Thursday, April 23, 2020

చిలుక పలుకులు

చిలుక పలుకులు
""""""""""""""""""""""""""'""''

ఒక రోజు వేటగాడు సంతలో తనకు దొరికిన రెండు రామచిలక పిల్లలను అమ్మకానికి పెట్టాడు.

ఇవి మాట్లాడే చిలుకలు పిల్లలు రండి కొనండి ఉంటూ అరుస్తూ వున్న వాడి అరుపులకు అటుగా వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఒక చిలక పిల్ల ఎంత అని అడిగాడు

మూడు కుంచాల జొన్నలు అండి అని అన్నాడు, అలాగే బ్రాహ్మణుడు మూడు కుంచాలు జొన్నలు ఇచ్చి ఒక చిలక పిల్లని కొన్ని తీసుకెళ్లాడు.

అలాగే మరొక చిలక పిల్ల ను మాంస విక్రయదారుడు తీసుకెళ్లడం జరిగింది.

అలా ఒక చిలుక ఏమో బ్రాహ్మణుని గుడిలో..

మరొక చిలకేమో విక్రయశాలలు పెరగసాగాయి

ఇలా కొద్ది రోజులు గడిచి పోయిన తర్వాత...

ఒకరోజు వేటగాడు ఏదో పని పైన సంతకు వచ్చాడు అటుగా వెళుతూ తాను ఆమ్మిన రామచిలకలు ఎలా ఉన్నాయో చూడాలనిపించింది...

గుడి దాకా వెళ్ళాడు గుడి లో ఉన్నటువంటి రామచిలుక
వేకువ ఝాము అయినది నిద్ర నుండి లేచి స్నానము చేసి గుడిని శుభ్రపరిచి పూజకు పుష్పములను ఫలములను సమకూర్చుకుని అని పలుకు తున్నది.


అలాగే గుడి కి వచ్చిన వారితో రండి దయచేయండి పూజకు విచ్చేశారా రండి రండి అని పిలుస్తూ...

గురువుగారు దేవుడికి అలంకరణ చేస్తున్నారు
గుడి చుట్టూ ప్రదర్శన చేసి రండి అలా చేసి వచ్చిన వారితో చెప్పండి అభిషేకమా అష్టోత్తర మా అంటూ మంచి ఫలుకులను అంటు ఉంటే వాటిని శ్రవణానందము గా విన్నాడు.

వేటగాడు ఇలాగే మరొక చిలకను కూడా గమనించడానికి వెళ్లడం జరిగింది.

తెల్లవారుతున్నది లేవు రా త్వరగా, లేసీ కత్తిని తీసుకుని గొంతు కోసి చర్మం వలచి, దానిని ముక్కలు, ముక్కలు గా నరుకుము.

మాంసం కొనడానికి వచ్చిన వారితో ఏం కావాలి చెప్పండి,

తల, తోడ, ఏముకల తో కూడిన మాంసం లేక ఏముకల లేని మాంసం ఏది కావాలి, నీవు త్వరగా నరకరా ...

కరణ కఠోరంగా అంటు వుంటే విని అక్కడ నుండి పోతు మనస్సు లో ఇలా అనుకుంటున్నడు.

ఏమిటీ విచిత్రం రెండు చిలకలు ఒక గూటి నుంచి తెచ్చాను

కానీ ...

అవి నేడు పలుకుతున్న పలుకులు వాటి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.

అందుకు కారణం అవి పెరిగిన ప్రదేశం కాబోలు, వేదపారాయణం వింటు
సత్ సాంగత్యము లో
పెరిగిన చిలుక పుణ్యలోకాలకు మార్గాన్ని సుగమం చేసుకుంటే,

విక్రయశాల లోని అక్రమాలను గమనిస్తూ మూర్ఖులైన వారి పాపపు మాటలను వింటూ పెరిగిన మరొక చిలుక పాపాన్ని వడగట్టుకుని తనకు తెలియకుండా నరక లోకానికి
పునాదులను వేసుకున్నది.

జీవితంలో సరిదిద్దుకో లేని తప్పులంటే ఇవేనేమో!

అంటే దీనిని బట్టి మనకు తెలిసేదేమిటంటే మనం పలికే పలుకులను చిలక లైన మన ఇంట్లో చిన్నారులు అయినా
వాటిని గమనిస్తూ నేర్చుకుంటారు.

అందుకే వాక్ శుద్ధి తో మాట్లాడవలసిన అవసరం ఉన్నది.

మాటలు విని ఈ చిలక పాపం మూట కట్టుకుంటే మరి వాటిని అమ్మిన నాకు పాపం సంభవించ కా మానాదు,

నేను ఈ వేట వృత్తిని వదిలి వేసి వేరే ఇంకో వృత్తిని ఎన్నుకోవడం చాలా మంచిది. ఇది సాధ్యమేనా?

నాడు బోయ వాడైనా వాల్మీకి కూడా ఇదే ధర్మ సందేహం కలిగింది.

తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
అని గ్రహించి మారాడు.

కావున నేను నా బ్రతుకు తెరువు కోసం చేసిన తప్పు,

నా పాలిట నా శాపంగా మారకముందే నేను జాగ్రత్త పడటం మంచిది.

దారి దోపిడీ దారుడు అయినా బోయవాడు వాల్మీకి గా మారాగా లేనిది,

ఈ చిలుకలు వ్యాపారి చితాభస్మదారుడిగా మారలేడా, సత్ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.

ఓం నమశ్శివాయ
ఇదే ముక్తికి మార్గం.

జన్మరాహిత్యాన్ని కి ఇంతకు మించిన మరొక మార్గం
ఏదీ లేదు.

సర్వేజనా సుఖినోభవంతు.🙏🏻

No comments:

Post a Comment