Tuesday, April 28, 2020

లక్ష్మి = లక్ష్యము = విజయము = సంపద

లక్ష్మి = లక్ష్యము = విజయము = సంపద
🌷🌺🌹💐🌸🌺🌹🌷
లక్ష్మి అను పదము వినగానే లక్ష్మి దేవి సకల సంపదల ప్రదాయిని గా జనసామాన్యాలు భావించి వెంటనే విష్ణు పత్నిమ్, ప్రసన్నాక్షిం, నారాయణ సమాశ్రితామ్
అని స్మరిస్తారు, ఇది సర్వ సాధారణము.
సంస్కృతములో లక్ష్మి అన్న పదానికి మూల ధాతువు లక్ అనగా పరిశిలించుట, ఇదే ధాతువు ను లక్ష్యము
అను పదములో కూడా చూస్తాము.
లక్ష్మీ పదముకున్న నానార్తములలో లక్ష్యము, గురి, బుద్ధి, సంపదలు, సౌభాగ్యము, విజయము, ధైర్యము మొదలగునవి.
లక్ష్మిని వేదాలలో లక్ష్మాయితి లక్ష్మి అంటారు... అనగా జనులను ఉద్ధరించే లక్ష్యము కలది. పండితులు, పెద్దలు ఆలక్ష్యము కూడదు అని హెచ్చరిస్తారు. ఆలక్ష్యము అనగా శ్రద్ద లేనిది అని చెప్పుకునవచ్చును.
ఆ మాటకొస్తే శ్రద్ద లేని జీవితమే కూడదు.
పెద్దవాళ్ళు అంటూవుంటారు పెందలకడ (ఉదయము) లేస్తే లక్ష్మి ప్రదమని.
ఒక్కసారి ఆలోచిద్దాము.....ఉదయమే లేవడము వలన మనము త్వర త్వరగా పనులు ముగించుకుని, మన ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున వచ్చును. విద్యార్థులు ఉదయమే లేచి చదువుకుంటే అభివృద్ది చెందుతుట తథ్యము, తద్వారా ఉన్నత ఉద్యోగాల ప్రాప్తి. ఒక యాగ్నికుల వారు ప్రాతః కాలం లోనే లేచి, స్నాన, సంద్యావందన పూజలు ముగించుకుని, ఇతరుల ఇళ్లలలో పూజలు, వ్రతాలు, సాంప్రదాయ వ్యవహారములు చేయుట వలన ఆధ్యాత్మికము గా మరియు ఆర్థికముగా (లక్ష్మి పరంగా) బలపడుట నిశ్చయము.
ప్రతి వ్యక్తి జీవితములో ఒక లక్ష్యము, గమ్యము, శ్రద్ధతో ప్రయాణించిన అదియే లక్ష్మి ప్రదము. లక్ష్యము వైపు తీసుకుని పోయేదే లక్ష్మి.

ఆధ్యాత్మికమును దైనందిన జీవితములో అన్వయించుకొని జీవిత పధమును మరింత సుగమము, ఫలప్రదము చేసుకొనవచ్చును.
మనమందరము గ్రహించ వలసినదే మనగా లక్ష్మి (సంపదలు, సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు) రావలెనన్న, జీవితములో లక్ష్యము (శ్రద్ద, గురి, గమ్యము) ఉండవలసినదే.
లక్ష్మిలలో అష్ట లక్ష్మముల గురించి పరిశీలిద్దాము.
1) ఆది లక్ష్మి శ్రీ మహా విష్ణువును భర్త గా చేపట్టిన లక్ష్మి.... ఆది లక్ష్మి. అర్థము...విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు. విశ్వ వ్యాప్తంగా లక్ష్యము, ప్రయత్నము, శ్రద్ద ఎక్క డ ఉంటాయో అక్కడ లక్ష్మి (సంపదలు) ఉంటుందని చెప్పడమే ఆది లక్ష్మి పదంనకు సంకేతము.
2) ధైర్య లక్ష్మి జీవిత సమరములో ఆటు పోట్లను ఎదుర్కొనే ధైర్యమును కల్గి ఉండడమే ధైర్య లక్ష్మి.
3) ధాన్య లక్ష్మి సర్వ మాన వాళికి ఆకలి తీర్చే శ్రమ, ప్రయత్నమే ధాన్య లక్ష్మి.
4) గజ లక్ష్మి రాజ లాంఛనాలకు, వైభోగాలకు నిలువెత్తు నిదర్శనము గజము.
అంటువంటి భోగ భాగ్యాల కొరకు కృషి చేయడమే గజ లక్ష్మి.
5) సంతాన లక్ష్మి ఎన్ని సంపదలున్నా సంతానము లేకపోవడము, జీవితమే శూన్యమనిపించును. జగత్ కళ్యాణము ఉండదు. సంతాన ప్రయత్నాలే సంతాన లక్ష్మి.
6) విజయ లక్ష్మి జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలతో పోరాటమే విజయ లక్ష్మి.
7) విద్యా లక్ష్మీ అజ్ఞా న్నాందకారాన్ని తొలగించి, జ్ఞాన మార్గాన్ని చూపించే విద్యను సంపాదించడమే విద్యా లక్ష్మీ.
8) ధన లక్ష్మి "ధనం మూలమిదం సర్వం" అనునది లోకోక్తి. జీవితావసారాలు తీరుటకు ధన సంపాదన ప్రక్రియనే ధన లక్ష్మి.
లక్ష్మి ప్రసన్నమునకు కష్టే ఫలి సూత్రమే ముఖ్యము
పురాణాలు, శాస్త్రాలు నిర్దేశించే వ్రతాలు, నోములు, దైనందిన పూజలు నిరర్థకమా అంటే కానే కాదు.
శాస్త్ర విహితము, సశాస్త్రీంగా చేసే ఏ కార్యమైనా లక్ష్యము ను సూచించేదే ఎటొచ్చి ఆ కార్య క్రమాలన్ని..... శ్రద్దా భక్తి సమన్వితః మరియు మనసా వాచా కర్మణా ప్రతిపాదిక పై ఉంటే అనుకున్న లక్ష్యములు సాధించగలము.
ప్రతి పూజలో ఆడంబరములు తక్కువ, ఆధ్యాత్మికత ఎక్కువ ప్రతిబింబించ వలెను
చివరిగా....
ఋషులు, పారమార్థికులు ఆలక్ష్మీ నాశమామ్యహం అని భగవంతుణ్ణి కోరుతారు. అనగా తమను అశ్రద్ద, లక్ష్యము చెరనీయరాదు అని.
అలక్ష్మిర్కే నమృతాం
అనగా సకల దారిద్య్రములను నశింప జేయుము..... అని భగవంతుని కొరుదాము.

కృషితో నాస్తి దుర్భిక్షం అని కూడా విని యున్నాము.

ధన్యవాదములు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment