శ్రీరమణీయం -(502)
🕉🌞🌎🌙🌟🇮🇳🚩
సంతోషం, దుఃఖం ఈ రెండిటికీ అతీతంగా ఉండాలంటే ఏం చేయాలి ?
సంతోషం, దుఃఖం ఈ రెండిట్లో ఏది కలుగుతున్నా దానికి ప్రధాన కారణం సంబంధం. మనకు సంబంధంలేని విషయాలు మన మనసుని స్పందింప చేయలేవు. అందుకే గౌతమ బుద్ధుడు ప్రపంచాన్ని, వస్తువులను లేకుండా చేయలేము కనుక వాటితో మనము ఏర్పరుచుకున్న సంబంధాన్ని తొలగించుకోవాలని బోధించారు. మనం పడే ఏ తపన అయినా సంతోషం పొందటం కోసం, దుఃఖాన్ని తగ్గించు కోవడం కోసమే. అనునిత్యం మన అనుభవాలు ఈ రెండింటి మిశ్రమంగానే ఉంటున్నాయి. మన ఇద్దరు పిల్లల్లో ఒకరికి మంచి మార్కులు వస్తే సంతోషం. మరొకరికి తక్కువ మార్కులు వస్తే బాధ. మనకిష్టమైన చిన్ననాటి స్నేహితులు కలిస్తే సంతోషం, అప్పులవాడు ఎదురై అరిచాడన్న బాధ దుఃఖంగా సంభవిస్తుంటాయి. కారు ఉందన్న సుఖానుభూతితో పాటు అది రిపేర్ కు వచ్చినప్పుడు కలిగే దుఃఖానుభవం కూడా సిద్ధంగా ఉంటుంది. పూర్తిగా దుఃఖాన్ని లేదా సంతోషాన్ని మాత్రమే అందించే రోజుఏదీ ఉండదు. సంబంధ బాంధవ్యాలే సుఖ-దుఃఖాలను ప్రభావితం చేస్తాయి ! ప్రతి అనుభవంలోనూ మనం ఆపాదించుకునే మన ప్రమేయాన్ని తగ్గించుకుంటే క్రమంగా ఆ సంబంధం తగ్గుతుంది. అంటే పరిధిచేత ఏర్పడే కర్తృత్వభావన పోతేనే మనం సుఖ-దుఃఖాలు నుండి విముక్తులం కాగలం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
పరిధి వల్ల కర్తృత్వం.. కర్తృత్వం వల్ల దుఃఖం!'- (అధ్యాయం-63) {శ్రీరమణభాషణలు సత్సంగ ప్రవచన మాలిక}
రచన/బోధన : -తత్వదర్శి/శివశ్రీ గెంటేల వెంకటరమణ,
శ్రీగురుధామ్, బలుసుపాడు, కృష్ణాజిల్లా.

No comments:
Post a Comment