🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘
🤔నీవెన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించినా, ఎన్నో కోట్లు కూడ బెట్టినా, అవేవీ నీ చావును ఒక్కక్షణం ఆపగలవా? లేదా ఒక్క నిమిషం నీ చావును వాయిదా వేయగలవా? అదేమిటో చూద్దామా..
అది మద్రాసు నగరంలోని ప్యారీస్ కార్నర్ కు మరోవైపు ఉన్న గోవిందప్ప నాయకన్ స్ట్రీట్, ఆ వీధిలో నివాసముంటూ ధనలక్ష్మీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే పేరుతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు చంపాలాల్. ఇతని దృష్టిలో ఈ ప్రపంచంలో అతి విలువైనది డబ్బే అంటూ ఇప్పటివరకు తన జీవితంలో సమయాన్ని మొత్తం కేవలం డబ్బు సంపాదనకే కేటాయించిన వాడు చంపాలాల్. అయితే కొద్దిరోజుల క్రితం అతడు హటాత్తుగా మరణించాడు. ఆయన చనిపోయే ముందు ఒక సందేశాత్మక ఉత్తరం వ్రాసి అందులోని సారాంశాన్ని తన తోటి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అందించ వలసినదిగా తన కొడుకులను కోరాడు. చంపాలాల్ కొడుకు చందులాల్, తన తండ్రి మరణానంతరం వారి నిర్వహణలోనే ఉన్న జైన్ మెమోరియల్ హాల్ నందు, తన తండ్రి మరణానంతర సంతాప సభను ఏర్పాటు చేశాడు. తన తండ్రి చివరి కోరికగా తన తండ్రి తాను చివరి సారిగా రాసిన ఉత్తరం యొక్క సారాంశాన్ని తమ తోటి వ్యాపారులకు తెలియచేయడం కోసం సభను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇంతకూ ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటంటే, అది సుమారు అరవై సంవత్సరాల క్రితం మాట, అప్పుడు చంపాలాల్ వయసు పది సంవత్సరాలు. గుజరాత్ లో ఓ కుగ్రామంలో ఉండే చంపాలాల్ కుటుంబం చాలా బీదది మరియు పెద్దది. చంపాలాల్ తండ్రి సంపాదన అంతంత మాత్రమే. కుటుంబం సరైన భోజనం చేయడానికి కూడా కష్టంగా ఉన్న సమయంలో మద్రాసు నగరంలో ఉండే మహావీర్ జైన్ ఇంట్లో పనిచేయడానికి అక్కడకు పంపబడినాడు చంపాలాల్. తన జీతం డబ్బులు తన తండ్రికి చేరేవి తప్ప ఇతడికి మాత్రం ఇంటికి వెళ్ళడం కుదిరేది కాదు. చాలా అరుదుగా వెళ్ళేవాడు. పని వత్తిడి అలా తీవ్రంగా ఉండేది. అలా పని చేస్తూ వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నాడు. బాగా డబ్బు సంపాదించాలన్న కసితో మద్రాసులోనే ఉంటూ కష్టపడి పనిచేస్తూనే మెల్లగా వ్యాపారాన్ని మొదలు పెట్టి ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ, రేయింబవళ్ళు కష్టపడి వందలనుండి వేలు, వేలనుండి లక్షలు, లక్షలనుండి కోట్లు సంపాదించాడు. ఎన్నో ఆస్తిపాస్తులను కూడగట్టేందుకే తన జీవితాన్ని అంకితం చేశాడు. వివాహం జరిగి పిల్లలు కలిగి వారూ పెద్దవారై పెళ్ళిళ్ళు అయినా సరే చంపాలాల్ వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించక ఇప్పటికీ వ్యాపారాన్ని తన చేతుల మీదుగానే నడిపిస్తున్నాడు.
అలా క్షణం తీరికలేకుండా ఎప్పుడూ వ్యాపారం, సంపాదన అంటూ బిజీగా గడుపుతున్న చంపాలాల్ కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆనందంగా గడపడానికి సమయం అస్సలు ఉండేది కాదు. తోటి బంధుమిత్రులు ఇంకా ఎంతకాలం సంపాదిస్తావు, ఉన్నది చాలు కదా ఇక వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించి కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా మనుమలు మనుమరాల్లతో హాయిగా గడిప వచ్చుగదా అనేవారు. కానీ నేను వారితో గడిపే సమయాన్ని నా వ్యాపారానికి కేటాయిస్తే మరో లక్ష రూపాయలు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నా కుటుంబ సభ్యులు సంతోషంగా, ఆనందంగా జీవిస్తారని అనేవాడు. మనిషి జీవితంలో డబ్బే విలువైనది. ఎందుకంటే చిన్న తనంలో తాను పడ్డ కష్టాలు తనవారు పడకూడదు అనుకుంటూనే ఓపిక ఉన్నంతవరకు తన పిల్లలు, వారి పిల్లలు, వారివారి పిల్లలు సుఖంగా, హాయిగా జీవించడానికి అవసరమైన డబ్బును సంపాదించి వారిని ఆనందంగా ఉంచడమే తన ముఖ్య ఉద్దేశం అని చెప్పేవాడు. కాలం గడుస్తున్నది, ఒకరోజు వ్యాపార పనులు ముగించుకొని కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్న చంపాలాల్ ను ఎవరో తట్టి తట్టి "లే పోదాం పద ఇక్కడ ఇక నీ టైం అయిపోయింది " అంటూ ఎవరో గంభీర స్వరంతో పిలుస్తూ లేపుతున్నారు.
కళ్ళు తెరిచి చూసాడు చంపాలాల్, ఎదురుగా వజ్ర ఖచిత మణి మాణిక్య ఆభరణాలతో అలంకరించబడి ఉన్న ఆజానుబాహుడైన ఒక దేవతామూర్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు అని అడగబోయి పక్కనే ఉన్న దున్నపోతును చూసిన అతనికి అర్థం అయ్యింది ఆయన యమధర్మరాజు అని. అయినా ఏమిటి ఎందుకొచ్చారు అని అడిగాడు. ఇక్కడ నీ టైం అయిపోయింది. ఇక నాతో యమపురికి బయలుదేరు అన్నాడు. లేదు లేదు నేను నా కుటుంబంతో ఇంకా సంతోషంగా, ఆనందంగా ఒక్కపూట కూడా గడపనేలేదు. వారి ఆనందం కోసం నేను ఇక్కడ డబ్బు సంపాదించ వలసినది చాలా ఉంది. దానికే నాకు టైం సరిపోవడం లేదు, కాబట్టి నేను ఇప్పుడే వచ్చే ప్రసక్తే లేదని అన్నాడు. అందుకు యమధర్మరాజు కోపంతో చెప్పేది నీకే, ఇక్కడ నీ సమయం అయిపోయింది. పోదాంపదా అంటూ హుంకరించాడు.
ఇక లాభం లేదని తను లంచాలిచ్చి అధికారులను లోబరుచు కొన్నట్లుగా యముడిని కూడా కొనేస్తే సరిపోతుంది కదా అనుకుంటూ, సరే నీకు నేను రెండు కోట్లు ఇస్తాను నన్ను రెండు నెలలు వదిలై, ఈ లోపు నేను సంపాదించిన డబ్బును, నా ఆస్తి పాస్తులను, నా వ్యాపారాన్ని నా కొడుకులకు అప్పగించి వారితో ఆనందంగా ఈ కొన్ని రోజులైనా గడిపి వస్తాను అన్నాడు. అందుకు కుదరనే కుదరదు అన్న యముడితో సరే నీకు పది కోట్లు ఇస్తాను నన్ను ఒక్కరోజైనా నా నావారితో ఆనందంగా ఉండనివ్వండి. నేను సంపాదించినవి అన్ని అందరికీ అప్పగించి వస్తాను అన్నాడు. అందుకూ వొప్పుకోనన్న యముడిని ఎలాగైనా లొంగదీసుకోవాలన్న చంపాలాల్ చివరికి నా యావదాస్తినీ నీకు ఇస్తాను నాకు "ఒక్క గంటైనా నా కుటుంబంతో గడపడానికి సమయమివ్వండి, నా వాళ్ళతో ఆనందంగా గడిపి వస్తానంటూ " ప్రాధేయపడ్డాడు. నీవు ఎన్ని కోట్లను ఇచ్చినా నాతో ఒక్క క్షణాన్ని కూడా కొనలేవు, ఇక నీకు టైం లేదు. ఇంక నీకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండే అర్హత లేదు, నాతో బయలుదేరిరా అన్నాడు.
అప్పుడు అర్ధం అయ్యింది చంపాలాల్ కి ఇంతకాలం తన జీవితంలో అతి విలువైనది డబ్బు అనుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందంగా గడపలేక పోయాను. అందుకు ఒకపూట కూడా సమయాన్ని కేటాయించలేదు. ఇప్పుడు నేను జీవితాంతం ఏంతో కష్టపడి సంపాదించినది, అతి విలువైనది అని భావించిన డబ్బును అంతా పెట్టినా ఒక్క క్షణాన్ని కూడా కొనలేక పోయాను. కనీసం ఈ సందేశాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పే సమయం కూడా లేకపోయిందంటూ యమధర్మరాజు పాదాలు పట్టుకొని ఏడ్చి, చివరికి తన వారికి ఒక ఉత్తరం వ్రాయడానికి అవకాశం కల్పించాలంటూ ప్రాధేయపడ్డాడు. చంపాలాల్ బాధను చూసి కరిగిపోయిన యముడు అందుకు అవకాశం ఇచ్చాడు. ఆ కొంత సమయంలో అతడు తన కుటుంబ సభ్యులకు ఈ ఉత్తరం ద్వారా ఇచ్చిన సందేశం ఏమిటంటే "మనిషికి డబ్బు అవసరమే కానీ జీవితాంతం వరకు డబ్బు సంపాదనే ధ్యేయం కాకూడదు. డబ్బును సంపాదించడం వల్ల వచ్చే ఆనందం కన్నా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే కొంత కాలమైనా విలువైనది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తమ కుటుంబ సభ్యులతో కొంత సేపైనా గడపండి. అదే డబ్బు కన్నా విలువైనది". నేను తప్పుచేశాను. అదే తప్పును మీరూ చేయకండి. "ప్రతిరోజూ మీ కుటుంబం కోసం ఒక గంట సమయాన్ని కేటాయించి వారితో ఆనందంగా గడపండి". అనే సందేశాన్ని ఆ ఉత్తరం ద్వారా అందరికీ అందించాడు.
కాబట్టి మిత్రులారా ! మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో గానీ ప్రస్తుతం ఈ కరోనా వైరస్ పుణ్యమా అంటూ కొన్ని రోజులు, ఇరవైనాలుగు గంటలూ మనం మన కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సంతోషంగా, ఆనందంగా గడిపే అవకాశం కలిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీమీ ఇండ్లలోనే ఉంటూ, ఎవ్వరూ బయటకు రాకుండా, ఇంట్లో ఉన్నవాటిని వండుకొని తింటూ, నీ తల్లిదండ్రులతో, భార్యా పిల్లలతో ఆడిపాడుతూ, గడిచిపోయిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ, ఇలాంటి మంచి మెసేజ్ లను అందరికీ పంపించుకొంటూ, మీ జీవితాలను ఆనందమయం, సుఖమయం, సంతోషమయం చేసుకొంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ..
సర్వే జనా సుఖినోభవంతు.
-రామభక్త గురూజీ ప్రొద్దుటూరు.
సెల్-8328170075.*

No comments:
Post a Comment