తుతం ఆమెకి పెళ్లయ్యి ప్రశాంతంగా జీవిస్తూ ఉంది. ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అని ఎంతోమంది కొట్టి పారేస్తూ ఉంటారు.
(01:25) నిజమే కొన్ని సందర్భాల్లో సైకలాజికల్ గానే ప్రాబ్లం అయ్యి ఉండి ఉండొచ్చు. కానీ ప్రతిసారి కాదు. ఈ కేసు లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను రాత్రి సమయాల్లో ఊరు దాటి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని తీసుకురావడానికి వెళ్ళారు. అప్పుడు తను మోకాలి మీద నడుస్తూ ఉంది. విషయం ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తికి నిజంగానే కుంటుతూ నడిచే సమస్య ఉంది.
(01:46) ఇది ఎక్కడి సైకలాజికల్ ప్రాబ్లం. నేను విషయాలని అంత ఈజీగా నమ్మను. కానీ కొన్ని ప్రత్యక్ష సందర్భాలని నేను కల్లారా చూశాను కూడా. ఆ సమయంలో నాకు ఎన్నో సందేహాలు కలిగాయి. నేను వీటి గురించి అన్వేషించడం మొదలు పెట్టాను. నా ఈ అన్వేషణ ఈనాటిది కాదు ఇప్పటివరకు మన ఛానల్ లో వచ్చిన ప్రతి ఎపిసోడ్ లోని ఇన్ఫర్మేషన్ నేను ఎన్నో ఏళ్లుగా పరిశోధిస్తూ వచ్చినవి అండ్ ఇప్పటివరకు మీకు నేను చెప్పినవన్నీ కనీసం 10% కూడా కాదు మీలాగే నాకు కూడా ఎన్నో ప్రశ్నలు సైకలాజికల్ గా సమస్య అయితే ఆ అమ్మాయి చనిపోయిన వ్యక్తి పేరుని అతనికి పిల్లలు ఉన్నారని ఎలా చెబుతుంది మోకాలి మీద ఎందుకు
(02:18) నడుస్తుంది రక్తం కలిపిన అన్నాన్ని ఎందుకు తింటుంది? సరే అలాంటప్పుడు జాతర సమయాల్లో డప్పులు మోగుతూ ఉంటే కొందరికి దేవత పూనింది అని చెబుతారు. అసలు దేవతలు మనుషుల శరీరంలోకి ఎందుకు వస్తారు? అసలు వచ్చింది నిజంగా దేవతేనా ఎన్నో ఏలుగా కఠోర సాధన చేస్తూ ఉన్న యోగులకి ఎందుకు దేవత పూనట్లేదు. ఎందుకని ఒక సాధారణ మనిషికి మాత్రమే పడుతూ ఉంది.
(02:43) అది కూడా కొందరికి మాత్రమే ఏదో సెలెక్ట్ చేసుకున్నట్టుగా అలా దేవత పూనినప్పుడు పసుపు నీళ్ళని నిమ్మ రసాన్ని ఎందుకని ఇస్తారు? రాత్రి వేళలో జుట్టు వెరబోసుకొని పూలు పెట్టుకొని వెళ్లద్దు అని ఎందుకని చెబుతారు దేవత పూనినా లేదా దెయ్యం పట్టిన ఆ సమయంలో ఆ పట్టిన వ్యక్తి యొక్క ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? అసలు వీటి వెనుక ఏం జరుగుతుంది? సైన్స్ కి అంతు చెక్కని ఆ రహస్యం ఏంటి? ప్రతి దానికి మన గ్రంథాల్లో వివరణ ఉంటుంది అని చెబుతారు.
(03:09) మర అయితే దీనికి సంబంధించిన వివరణ ఎక్కడ ఉంది? గరుడ పురాణం సుశృత సమ్మేద ఆయుర్వేదంలోని బోధ వైద్యం విభాగం లాంటి ప్రాచీన గ్రంథాల్లో వీటి గురించి ప్రస్తావించి ఉన్నారు. వాటిలో ఏమని రాసి ఉంది. వీటి గురించి ఎన్నో తాంత్రిక గ్రంథాలు కూడా వివరించి ఉన్నాయి. ఒక పుస్తకంలో 100 పేజీలని చదివితే అందులో కేవలం ఒక్క పేజీలో మాత్రమే మనకు కావలసింది దొరుకుతుంది.
(03:29) నేను స్వయంగా ఎన్నో పుస్తకాలను చదివి గురువులని ఆశ్రయించి సొంతంగా అన్వేషించి తెలుసుకున్నవన్నీ ఈ ఎపిసోడ్ లో మీకు చెబుతాను. ఇప్పటివరకు ఎవ్వరు చెప్పని రహస్యాలు ఈ ఎపిసోడ్ లో మీరు తెలుసుకోబోతున్నారు. మీరు స్పెండ్ చేసే ఈ 10 టు 20 మినిట్స్ అస్సలు వేస్ట్ అవ్వవు. విశ్వక్దత్త YouTube ఛానల్ కి మీకు స్వాగతం. మనం ఆ అమ్మాయి మోకాల మీద ఎందుకు నడిచింది అనే రహస్యాన్ని డీకోడ్ చేసే ముందు మనం ఎన్నో ఏళ్లుగా నమ్ముతూ ఉన్న ఒక అతి పెద్ద బ్రమను బద్దలు కొట్టాలి.
(04:06) జాతరల్లో డబ్బులు మోగుతూ ఉన్నప్పుడు ఎవరైనా పూనకొంతో ఊగుతూ కళ్ళు ఎర్రగా చేసి అరుస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్ళంతా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తే ఈ మనిషి రూపంలోకి దిగి వచ్చింది అని నమ్ముతారు. ఆయుర్వేదంలోని ప్రాచీన గ్రంథమైన సుశ్రత సంహిత అందులో ఉండే ఉత్తర తంత్ర అధ్యాయనాల్లో కొన్ని విషయాలని స్పష్టంగా రాసి ఉన్నారు. అందులో ఏమని ఉందంటే దేవా గ్రహ నతే స్వయం ఆవిసంతి అంటే అసలైన దేవతలు ఎప్పటికీ స్వయంగా ఒక మనిషి శరీరంలోకి ప్రవేశించరు అని అది కూడా పూనకం లాగా ఎందుకంటే ఆ దేవత యొక్క కాస్మిక్ వోల్టేజ్ ఎలా ఉంటుందంటే అది ఒక సాధారణ 70 కిలోల రక్త మాంసాల శరీరంలోకి నేరుగా
(04:46) దిగితే ఆ నాడీ వ్యవస్థ ఒక్క మైక్రో సెకండ్ లో కాలి బూడిదైపోతుంది. మరి అలాంటప్పుడు జాతరల్లో ఊగుతూ ఉన్న ఆ మనిషి లోపలికి వచ్చేది ఎవరు? మన గ్రంథాల్లో ఏమని చెప్పి ఉన్నారంటే ఈ ప్రధాన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నీడలో కోటాను కోట్ల పరివార గణాలు ఉంటాయి అని క్షేత్రపాలకులు, శివగణాలు, యక్షగణాలు, మాతృక గణాలు ఈ గణాలు తమ యజమాని అయినా అసలైన దేవతా మూర్తి యొక్క స్వభావాన్ని ఆ వేషధారణని ఆ లక్షణాలని కలిగి ఉంటాయి.
(05:16) అలా వాటిని అనుకరిస్తూ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. [సంగీతం] అందుకే బయట నుంచి చూసిన సామాన్యులకి సాక్షాత్తు ఆ దేవత వచ్చినట్టే కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నది ఆ దేవత యొక్క గణం మాత్రమే. అసలు ఈ గణాలు అంటే ఏంటి? ఈ పదాన్ని ఎక్కడో విన్నట్లు అనిపించట్లేదా గణానాం త్వా గణపతి గుమ్హవామహేకవిం కవినాపమశ్రవస్తమ సమస్త గణములకు అధిపతి గణపతి.
(05:43) మరి ఆ గణాలను శాసించే గణపతి ఎక్కడో ఆకాశంలో తిరుగుతూ ఉన్నాడు అని అనుకుంటే పొరపాటే మన తాంత్రిక యోగశాస్త్రాల ప్రకారం ఆ గణపతి మన వెన్నపూస చెట్ట చివర ఉండే మూలాధార చక్రంలో కూర్చొని ఉన్నాడు. ఇది వినగానే ఎంతో మందికి లాజిక్ అర్థం కాదు అర్థం కాక ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అదేంటి దేవుడు నా శరీరం లోపల ఎలా ఉంటాడు? ఇది జస్ట్ ఒక ఫిలాసఫీ కదా ఇది ఒక మెటఫార్ కదా అని చెబుతూ ఉంటారు.
(06:07) కానీ ఒకసారి ప్యూర్ సైన్స్ పరంగా ఆలోచించి చూడండి. మీ శరీరంలో ఉండే ఎముకల్లో ఉన్న కాల్షియం, మీ నరాలలో ప్రవహిస్తూ ఉన్న ఐరన్ ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలుసా? అవి ఈ భూమి మీద పుట్టినవి కావు. మన అమ్మ కడుపులో తయారైనవి అంతకన్నా కావు. 14 బిలియన్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఈ భూమి, ఈ సూర్యుడు పుట్టక ముందే అంతరిక్షంలో ఎక్కడో ఒక మహా నక్షత్రం పేలినప్పుడు పుట్టిన అణువులు అవి.
(06:32) జస్ట్ ఇమాజిన్ 14 బిలియన్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో పుట్టిన ఒక రాయి. ఒక లోహం. ఈరోజు మన శరీరం లోపల మన ఎముకల్లో మన రక్తంలో సజీవంగా తిరుగుతూ ఉంది అంటే అది సైన్స్ అది పాసిబుల్ే కదా అని నమ్ముతారు. మరి ఈ సూర్యుడు ఈ భూమి పుట్టక ముందు ఉన్న ఆ కాస్మిక్ ఎనర్జీ మన మూలాధారంలో నివసించడం ఇంపాసిబుల్ ఎలా అవుతుంది ఇది 100% పాసిబుల్.
(06:54) ఆ శక్తి ఈ భూమి గర్భంలోనే ఉంది మన శరీరం లోపల ఉంది. కానీ అసలైన సమస్య ఏంటంటే మన లోపల అంతటి మహాశక్తి ఉన్నా సరే అది ఇన్ఆక్టివ్ స్టేట్ లో ఉంది. అందుకే మన శరీరం సాక్షాత్తు దైవతత్వంతో నడిచే ఒక అద్భుతమైన బయో మెషిన్ అయినా సరే మనం ఈ చిన్న చిన్న నెగిటివ్ శక్తుల నుండి మనల్ని మనము కాపాడుకోలేకపోతున్నాం. కేవలం ఇంతే కాదు మన కెరీర్ లో మనకు వచ్చే మనీ ఫ్లోలో మన రిలేషన్షిప్స్ లో మన జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని బ్లాకేజెస్ వస్తూ ఉన్నాయి.
(07:22) ఎప్పుడైతే మీ లోపల నిద్రపోతూ ఉన్న ఆ మూలాధార శక్తిని ఆ చక్రాలను సరైన విధంగా ఎలా యాక్టివేట్ చేయాలో మీకు తెలుస్తుందో ఆ రోజు మీ చుట్టూ ఉన్న మనుషులకు మీరు ఒక సాధారణ మనిషిలా కాదు ఒక సూపర్ హ్యూమన్ లా కనిపిస్తారు. వీటిని ఎలా యాక్టివేట్ చేయాలి అన్న దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు తిరిగి మన కథలోకి వద్దాం. దేవతలు నేరుగా పోనరు సరే కేవలం గణాలు మాత్రమే వస్తాయని మన గ్రంథాలు చెప్పి ఉన్నాయి.
(07:46) మరి ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసే మహా యోగుల సంగతి అంటే వాళ్ళకి ఎప్పుడు ఇలా జాతరలు వచ్చినట్టు పూనకం రాదు. ఎందుకు దీనికి సమాధానం కాశ్మీర శైవ తంత్ర గ్రంథమైన మాలిని విజయోత్తర తంత్రం మరియు అభినవ గుప్తుడు రాసిన తంత్ర లోకంలో ఉంది. తంత్ర శాస్త్రం రెండు రకాల ఆవేశాలను వేరువేరు చేసి చూపించింది. ఆవేశం అంటే పూనటం. ఒకటి గ్రహ ఆవేశం. రెండవది రుద్రశక్తి సమావేశం.
(08:12) సాధారణ మనిషికి వచ్చేది గ్రహ ఆవేశం. అంటే బయట ఉన్న ఒక గణమో, భూతమో వచ్చి ఒక శరీరాన్ని తాత్కాలికంగా సీజ్ చేయటం. అందుకే వాళ్ళు స్ప్రో కోల్పోయి ఊగుతూ ఉంటారు. కానీ ఒక మహా యోగికి జరిగేది సమావేశం. అంటే తన కఠోర సాధన వల్ల ఆ యోగి యొక్క సొంత అహం ఇండివిడ్యువల్ ఈగో పూర్తిగా కరిగిపోయి అతని లోపల నిద్రాణంగా ఉన్న ఆ మూల దైవ చైతన్యమే నిద్రలేస్తుంది.
(08:36) చరిత్రలో ఆనందమయ్యి అమ్మని చూస్తే ఆవిడకి జాతరలో వచ్చినట్టు పూలకాలు రాలేదు. ఆవిడలో ఆ కాళికా మాత తత్వం శాశ్వతంగా మేల్కొని ఆవిడతో పాటే జీవించింది. అందుకే యోగులు స్పృహ కోల్పోయి కిందపడి దూరలారు. వాళ్లే నడిచే దైవాలుగా మారిపోతారు. సరే యోగుల సంగతి అర్థమైంది. మరి ఒక సాధారణ మనిషిని ఆవహించే ఆ అదృశ్య శక్తులు అసలు ఎన్ని రకాలు? ఆ కాలేజీ అమ్మాయిని పట్టుకున్న శక్తి ఏ రకానికి చెందినది.
(09:04) మనం ప్రతిదాన్ని కలిపేసి దెయ్యం అంటాం. లేదా దేవత అని అంటాం. కానీ వేదాలు పురాణాలు ఆయుర్వేద గ్రంథాలు ఈ శక్తులని చాలా కచ్చితంగా విభజించి ఉన్నాయి శాస్త్ర ప్రకారంగా మనల్ని ప్రభావితం చేసే శక్తులని గ్రహాలు అని అంటారు ఇక్కడ గ్రహం అంటే ఆకాశంలో తిరిగేవి మాత్రమే కావు గ్రహనాతి ఇతిగ్రహ అంటే మనల్ని పట్టుకునేది మనల్ని సీజ్ చేసేది అని అర్థం ఇవి ప్రధానంగా నాలుగు కేటగిరీలు మొదటిది దేవతా గణాలు క్షేత్రపాలకులు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఊరి సరిహద్దులని ధర్మాన్ని కాపాడే పరివార శక్తులు రెండవది గంధర్వు రువు వులు మరియు యక్షులు [సంగీతం] ఎన్నో తంత్రాలలో అధర్వన
(09:40) వేదంలో కూడా వీటి గురించి ప్రస్తావన ఉంది. ఇవి ఈ విశ్వంలో ఉండే నాన్ హ్యూమన్ ఎంటిటీస్ మనకన్నా హైయర్ ఎవాల్వ్డ్ బీయింగ్స్ వాళ్ళు సంగీతానికి ఆనందానికి సువాసనలకి ఆకర్షితులు అవుతూ ఉంటారు. నిజానికి మనం ఏదైనా మంత్రంతోనో తంత్రంతోనో వాటిని ప్రేరేపణ చేస్తే తప్ప అవి మన జోలికి రావు. కానీ కొన్ని సందర్భాల్లో విపరీతమైన రాక్షస గుణాలు కలిగిన యక్షిణులు ఎటువంటి ప్రేరణ లేకుండా కూడా వస్తూ ఉంటారు.
(10:06) మూడవది ప్రేతాలు ఆ కాలేజీ అమ్మాయిని పట్టుకున్నది సరిగ్గా ఇదే గరుడ పురాణం ప్రకారం ఎవరైతే ఉరి వేసుకొని గాని కరెంట్ షాకుతో గాని యక్సిడెంట్ లో గాని యకాల మరణం చెందుతారో లేదా ఎవరికైతే మరణాంతరం జరగాల్సిన కర్మకాండలు సరిగ్గా జరగవో వాళ్ళు ప్రేత స్థితిలో ఇరుక్కుపోతారు. ఆ వినాయక చవితి రోజున చనిపోయిన వ్యక్తి తనకి అప్పుడే పుట్టిన పిల్లల మీద విపరీతమైన తప్పనని పెట్టుకున్నాడు.
(10:30) కానీ అకాలంగా మరణించాడు. ఇలాంటి ప్రేతాలకు భౌతిక శరీరం కాలిపోతుంది కానీ వాళ్ళ ఆకలి దాహం తమ కుటుంబం మీద ఉన్న తపన అలాగే రగులుతూ ఉంటుంది. అందుకే అవి తమ పాత ఇంటి చుట్టూ ఆ దారుల చుట్టూ తిరుగుతూ తమ ఉనికిని చాటుకోవడానికి బ్రతికి ఉన్న మనుషులని పట్టుకుంటూ ఉంటాయి. నాలుగవది పిశాచులు ఇవి ప్రేతాల కంటే అత్యంత భయంకరమైనవి. పూర్తిగా తమోగుణంతో నిండిపోయి అశుద్ధమైన ప్రదేశాల్లో తెరిగే క్రూరమైన పరాన్న జీవులు. ఐ మీన్ ఒక రకమైన పారాసైట్స్.
(10:59) కానీ ఇక్కడ మనక ఒక డౌట్ వస్తుంది. అసలు ఈ గణాలైనా గంధర్వులైనా ప్రేతాలైనా పిశాచులైనా ఒక మనిషిని ఎందుకు పట్టుకుంటాయి వాటికి మన శరీరంతో పని ఏంటి? దీనికి చరక సంహితలో ఒక ఆన్సర్ ఉంది. ఏ అదృశ్య శక్తి అయినా సరే ఒక మనిషిని పట్టుకోవడం వెనుక మూడే మూడు కారణాలు ఉంటాయని చరక మహర్షి తేల్చి చెప్పారు. అవి హింస, రతి, అభ్యర్చన. మొదటిది హింస.
(11:24) కేవలం ఆ మనిషిని బాధ పెట్టడానికి వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రాణాన్ని నాశనం చేయడానికి పట్టుకోవడం మనం ఏదైనా అపచారం చేసినప్పుడు లేదా ఎవరైనా మన మీద ప్రయోగం చేసినప్పుడు పిశాచులు ఈ హింస అనే ఉద్దేశంతోనే దాడి చేస్తాయి. రెండవ ఉద్దేశం రతి సెన్సరీ ఎంజాయ్మెంట్ రతి అంటే కేవలం కామం మాత్రమే కాదు భౌతికమైన సుఖాలని రుచులని అనుభవించాలనే కోరిక.
(11:44) ప్రేతాలకు భౌతిక శరీరం ఉండదు కాబట్టి అవి మద్యం తాగలేవు. మాంసము తినలేవు. శారీరక సుఖాన్ని అనుభవించలేవు. అందుకే ఆ సుఖాలని అనుభవించడానికి బ్రతికి ఉన్న మనిషి శరీరాన్ని ఒక రెంటుకు తీసుకున్న వెహికల్ లాగా వాడుకుంటాయి. ఆ అమ్మాయిలోకి దూరిన ఆ ప్రేతం కోడి రక్తం కలిపిన అన్నాన్ని ఆవురావురం అంటూ తినేసింది అంటే దాని వెనుక ఉన్న మోటివ్ ఈ రతి ఆకలిని తీర్చుకోవడం.
(12:07) మూడవ ఉద్దేశం అభ్యర్చన. అంటే పూజను గౌరవాన్ని గుర్తింపుని కోరుకోవడం. జాతరలో వచ్చే దేవత గణాలు గాని ఇంట్లో పూర్వీకుల శక్తులు గాని ఎందుకు ఆవిస్తాయ అంటే వాళ్ళకి మన ఆహారం మీదనో మన సుఖాల మీదనో కోరిక కాదు మాకు జరగాల్సిన పూజ జరగలేదు ఊరిలో ధర్మం తప్పింది మమ్మల్ని గౌరవించండి అని తమ అథారిటీని చూపించుకోవడానికి అంటే అభ్యర్థన కోసం అవి మనిషిలోకి ప్రవేశిస్తాయి.
(12:33) అయితే ఇక్కడ చరక సంహిత ఇంకొక నిజాన్ని కూడా బయట పెట్టింది. ఒక శక్తి మనల్ని పట్టుకోవాలంటే ప్రతిసారి మన శరీరం లోపలికి దూరాల్సిన అవసరం లేదు. దేవతా శక్తులు కేవలం తమ చూపుతోనే మనల్ని ప్రభావితం చేస్తాయి. గురువులు సిద్ధులు ఋషులు తమ వాక్కుతో ప్రభావితం చేస్తారు. పితృ దేవతలు తమ దర్శనంతో ప్రభావితం చేస్తారు. గంధర్వులు కేవలం స్పర్శతో ప్రభావితం చేస్తే యక్షులు శరీరంలోకి ప్రవేశించడంతో చేస్తారు.
(12:58) మరి పిశాచులు అవి మన వీపు మీద భుజాల మీద ఎక్కి కూర్చోవడం ద్వారా మనల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. మీరు కావాలంటే ఇటువంటి పరిస్థితులని అనుభవించిన వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట నా భుజం మీద ఏదో ఎక్కినట్టు బరువు ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తారు. భయమేస్తుంది కదా కానీ అసలైన మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది.
(13:18) మన శరీరం అనేది చర్మం కండరాలు ఎముకలతో పూర్తిగా సీల్ చేయబడి ఉంటుంది. మరి భౌతికంగా లేని ఒక గాలి రూపం అసలు మన శరీరం లోపలికి ఎలా ప్రవేశిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోడ్డు మీద వందల మంది నడుస్తూ ఉంటే ఆ ప్రేతం కేవలం ఆ ఒక్క కాలేజీ అమ్మాయి లోపలికి ఎందుకు వెళ్ళగలిగింది? మిగతా వాళ్ళకి ఏదైనా ప్రొటెక్షన్ షీల్డ్ ఏమైనా ఉంటుందా దీని గురించి సుశృత సంహితలో అద్దం మరియు సూర్యకాంత శిల రహస్యంతో ఒక విషయాన్ని చెప్పి ఉన్నారు.
(13:46) చాలా మంది సినిమాల్లో చూపించినట్లు దయ్యం అంటే ఒక పొగలాగా ముక్కులో నుంచో నోట్లో నుంచో దూరిపోతుందని అనుకుంటారు. కానీ వేల ఏళ్ల క్రితమే మన మహర్షులు దీని వెనుక ఉన్న ఎగ్జాక్ట్ ఫిజిక్స్ [సంగీతం] ని డీకోడ్ చేశారు. సుస్తరత సంహిత ఉత్తర తంత్రం 60 వ అధ్యాయం. చరక సంహిత చికిత్స స్థానం తొమ్మిదవ అధ్యాయం.
(14:05) వీటిలో ఒక అదృశ్య శక్తి మనిషిలోకి ఎలా ప్రవేశిస్తుందో వివరించడానికి మూడు పర్ఫెక్ట్ ఎగజాంపుల్స్ ని ఇచ్చి ఉన్నారు. మొదటిది మిర్రర్ రిఫ్లెక్షన్ మీరు వెళ్లి ఒక అద్దం ముందు నిలబడ్డారు అనుకుందాం. నిలబడగానే మీ రూపం ఆ అద్దం లోపలికి వెళ్తుంది కదా మరి మీ రూపం అద్దం లోపలికి వెళ్ళినప్పుడు ఆ అద్దం పగిలిందా ఆ అద్దానికి ఏదైనా రంధ్రాలు పడ్డాయా లేదు.
(14:27) అద్దం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. కానీ మన రూపం మాత్రం ఆ అద్దం లోపల స్పష్టంగా కనిపిస్తుంది. రెండవ ఎగ్జాంపుల్ సూర్యకాంత శిల మాగ్నిఫయింగ్ గ్లాస్ ఆకాశంలో ఎక్కడో కోట్ల మైళల దూరంలో ఉన్న సూర్యుడి కిరణాలు ఒక భూతద్దం గుండా వెళ్ళినప్పుడు ఆ గాజు రాయిని పగలకొట్టకుండానే ఆ కిరణాల్లో ఉన్న అగ్ని ఆ అద్దం గుండా ప్రయాణించి కింద ఉన్న ఎండుగడ్డిని బగ్గున తగలబెడుతుంది.
(14:50) మూడవ ఎగ్జాంపుల్ చలి మరియు వేడి. బయట ఉన్న చలి లేదా వేడి మన చర్మాన్ని కోయకుండానే మన ఎముకల లోపలికి చచ్చుకుపోతుంది. సుశ్రత మహర్షి ఏం చెబుతున్నారంటే సరిగ్గా అలాగే బయట తిరిగే ఒక సూక్ష్మ శక్తి నీ శరీరంలోకి రావడానికి నీ చర్మాన్ని చీల్చాల్సిన అవసరం లేదు. నిన్ను చొచ్చుకొని లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక అద్దం లోపలికి మన ప్రతిబింబం ఎలాగైతే ఇన్స్టెంట్ గా ప్రొజెక్ట్ అవుతుందో ఆ శక్తులు తమకున్న స్వభావ మహిమల చేత ఐ మీన్ ఫ్రీక్వెన్సీ ప్రొజెక్షన్స్ తో మన భౌతిక శరీరం లోపల ఉండే అదృశ్య శరీరంలోకి కొన్ని క్షణాల్లోనే ప్రాజెక్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకొక
(15:27) ప్రశ్న ఉంది. ఒక అద్దం ముందు ఎవరు నిలబడిన ప్రతిబింబం పడుతుంది కదా మరి ఆ కరెంట్ షాక్ తో చనిపోయిన వ్యక్తి ఉన్న రోడ్డు మీద రోజుకి వందల మంది నడుస్తున్నారు. వాళ్ళందరి శరీరాలు కూడా అద్దాలే కదా. మరి ఆ ప్రేతం యొక్క ప్రతిబింబం ఆ వందల మంది మీద పడకుండా కేవలం ఆ ఒక్క కాలేజీ అమ్మాయి మీద ఎందుకు పడింది? ఎందుకంటే మిగతా వాళ్ళందరి అద్దాల మీద ఒక రక్షణ కవచం ఉంది.
(15:48) ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఉంది. ఆ అమ్మాయి మీద ఉన్న కవచం మాత్రం సరిగ్గా ఆ రోజు పగిలిపోయింది. అసలు కవచం అంటే ఏంటి? అది మన శరీరంలో ఎలా తయారవుతుంది? దీనిని అర్థం చేసుకోవాలంటే మన శరీరం లోపల ఉన్న రహస్య నిర్మాణాన్ని చూడాలి. మన కంటికి కనిపించే ఈ రక్త మాంసాల బాడీని అన్నమయ్య కోసం అని అంటారు. కానీ దాని లోపల డాక్టర్ల ఎక్స్రేలకి ఎంఆర్ఐ స్కానర్లకి దొరకని ఇంకొక ఎనర్జీ బాడీ ఉంది. అదే ప్రాణమయ్య కోసం.
(16:19) ఈ విధంగా ఐదు కోశాలతో మనం ఉంటాం. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ ప్రాణమయ్య కోసం 72,000 నాడులు ఉంటాయి. ఇక్కడ నాడి అంటే డాక్టర్ కోస్తే కనిపించే నరం లేదా రక్తనాళం కాదు అవి భౌతికమైన పైపులు లాంటివి కావు మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించే అదృశ్యమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లాంటి మార్గాలు ద పాత్వేస్ ఈ 72వ000 నాడులు మన శరీరంలో ఎక్కడైతే గుంపులు గుంపులుగా కలుస్తాయో ఆ మెయిన్ జంక్షన్లనే మనం చక్రాలు అని అంటాం.
(16:46) ఇవి మన బాడీలో పవర్ ట్రాన్స్ఫార్మర్లుగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ నాడులు చక్రాల గుండా ప్రాణశక్తి ప్రవహిస్తుందో మన శరీరంలో రెండు అత్యంత శక్తివంతమైన బయో ఎనర్జీలు తయారవుతాయి. అవి తేజస్సు మరియు ఓజస్సు వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేదం ప్రకారం మనం తినే ఆహారం ఏడు ధాతువులుగా మారుతాయి. రస రక్త మాంస, మేధ, అస్తి, మజ్జ, శుక్ర ధాతువులుగా 30 రోజుల పాటు జరిగే ఈ ప్రాసెస్ లో చిట్టచివరిగా తయారయ్యే అత్యంత స్వచ్ఛమైన, అత్యున్నతమైన ప్రాణ రసాయనమే ఓజస్సు.
(17:20) ఇక తేజస్సు అంటే మన ప్రతి కణంలో మండుతూ ఉన్న సెల్యులర్ అగ్ని సెల్యులర్ అండ్ సైకిక్ ఫైర్ ఓజస్సు అనేది ఆవు నెయ్యి లాంటి ఇంధనం అయితే తేజస్సు అన్నది ఆ నెయ్యితో వెలిగే మంట. ఈ రెండు కలిసినప్పుడు మన శరీరం చుట్టూ ఒక పవర్ ఫుల్ బయో ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది. దానిని మనం ఆర లేదా ప్రాణ కవచం అని అంటాం.
(17:44) మనలో ఓజస్సు, తేజస్సు నిండుగా ఉన్నంతవరకు మన ఆర ఒక మండుతూ ఉన్న అగ్నిగోడలా ఉంటుంది. ఏ ప్రాతము ఏ పిశాచము తమ ప్రతిబింబాన్ని మన మీద ప్రాజెక్ట్ చేయలేదు. దగ్గరికి రాగానే ఆ తేజస్సు వేడికి కాలి బూడిద అవుతుంది. మరి ఆ కాలేజీ అమ్మాయి విషయంలో ఏం జరిగింది? చరక సంహేతలో ఈ కవచం ఎప్పుడు పగిలిపోతుందో చాలా స్పష్టంగా వివరించారు. మొదటిది సడన్ గా వచ్చే షాక్ లేదా తీవ్రమైన భయం.
(18:09) ఆ అమ్మాయి ఆ దారిలో వస్తూ ఉన్నప్పుడు అక్కడ దేనినో చూసి ఒక్కసారిగా భయపడింది. ఎప్పుడైతే మనిషికి గుండె ఆగిపోయేంత భయం వేస్తుందో వెన్నెపూస చివర ఉండే మూలాధార చక్రం ఒక్కసారిగా కొప్పుకొలుతుంది. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన ఓజస్సు కవచానికి పగుళ్లు ఏర్పడతాయి. ఆ ఎగ్జాక్ట్ టైం లో మన కవచం దెబ్బ తింటుంది. అక్కడే తిరుగుతూ ఉన్న ఆ ప్రేతం యొక్క ప్రతిబింబం ఆమె ప్రాణమయ్య కోసం వెళ్లి లాక్ అయిపోతుంది.
(18:33) ఇప్పుడు అర్థమైందా ఈ దెయ్యాలు భూతాలు ఎందుకని భయపెడుతూ ఉంటాయో నువ్వు భయపడితే వాటికి తాళాలు ఇచ్చినట్టే రెండవది వ్యసనాలు అండ్ మానసిక స్థితి. విపరీతమైన ఆల్కహాల్, డ్రగ్స్ తీవ్రమైన డిప్రెషన్ లేదా అతి కామం వల్ల శరీరంలోని ఓజస్సు కరిగిపోతుంది. అప్పుడు కవచం పలచబడిపోయి బయట శక్తులకు గేట్లు తెరుచుకుంటాయి. మూడవది గ్రహదోషాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మన మనస్సుకి అధిపతి.
(19:02) జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండి రాహువు లేదా కేతువు లేదా శని వంటి గ్రహాల తీవ్ర ప్రభావం ఉన్నప్పుడు ఆ కాస్మిక్ రేడియేషన్ వల్ల వాళ్ళ మానసిక ఫ్రీక్వెన్సీలు దెబ్బతింటాయి. అప్పుడు జరిగే గ్రహ ప్రభావమే వాళ్ళని పిచ్చివారిలా మార్చడం లేదా బయట శక్తులకి తలుపులు తెరవడం చేస్తుంది. [సంగీతం] నెల మొత్తం బాగుంటూ కేవలం అమావాస్య పౌర్ణమి రోజుల్లోనే విచిత్రంగా ప్రవర్తించిన వాళ్ళని మీరు చూసే ఉంటారు.
(19:26) నాలుగవది రక్త సంబంధం జాతరలలో దేవతా గణాలు అందరినీ వదిలేసి కొందరి మీదకి ఎందుకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ తరతరాలుగా వాళ్ళ నాన్నలు, తాత ముత్తాతలు ఆ దేవతలకి చేసిన పూజలు వాళ్ళ రక్తంలో ఉన్న జెనటిక్ మెమరీ వాళ్ళ నాడీ మండలం ఆ దేవతకి ఆల్రెడీ ట్యూన్ అయి ఉంటుంది. ఆ దేవతకు సంబంధించిన గణాలు వీళ్ళకి పూనుతూ ఉంటాయి. ఇదంతా సరే అద్దంలో రిఫ్లెక్షన్ పడినట్టు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ప్రేతం ఆ అమ్మాయి యొక్క ప్రాణమయ్య కోసంలోకి ప్రవేశించింది.
(19:54) కానీ అసలైన మిస్టరీ ఇక్కడే ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క శరీరం ఎప్పుడో స్మసానంలో కాలి బూడిదయపోయింది. ఇప్పుడు ఆ ప్రేతానికి భౌతికమైన కాళ్ళు లేవు చేతులు లేవు మెదడు లేదు. మరి ఒక రిఫ్లెక్షన్ లాంటి గాలి రూపం ఆ అమ్మాయి యొక్క ఫిజికల్ కండరాలని ఎలా కదిలించింది రెండు కాళ్ళు బాగున్న ఆ అమ్మాయిని రాత్రిపూట మోకాళ్ళ మీద కుంటుతూ నడిచేలా ఎలా ఫోర్స్ చేసింది ఆ అమ్మాయి గొంతులో నుంచి అతని వాయిస్ ఎలా వచ్చింది ఈ రహస్యాన్ని డీకోడ్ చేయాలంటే మనం బృహదధారణ్యక ఉపనిషత్తులోకి వెళ్లాలి చాలామంది ఉపనిషత్తులో అంటే కేవలం ఆత్మ పరమాత్మ గురించి చెబుతాయి అనుకుంటారు కానీ
(20:29) బృహదారణ్యక ఉపనిషత్తులో రెండు డైరెక్ట్ పొసెషన్ కేసులు కూడా రికార్డు అయ్యి ఉన్నాయి ఉద్దాలక ఆరుణి అనే మహర్షి పతంచల కాప్యుడు అనే వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పతంచల కాప్యుడి భార్యని కబంధ అధర్వన అనే గంధర్వుడు ఆవహించి ఉంటాడు. ఆ మహిళ గొంతులో నుంచి ఆ గంధర్వుడు మహర్షులని ఒక ప్రశ్న అడుగుతాడు.
(20:51) ఏ సూత్రముతో సమస్త జీవుల అవయవాలు కట్టబడి ఉన్నాయో ఆ సూత్రం ఏంటో నీకు తెలుసా అని అప్పుడు మహర్షి సమాధానం చెబుతాడు. వాయుర్వై గౌతమ తత సూత్రం ఓ గౌతమ మనిషి అవయవాలను నడిపించే ఆ అదృశ్యమైన దారమే వాయువు అని చెబుతాడు. మనిషి చనిపోయినప్పుడు శరీరం అక్కడే ఉంటుంది. నరాలు అక్కడే ఉంటాయి. కండరాలు అక్కడే ఉంటాయి. కానీ శరీరం కదలదు. ఎందుకంటే ఆ కండరాలను లాగే వాయువు అనే దారాలు తెగిపోతాయి కాబట్టి మన నాడుల్లో ప్రవహించే పంచ ప్రాణ వాయువులే మన ఫిజికల్ నెర్వస్ సిస్టం ని నడిపించే అసలైన కంట్రోల్ కేబుల్స్.
(21:24) బయట నుంచి వచ్చిన ప్రేతానికి భౌతికమైన చేతులు లేవు కాబట్టి అది నరాలను డైరెక్ట్ గా పట్టుకోలేదు మన ప్రాణమయ్య కోసం ఉండే వాయువులని అది హైజాక్ చేస్తుంది. అందుకే మనం వింటూ ఉంటాం గాలి సోకింది అని దీనిలో ముఖ్యంగా రెండు వాయువులు ఉంటాయి. వ్యాన వాయువు మన శరీరం మొత్తంలో కండరాల కదిలికను జాయింట్లను శాసించేది వ్యాన వాయువు. చనిపోయిన ఆ వ్యక్తికి బ్రతికి ఉన్నప్పుడు కాలు కుంటిది.
(21:48) అతని భౌతిక శరీరం కాలిపోయినా సరే అతని సూక్ష్మ శరీరపు మెమొరీలో అంటే చిత్తంలోని వాసనల్లో నాకు ఒక కాలు పని చేయదు అని బ్లూప్రింట్ బలంగా రికార్డ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రేతం ఆ అమ్మాయి వ్యానవాయువుని హైజాక్ చేసిందో అతని మెమరీ ఆ అమ్మాయి మోటార్ నెర్వస్ సిస్టం మీద ఓవర్రైట్ అయిపోతుంది. అందుకే ఆ అమ్మాయికి రెండు కాళ్ళు బాగున్నా సరే హైజాక్ చేయబడిన వ్యాన వాయువు ఆమె కాళ్ళను మడిచేసి మోకాళ్ళ మీద కుంటుతూ నడిచేలా చేసింది.
(22:12) రెండవది ఉదాన వాయువు మన గొంతు దగ్గర ఉండి స్వరపేటికను మాటలను శాసించేది ఉదాన వాయువు. ఆ ప్రేతం ఆమె ఉదాన వాయువుని లాక్ చేయగానే ఆమె స్వరపేటిక అతని ఫ్రీక్వెన్సీలోకి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆమె గొంతులో అతని వాయిస్, అతని పేరు అతనికి కవల పిల్లలు పుట్టిన రహస్యం బయటకి వచ్చాయి. కానీ ఇలా జరిగినప్పుడు ఆ అమ్మాయి యొక్క సొంత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది.
(22:33) ఒక శరీరంలో రెండు ఆత్మలు ఒకేసారి డ్రైవింగ్ చేయలేవు. అలా అని ఆ అమ్మాయి చనిపోను లేదు. ఎప్పుడైతే ఇటువంటి శక్తులు మన వాయువుని హైజాక్ చేస్తాయో అప్పుడది మనలో ఉన్న జీవాత్మ యొక్క కాన్షియస్నెస్ ని బలవంతంగా సుషుప్తిలోకి నెట్టేస్తుంది. ఐ మీన్ ఒక కోమా లాంటిది. అంటే కారు ఓనర్ ని వెనక సీట్లో కట్టేసి దొంగ కారు నడిపినట్టు. ఆ అమ్మాయి ఆత్మ శరీరం లోపల బంది అయి ఉంటుంది కానీ మెథడులో ఇది నేను అని ఎరుక పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది.
(23:01) అందుకే తను ఎన్ని చేసినా అది దిగిపోయాక కళ్ళు తెరిచి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. కానీ ఈ గాలి సోగటం ఈ పూనకాలు 90% ఆడవాళ్ళకి ఎందుకు జరుగుతాయి. ఆడవాళ్లు మానసికంగా వీక్ అని కాదు అసలు రహస్యం అంతా వాళ్ళ బయాలజీ లోనే ఉంది. వాళ్ళ శారీరక నిర్మాణంలో ఉంది. మనం గమనిస్తే బృహదారిణ్యక ఉపనిషత్తులో కూడా గంధర్వులు ఆవహించింది పతంచల కాపీడి కూతురికి ఇంకా అతని భార్యకి.
(23:29) ఎందుకంటే ఈ సృష్టిలో తన సొంత శరీరం లోపల మరొక ప్రాణాన్ని మరొక జీవాత్మని తొమ్మిది నెలల పాటు మోసి పోషించగలిగే బయోలాజికల్ అండ్ ఎనర్జిటిక్ సామర్థ్యం కేవలం [సంగీతం] స్త్రీ గర్భానికి మాత్రమే ఉంటుంది. అంటే స్త్రీ దేహానికి ఇంకొక ఆత్మను తనలోకి స్వీకరించే గ్రాహక శక్తి ఉంటుంది. ప్రతి మనిషిలో ఇడా పింగల నాడులు ఉంటాయి. కానీ మగవారిలో పింగల నాడి ఆధిపత్యంగా ఉంటుంది అంటే సూర్య నాడి ఇది ఒక రక్షణ గోడ లాగా పనిచేస్తూ ఉంటుంది.
(24:01) స్త్రీలలో ఎడ నాడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అంటే చంద్ర నాడి చంద్రతత్వం అంటేనే స్వీకరించే తత్వం అయస్కాంతం లాగా లాక్కునే తత్వం పైగా ఋతుక్రమం లేదా ప్రసవ సమయంలో రక్తం బయటకు వెళ్లడం వల్ల రక్తం నుండి తయారయ్యే ఓజస్సు తాత్కాలికంగా పలచబడుతుంది. అందుకే ఈ అదృశ్యశక్తులకి మగవాడి శరీరాన్ని బద్దలు కొట్టడం కంటే స్త్రీ శరీరంలోకి ప్రవేశించడం చాలా సులభం.
(24:27) మరి మగవాళ్ళకి రాధా అంటే వస్తుంది. మద్యం డ్రగ్స్ తీవ్రమైన డిప్రెషన్ లేదా క్షుద్ర ప్రయోగాల వల్ల మగవారి యొక్క సూర్య నాడి కవచం పగిలినప్పుడు ఇటువంటివి వస్తూ ఉంటాయి. కానీ మగవారిలోకి ఇటువంటి శక్తులు ప్రవేశిస్తే ఆ సూర్య నాడి యొక్క తీవ్రత వలన ఆ ఆవేశం ఆడవారి కంటే 10 రెట్లు ఎక్కువ హింసాత్మకంగా ఉంటుంది. ఇకపోతే రెండవ రహస్యం ఆయుర్వేదం మర్మ శాస్త్రం ప్రకారం తల పై భాగంలో ఉండే బ్రహ్మరంద్రం ఇంకా మనం జడ ముడి వేసుకునే చోట ఉండే బిందు విసర్గం దగ్గర మెడలో ఉండే వేలాది సూక్ష్మ నాడుల యొక్క చివర్లో వెంట్రుకల కుదలతో కనెక్ట్ అయి ఉంటాయి. మన తల మీద ఉండే ప్రతి
(25:04) వెంట్రుక మన ప్రాణమయ్య కోసానికి బయట ఉండే ఒక ఫైబర్ ఆప్టిక్ యాంటినా. జుట్టుని గట్టిగా ముడి వేసినప్పుడు ఆ ఎనర్జీ సర్క్యూట్ లాక్ అయిపోతుంది. అధర్మను వేదం ప్రకారం ఇటువంటి సూక్ష్మ శరీరాలు కలిగిన ఈ శక్తులు అనేవి గంధ తన్మాత్ర అని చెప్పబడి ఉంది. అంటే వాసన ద్వారా ఆకర్షింపబడతాయి అని అందుకే పూలు పెట్టుకొని జడ విరబోసుకొని వెళ్లొద్దు అని చెబుతారు.
(25:29) ఆ అమ్మాయిలో ఉన్న ప్రేతాన్ని బయటకు లాగడానికి తాంత్రికుడు ఎర్రటి కోడి రక్తం కలిపిన అన్నాన్ని పెట్టాడు. అదే జాతరలో దేవతా గణం పూడినప్పుడు పసుపు నీళ్ళని నిమ్మరసాన్ని ఇస్తారు. ప్రేతాలకి ఎర్రగా ఉండే రక్తము. దేవతా గణాలకి పసుపు రంగు, నిమ్మరసం ఎందుకు ఇవ్వాలి? ఈ విశ్వంలో ప్రతి జీవి బ్రతికేది ప్రాణశక్తి మీదే. ఈ ప్రాణశక్తి ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి మారేటప్పుడు ప్రకృతిలో ఒక రహస్యమైన ఆల్కమీ కోడింగ్ ఒకటి నడుస్తుంది.
(25:58) పసుపు రంగు అనేది ప్రాణశక్తికి ఒక పునాది లాంటిది. అండ్ ఈ ఎరుపు రంగు అగ్నితో మండుతూ ఉన్న యాక్టివ్ స్టేట్ లో ఉండే ప్రాణశక్తి. దీనికి మూడు ప్రత్యక్ష సాక్షాలు కూడా ఉన్నాయి. మనం ప్రకృతిలో గమనిస్తే నిజమైన స్వచ్ఛమైన పసుపు కొమ్ముని తీసుకొని దానికి సున్నం అంటే క్షార అగ్నిని కలిపితే అది రక్తం లాంటి ఎర్రటి కుంకుమగా మారుతుంది. రెండవది మన శరీరంలో జరుగుతూ ఉంటది.
(26:23) మనం తిన్న ఆహారం అరిగాక మొదట లేత పసుపు రంగు రసంగా మారుతుంది. మన లివర్ లో ఉండే తేజస్సు దానినే రంజక పిత్తం అని అంటారు. అది ఆ పసుపు రసాన్ని ఉడికించినప్పుడు అది ప్రాణశక్తితో నిండిన ఎర్రటి రక్తంగా మారుతుంది. మూడవది మూలాధార చక్రం దగ్గర. మన వెన్నెపూస చివర ఉండే మూలాధార చక్రం యొక్క రంగు, ఎరుపు. సరిగ్గా అదే స్థానంలో ఒకటి జరుగుతుంది.
(26:48) మన బాడీ కి కావలసిన ప్రాణశక్తి అంతా ఎర్రటి రక్తంలో ఉంటుంది. అందులో నుంచి తీసేయబడిన వ్యర్థం మాత్రం పసుపు రంగులోకి మారి బయటకి విసర్జించబడుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రాణశక్తికి రెండు రంగులు ఉన్నాయి. ఇక్కడ పసుపు రంగు అన్నది ప్రాణశక్తికి ఒక బేస్ ఎలిమెంట్. అది ఆక్టివేట్ అయిన తర్వాత అంటే అందులోకి అగ్ని ప్రవేశించిన తరువాత, అది ఎర్రగా మారుతుంది.
(27:10) సో, రక్తంలో ఆ జీవి యొక్క ప్రాణశక్తులు ఉంటాయి. ఈ ప్రేతాలలో తేజస్సు అస్సలు ఉండదు. అవి ఆహారాన్ని తిని బేస్ లెవెల్ లో ఉన్న ప్రాణశక్తిని యాక్టివేటెడ్ ప్రాణశక్తిగా మార్చుకోలేవు. సొంతంగా ప్రాణశక్తిని తయారు చేసుకోలేవు. అందుకే వాటికి రెడీమేడ్ గా ఉడుకుతూ ఉన్న ప్రాణశక్తి కావాలి. అదే ఎర్రటి రక్తం. అలా ఈ ప్రాణశక్తితో ఉన్న ఎర్రటి రక్తాన్ని చూపించినప్పుడు అవి డైవర్ట్ అవుతూ ఉంటాయి.
(27:34) అలాగే దేవతా గణాలు అనేవి ప్రేతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. వాళ్ళు ఉగ్ర తేజస్సుతో ఉంటారు. అంటే మండుతూ ఉన్న అగ్ని స్వరూపాలుగా ఉంటారు. అవి మనిషిలోకి దిగినప్పుడు ఆ హై వోల్టేజ్ వేడికి ఆ మనిషి యొక్క నాడులు మెదడులో ఉండే కణాలు కాలిపోయే ప్రమాదం ఉంది. ఆ మనిషిని కాపాడాలంటే లోపల మండుతూ ఉన్న ఆ ఎరుపుని ఐ మీన్ ఉగ్రంగా రగిలే అగ్నిని చల్లార్చి మళ్ళీ శాంతమైన పసుపులోనికి తీసుకురావాలి.
(28:01) మీరు బాగా గమనిస్తే ఎర్రగా మారిన స్వచ్ఛమైన కుంకుమ మీద కనుక మీరు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని పిండితే ఆ నిమ్మకాయలు ఉండే ఆమ్ల తత్వం వలన అందులో ఉన్న వేడిని అక్కడికక్కడికే చంపేసి న్యూట్రలైజ్ చేసి ఆ ఎర్రటి కుంకుమని తిరిగి మళ్ళీ పసుపు రంగులోకి మార్చేస్తుంది. ఈ కుంకుమలో ఏదైతే జరుగుతూ ఉందో ఆవేశంతో ఊగుతూ ఉన్న మనిషి శరీరం లోపల కూడా నిమ్మకాయ సరిగ్గా అదే పనిచేస్తుంది.
(28:26) పసుపు నీళ్ళని తలమీద పోసినప్పుడు కూడా ఈ న్యూట్రలైజింగ్ జరుగుతుంది. ఈ వీడియోను చూస్తూ ఉన్న మీలో ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి సంఘటనని చూసే ఉంటారు. లేదా భవిష్యత్తులో చూస్తారు. సైన్స్ వీటికి ఏదో ఒక పేరుని పెట్టేస్తుంది. కానీ సైన్స్ కు కూడా హద్దులు ఉన్నాయి. సైన్సు ఇంకా అన్వేషిస్తూనే ఉంది. మనం తేజస్సు ఓజస్సు గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా అవి బలహీనంగా ఉంటే బయట శక్తులు వచ్చి ఆక్రమిస్తాయి అని మాట్లాడుకున్నాం.
(28:57) కానీ కొందరి యోగుల జీవితంలోకి వాళ్ళ శరీరంలోకి డైరెక్ట్ గా ఆ దేవత యొక్క శక్తి వచ్చి జీవిస్తుంది అని కూడా చెప్పుకున్నాం. అలాంటప్పుడు వాళ్ళ ఓజస్సు, తేజస్సు బలహీనంగా ఉందనా కాదు. అసలైన దేవతా శక్తులు తలుచుకుంటే ఎంతటి బలమైన కోటనైనా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించగలవు. జుట్టు విరపోసుకొని వెళ్ళకూడదు అని మాట్లాడుకున్నాం.
(29:18) కానీ మన లోపల ఉన్న కవచం గనుక వజ్రం లాగా బలంగా ఉంటే మనం అర్ధరాత్రి జుట్టు వెరబోసుకొని వెళ్ళినా సరే ఎలాంటి భయంకరమైన ప్రదేశంలో అడుగుపెట్టినా ఎవరు మన మీద ఎలాంటి క్షుద్ర ప్రయోగం చేసినా ఆఖరికి మన జాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే ఏ నెగిటివ్ శక్తి మన వెంట్రుక కూడా తాకలేదు. అంతే కాదు ఈ ఓజస్సు అన్నది కేవలం భూత ప్రేతాల నుండి కాపాడే కవచం మాత్రమే కాదు మన లోపల నిద్రాణంగా ఉన్న ఆ కాస్మిక్ శక్తిని నిద్రలేపే తాళం చెవి ఇదే ఎవరిలో అయితే ఓజస్సు తేజస్సు అత్యంత శక్తివంతంగా ఉంటాయో వాళ్ళ మనసులో కోరుకునే ప్రతిదీ వాళ్ళు చేసే మేనిఫెస్టేషన్ ఊహించని వేగంతో
(29:55) పనిచేస్తుంది. మీ కెరియర్ లో మీకు డబ్బులు వచ్చే విధానంలో ప్రతి మార్గంలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ పటాపంచులు అవుతాయి. మనలో ఉన్న ఆ తేజస్సుని ఓజస్సుని అంత శక్తివంతంగా ఎలా మార్చుకోవాలి నిజం చెప్పాలంటే ఇటువంటి రహస్యమైన పద్ధతులని మీరు బయట ఒక లక్ష రూపాయలు లెక్క కట్టి ఇచ్చినా సరే ఎవ్వరు మీకు చెప్పరు ఎందుకంటే 99% మందికి అసలు ఈ రహస్యాలు తెలియవు తెలిసిన ఆఒక్క శాతం మంది వీటిని బయటకు చెప్పరు.
(30:23) గత 10 సంవత్సరాలుగా ఈ విశ్వం గ్రహాలు ఎనర్జీ మెకానిక్స్ మేనిఫెస్టేషన్ మరియు ప్రాచీన తాంత్రిక శాస్త్రాల మీద నేను చేసిన పరిశోధనలు అన్నిటిని కేవలం ఒక థియరీగా కాకుండా మీ జీవితంలో 100% పనిచేసే ఒక ప్రాక్టికల్ వర్కింగ్ మెథడ్స్ లాగా మార్చి ఒక చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేంత సులభంగా ఈ రహస్యమైన పుస్తకంలో నేను పొందుపరిచాను. సమయం ఆసన్నమైంది. చుట్టూ ఉన్న మెనిపులేషన్లు పడి జీవితంలో దారి తెలియక తపిస్తూ ఉన్న వాళ్ళకి ఈ ఆయుధాన్ని అందించమని నా గురువులు నేను ఆరాధించే దేవి నాకు ఆదేశం ఇచ్చారు.
(30:55) రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ పుస్తకం గురించి పూర్తి వివరాలు మీ ముందు ఉంచబోతున్నాను. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు బాగా తెలుసు. [సంగీతం]

No comments:

Post a Comment