Thursday, April 23, 2020

రామాయణములోనుంచీ మనము నేర్చుకోవలసినవి:సోదర ధర్మము

రామాయణములోనుంచీ మనము నేర్చుకోవలసినవి:

🍁🍁🍁🍁🍁

సోదర ధర్మము:

అన్నను తండ్రిగా భావించి సేవ చెయ్యడము:

తన అన్నకు ఎంతో సేవచేసే అవకాశం వచ్చినపుడు ఏమీ ఆశించని నిస్వార్థపరుడు లక్ష్మణుడు. శ్రీరామపట్టాభిషేకం తరువాత యువరాజుగా ఉండమని అన్న అడిగినా తమ్ముడు వద్దన్నాడు. ఎంత గొప్ప సేవాభావము.
ఇప్పుడు ఎందరిలో కనిపిస్తుందీ సేవా భావము మన ఈ సమాజములో. నేడు ఆస్తులకోసము చంపుకోవడము వరకూ వస్తున్నారు. మనము ఏ పని చేసినా ఏమీ ఆశించకూడదు ఇది ప్రతి మనిషియొక్క ధర్మము.


సోదరుడు తప్పుచేస్తూ ఉంటే ధర్మభోధ చెయ్యడము:

రాముడు సీతకోసం వస్తుంటే రావణుడు పోరుకు సిద్దమయాడు రామునితో.‌
"అన్నా! రాముడు నిన్ను ఏమీ అనలేదు కదా? నువ్వే అతని భార్యను అపహరించి తీసుకువచ్చి, నీవే పోరుకు సిద్దపడటం మంచిదికాదు" అని మంచి ధర్మాన్ని చెబుతాడు తమ్ముడు విభీషణుడు అన్న రావణుడితో. మంచి మాటను వినలేదు అన్న పోరులో చంపబడుతాడు. ఈ సమాజములో ప్రతి తమ్ముడూ అన్నకు, అన్న తమ్ముడికీ ఆపదలో ఉన్నపుడు తప్పు దారిని అనుసరిస్తున్నపుడు వారికి ధర్మాధర్మాలు భోధించాలి.

తన సోదరునికి దక్కని సంతోషము తనకు వద్దనడము:

రాముడు వనవాసానికి పోయేటపుడు భరతుడు అయోధ్యలో లేడు. విషయము తెలిసి చాలా భాధపడుతాడు. అన్న వద్దకు పోయి, వచ్చి రాజ్యానికి రమ్మని బ్రతిమాలుతాడు. రాకపోతే ప్రాయోపవేశము చేస్తానంటాడు. ఎంతకూ
రాముడు ఒప్పుకోకపోతే, రాముని పాదుకలు తీసుకొని వాటిని సింహాసనము మీద పెట్టి అయోధ్యలో కాకుండా నంది గ్రామములో నార వస్త్రాలు కట్టుకొన జటాధరుడై 14 వసంతాలు పోయాక రాకపోతే అగ్ని ప్రవేశము చేస్తానంటాడు. తనను రాజ్యమేలమని తల్లి చెప్పినా అన్నకు దక్కని సంతోషము తనకు వద్దని అంటాడు. మనము ఎవరు ఏమైపోతే నాకేముందిలే అనుకుంటామిప్పుడు. కానీ అది చాలా తప్పు.‌ అన్న అయినా తమ్ముడయినా
మరెవరికైనా వారికి దక్కవలసినది
మనము ఎప్పుడూ ఆశించగూడదు.

సోదరుడు ఎంత నష్టం చేసినా తన భాధ్యతను మరువకూడదు:

అధర్మపరుడైన రావణునికి దహన సంస్కారాలను చెయ్యనంటాడు విభీషణుడు. అప్పుడు రాముడు రావణుడు నీకు ఎట్లానో నాకు అట్లే అని "మరణాంతాని వైరాణి"
బ్రతికున్నంతవరకే ఏ పగైనా చనిపోయిన తరువాత ఉత్త శరీరమే కదా ఉండేది.
"నీవు చెయ్యకపోతే నేను కర్మకాండను చేస్తాను" అని రాముడంటాడు.
విభీషణుడు తన అన్న తన మాట వినకపోయినప్పటికీ రాముని మాటను మన్నించి తన అన్నకు దహన సంస్కారాలు చేస్తాడు. దీనివల్ల మనము తెలుసుకోవడమేమిటంటే ... మనకు ఎవరైనా నష్టము కలిగించినా వారిపట్ల
క్షమాభావముతో ఉండి దగ్గరకు తీసుకోవడము ధర్మపరమైన ఆలోచన!


🍁🍁🍁🍁

No comments:

Post a Comment