Thursday, April 23, 2020

ఎవరు నువ్వు ? ఎందుకు బాధపడు తున్నావు ?

ఎవరు నువ్వు ?



💐💐💐💐💐💐💐




ఎందుకు బాధపడు తున్నావు ?

అసలు బాధపడడానికి ఎవరు నీవు ?

నీవు బాదపడడానికి గల కారణం ఏమిటి ?

అసలు నీవు శరీరానివి అనుకుంటున్నావు ,

నీ మనస్సు నిన్ను ఏమరుస్తుంది చూడు.. .
నిన్ను శరీరానికి పరిమితంగా నిన్ను చేస్తుంది .
కాని నీ మనస్సుకు లొంగ కుండా నీవు ఆత్మస్వరూపానివని నిరంతరం నమ్ము!

ఆత్మకు బాదరాదు, అగ్నిలో కాలదు, నీటిలో తడవదు.

అసలు ఆత్మకు చావులేదు.. ఎందుకంటె ఆత్మకు చావు పుట్టుకలు లేవు..

శరీరాలను మార్చుకుంటూ పోతూ ఒక్కొక్క జన్మలో ఒక్కో పాఠం నేర్చుకోడానికి వస్తూ ఉంటుంది..

ఈ జన్మలొ డాక్టరుగా , ఏరొక జన్మలొ ఏక్టరుగా , ఒక జన్మలొ దొంగగా , వేరొక జన్మలొ వేరొక విధంగా జన్మ తీసుకుంటుంది .

మరి ఈ జన్మలో ఎందుకు నీవు బాధపడు తున్నావు ?

ఏమి తెచ్చావని బాదపడుతున్నావు,
ఏమి పోతున్నదని బాదపడుతున్నావు.
ఏమి పట్టికెల్లిపోదామనుకు౦టున్నావు.
అన్నీ ఇక్కడే వదిలి వెడతావుగా నువ్వు!
అంత మాత్రానికి ఎందుకు బాదపడు తున్నావు ?

ఎవరు నీవు ? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా నేను ఎవరు అని?*
ఈ రోజు ప్రశ్నించుకో ఇప్పుడే ప్రశ్నించుకో, ఆలోచించకు… ప్రశ్నించుకో నేను ఎవరు అని!

జవాబు దొరికే వరకు విశ్రమించకు!

ప్రశ్నిస్తూనే ఉండు నేనుఎవరు అని..

“ఎవరు నేను” అని..అదే జీవిత లక్ష్యంగా పెట్టుకో…

అంతే గాని భార్యకొరకో, భర్తకొరకో, బిడ్డ కొరకు కాదు…

నీవు వచ్చింది సరదాగా, ఆనందంగా జీవిత పాటాలు నేర్చుకోడానికి. వాటిని అనుభవించడానికి వచ్చావు.

అంతే కాని బాదపడడానికి, ఏడవ డానికి రాలేదు!

గుర్తుంచుకో…

నీవు ఆత్మ పదార్దానివని ,

శరీరాన్ని దాల్చి నిన్ను నీవు చూసు కోవడానికి పుట్టావు .

మరచిపొయి బాదపడుతున్నావు .

నీవు నిరంతరం ఆనందంగా ఉండడం నేర్చుకుంటే,
బాధ భయంతో పారిపోతుంది…

నేను చెప్పేది నిజం! నన్ను నమ్ము.

నేను చెప్పేది విశ్వసించు…

నిన్ను నివు నమ్ముకో ,

ఎవరిని నమ్మకు, నిరంతరం ఆనందముగా ఉండడం నేర్చుకో…

ఎలాంటి పరిస్థితులు ఎదురయినా సున్నితంగా చూడడం నేర్చుకో.

నిన్ను ఏ పరిస్థితి ఏమి చేయలేదు…

ఎందుకంటె నేను చెప్పానుగా నీవు ఆత్మ పదార్దానివని..

ఇది గుర్తు పెట్టుకుంటే చాలు .

నీవు ఆనందముగా ఉంటావు నీ జీవితానికి ధన్యత చేకూరుతుంది. 🙏

No comments:

Post a Comment