"ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని "ఎందుకయ్యా నాకు వందమంది కౌరవ పుత్రులనిచ్చి అందరినీ చంపేసి ఇంత బాధపెట్టావు" అని అడుగగా,
"పూర్వం ఒక 50 జన్మలక్రితం అతడొక నిశాదుడని ఒక పక్షికి చెందిన వంద పిల్లల్ని అతడు ఒకేసారి చంపిన పాపం ఇలా వచ్చిందని" కృష్ణుడు చెబుతాడు.
"మరి ఇప్పుడే ఎందుకు, 50 జన్మలలో ఒకొక్కటి తీర్చవచ్చు కదా" అని అడుగగా,
"నీవు ఏమి చేసావో అలాగే నీకు దక్కాలి, ఆ పక్షి లాగా నువ్వు కూడా ఒకే సారి వందమంది బిడ్డలు పోయిన బాధ అనుభవించాలి, కానీ నీకు వందమంది పిల్లలు పుట్టేటంత పుణ్యం ఈ 50 జన్మలలో సంపాదించావు కావున ఇప్పుడు నీకు జరిగింది అని కృష్ణుడు చెబుతాడు
మనం చేసుకున్న కర్మలుఊహ తెలిసిననాటి నుండి ఎన్నో పుణ్యకర్మలు చేసానే, నాకిన్ని కష్టాలేమిటి?
ఇటువంటివి తరచు మనం వింటూనే ఉంటాం. ఎవరి వరకో ఎందుకు మనదాకా వస్తే మనం కూడా ఒకప్పుడు అనుకునే వుంటాం. ఇంతే కాదు. మనకు తెలిసి బండెడు పాపాలు చేసినవారందరూ ఎంతో హాయిగా ఆనందంగా తిరుగుతున్నట్టు కనబడుతూ ఉంటారు. దీన్ని ఆధారంగా చేసుకుని దేవుని నిందిస్తూ ఉంటారు, అసలు దేవుడనే వాడు ఉంటె పాపాలు చేసే వాడికిన్ని సుఖాలేమిటి, అసలు పాపాల జోలికి వెళ్ళని నాకిన్ని బాధలేమిటి? ఇటువంటి ప్రశ్నలకు సామాధానం ఇవ్వగలిగినది మన ధర్మం, కేవలం కర్మసిద్ధాంతం మాత్రమే.
కర్మలు కాయిక, వాచిక, మానసిక అని మూడు ఉంటాయి. చేసిన కర్మ బట్టి దాని ఫలితం ఉంటుంది. దాని ద్వారా చేసిన కర్మ చెడుదైతే పాపం, మంచిదైతే పుణ్యం మూటకట్టుకుంటాం. మన ఎకౌంటులో పాపం, పుణ్యం జమ అవుతాయి.
మన ఎకౌంటు అంటే ఈ జన్మతో ఓపెన్ చేసినది కాదు. కొన్ని కోట్ల కోట్ల జన్మలనుండి అన్ని పేజీలతో మైంటైన్ చెయ్యబడుతూ ఉంటుంది.
ఒకొక్క జన్మది ఒకొక్క పేజీ అనుకుంటే వాటి స్థూల విలువ మన పాపపుణ్యరాశి.
ఈ పాపపుణ్యాలు అనేవి మన మానవ జన్మలో సంపాదించి ముందున్న విలువకు కలుపుకుంటాము. మానవ జన్మ కాక మరే ఇతర జంతుజన్మలు లభిస్తే ఆ శరీరంతో ఆ కర్మను కేవలం అనుభవిస్తాము.
జంతుజన్మలో విచక్షణ ఉండదు కాబట్టి వాటిలో కేవలం కర్మ అనుభవం మాత్రమే సాధ్యమవుతుంది.
ఇక మానవునిగా పుట్టినప్పుడు ఎడాపెడా పాపపుణ్యాలు తెగ మూటకట్టుకుంటాము. అలాగే ముందు జన్మలలో చేసిన కర్మలను అనుభవించగలిగే స్థాయి ఉన్నప్పుడు ఆ పాపపుణ్యాలను సుఖ దుఃఖాలుగా అనుభవిస్తూ ఉంటాము.
నేను పూర్వ జన్మలో ఎవడో తింటున్నది తిననీయకుండా ఒక రోజు చేసానంటే వడ్డీ చక్రవడ్డీతో లెక్క వేసి ఒక నెల రోజులు నాకు తిండి పడనివ్వకుండా చేస్తాడు.
కానీ నేను అది తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పుడే ఆ కర్మను అనుభవింపచేస్తాడు. ఎవరినో కొన్ని పదుల జన్మల క్రితం తల్లీకొడుకులను కొన్ని రోజులు విడదీసి ఉంటావు, ఈ రోజు నీకొడుకు కొన్నేళ్ళు నిన్ను విడిచి వెళ్ళవచ్చు.
ఎప్పుడో ఎవరినో నానా దుర్భాషలాడి ఉండవచ్చు నేడు నీనోటినిండా పుళ్ళుపడి మాట్లాడలేక తినలేక బాధపడుతూ ఉండవచ్చు.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మనం అనుభవింపలేని కష్టాన్ని మనకు కలుగచెయ్యడు. ఎన్నడైతే ఆ కర్మ పరిపక్వం అవుతుందో, ఎప్పుడైతే ఆ కర్మ అనుభవించగలిగే శక్తి నీకుందో అప్పుడే
ఆకర్మఫలితం ఇస్తాడు.
ఒక ఉదాహరణకు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని ఎందుకయ్యా నాకు వందమంది పుత్రులనిచ్చి అందరినీ చంపేసి ఇంత బాధపెట్టావు అని అడుగగా, పూర్వం ఒక 50 జన్మలక్రితం అతడొక నిశాదుడని ఒక పక్షికి చెందిన వంద పిల్లల్ని అతడు ఒకేసారి చంపిన పాపం ఇలా వచ్చిందని చెబుతాడు.
మరి ఇప్పుడే ఎందుకు, 50 జన్మలలో ఒకొక్కటి తీర్చవచ్చు కదా అని అడుగగా, నీవు ఏమి చేసావో అలాగే నీకు దక్కాలి, ఆ పక్షి లాగా నువ్వు కూడా ఒకే సారి వందమంది బిడ్డలు పోయిన బాధ అనుభవించాలి, కానీ నీకు వందమంది పిల్లలు పుట్టేటంత పుణ్యం
ఈ 50 జన్మలలో సంపాదించావు కావున ఇప్పుడు నీకు జరిగింది అని చెబుతాడు.
ఇది వ్యాస విరచిత భారతంలోనిది కాకపోయినా సహేతుకమైన కర్మ సిద్ధాంత వివరణ.
మనం చేసుకున్న పుణ్యఫలితంగా మన ఈ జన్మ ఆ నిర్దేశిత తల్లిదండ్రులదగ్గర, అంత చదువు హోదా ఇచ్చేటంత పుణ్యం సంపాదించి దానిద్వారా ఎంతో సుఖాలను పొందుతాము. సుఖం ఎలా అడగకుండా పొందుతున్నామో, దుఃఖం కూడా అలాగే పొందుతాము.
సుఖం వచ్చినప్పుడు నాకు ఈ సుఖం నావల్ల వచ్చింది అని రొమ్ము విరుచుకుంటాము, కానీ దుఃఖం వస్తే నాకే ఎందుకు అని అడుగుతాము.
ఒకసారి మనలోనుండి బయటపడి స్థిమితంగా ఆలోచిస్తే తత్త్వం బోధపడుతుంది.
మనకు పూర్వం చేసిన కర్మలు జ్ఞాపకం ఉండవు, వాటిని సరిదిద్దుకునే సమర్ధత లేదు. కానీ నీవు దేవుడిని నమ్ముకుంటే నీకు ఏది మంచిదో ఎలా అయితే తట్టుకోగలవో చూసి సుఖదుఖాలను మిళితం చేసి ఇస్తాడు.
నీకు నీ కొడుకు దూరమే అవ్వాలి అంటే వాడిని విదేశాలలో చదువుకు పంపుతాడు, కానీ నిన్ను ఇక్కడ ఉంచుతాడు. కాబట్టి నీ దుఖానికి స్వాంతన చేకూరే విషయం ఇస్తాడు.
రోగం ఇన్నాళ్ళు అనుభవించే కర్మ ఉంటే
ఆ రోగానికి ఉపశమనం కూడా ఇస్తాడు,
ఆ రోగం పేరు చెప్పి నీవారిని నీకు దగ్గర చేస్తాడు.
ఆ పాపకర్మ అనుభవించేందుకు
ఈ జన్మలో నీచేత compensation జరిగేట్టు పుణ్యకార్యాలు చేయిస్తాడు, దేవాలయాలలో అన్నదానసత్రాలలో నీచేత అన్నదానానికి విరాళాలు ఇప్పిస్తాడు. తద్వారా ఈపుణ్యాన్ని అడ్డుపెట్టి కొన్ని నెలలు అనుభవించాల్సిన బాధను కొన్ని రోజులకు కుదిస్తాడు.
కావలసినది ఆయన మీద నమ్మకం..! తార్కికంగా చూస్తె శ్రీదేవి భూదేవితో కలిసి ఉన్న స్వామీ, శ్రీదేవి అంత విశ్వాసం, శరణాగతి చేసి భూదేవి అంత ఓర్పుతో నిలిచి నా పాదాలను పట్టుకుంటే నీ కటి మునగకుండా రక్షించి కాపాడతాను అని మన ప్రత్యక్షదైవం ఆ తిరుమల వేంకటేశ్వరుడు చెబుతున్నాడు.
గురువును నమ్ముకుంటే, శరణాగతి కోరితే జన్మ జన్మలు అనుభవించవలసి ఉన్న కర్మని కేవలం కొద్దిరోజులకి కర్మను తీసే ప్రయత్నం చేస్తారు.అయితే గురువు ఏం చెబితే అది చేయాలి గురువు ప్రశ్నకు ఎదురు సమాధానం ఉండరాదు.*
🌹🌹🌹🌹🌹

No comments:
Post a Comment