మనిషిని గదా మారను మరి
యుగాలు తిరిగినా..జగాలు కరిగినా..
ఉష్ణం ఉగ్రమైనా..ఉనికి మృగ్యమైనా..
బతుకు భారమైనా..మెతుకు దూరమైనా..
కడుపు కాలినా..కరవులొచ్చినా..
మనిషిని గదా మారను మరి
బర్డ్ ఫ్లూలే రానీ..స్వైన్ ఫ్లూలే రానీ..
సార్సులే రానీ.. మెర్సులే రానీ..
కలరాలే రానీ..కరోనాలే రానీ..
భోగాలే పోనీ..రోగాలే రానీ..
మనిషిని గదా మారను మరి
భూతాపమే రానీ..భూకంపమే రానీ..
సుడిగాలే రానీ..చుక్కలే కూలనీ..
సునామిలే రానీ..సంద్రమే పొంగనీ..
ప్రళయమే రానీ..విళయమే రానీ..
మనిషిని గదా మారను మరి
జగమంతా వనముంటే వద్దన్నా
వనమంతా జగముంటే ముద్దన్నా
కూర్చున్న కొమ్మనీ నిలువెల్లా నరికినా
నిల్చున్న భూమినీ తనువెల్లా చెఱచినా
మనిషిని గదా మారను మరి
స్వార్థ జీవినై ఏ మొక్కనూ వదలలే
పరాన్నభుక్కునై ఏ ప్రాణినీ వదలలే
కుంభ కర్ణునై ఏ ఒక్కటి వదలలే
కౄర భూతాన్నై ఏ దిక్కునీ వదలలే
మనిషిని గదా మారను మరి
జనవాసానికి జాడా కరవైంది
వనవాసానికి నీడా కరవైంది
ఏం మిగిలింది మనకు మనల్ని మనం దోచటం తప్ప
ఏం మిగిలింది మనకు మనల్ని మనం మింగటం తప్ప
అయినా..మనిషిని గదా మారను మరి
కాని
చేయి దాటింది..హద్దు మీరిపోయింది..
మాయదారి కరోనా నన్ను మించిపోయింది
నా ఆయువు పట్టింది.. నన్ను పీక్కు తింటోంది
నా జాతి మనుగడను నడి సంద్రంలోకి నెట్టింది
మనిషిని మాత్రమే నేను..మారాలేమో మరి?
జగమంత కుటుంబం- జగజ్జేతననుకున్నా
ఏకాకి జీవితం- ఎడారి బ్రతుకయ్యింది
వసుధైక కుటుంబం- విశ్వనేతననుకున్నా
అంటరాని జీవితం-
అజ్ఞాని బ్రతుకయ్యింది
మనిషిని మాత్రమే నేను..మారాలేమో మరి?
అవును ! ఇకనైనా మేలుకుంటా !!
ప్రకృతంతా నాదేనన్న తపనని మరచిపోతా
ప్రకృతిలో నేనొక భాగమని తెలుసుకుంటా
అవును ! ఇకనైనా మానుకుంటా !!
నా అంతు చూడాలని ‘ప్రకృతి’ ‘వికృతి’ లా మారుతోంది
నా వంతు సాయానికై నన్ను మనిషి లా మారమంటోంది
మారిన మనిషినై ‘ జన సాంద్రత ‘తగ్గిస్తానో మారిన మనిషినై ‘ వన సాంద్రత’ పెంచుతానో
ఊరకుంటానో ఉలిక్కిపడతానో
ఉద్యమిస్తానో ‘ఉనికి’ కోల్పోతానో
జూలు విదిలిస్తానో “జూలు” కూల్చుతానో
కాలు కదిలిస్తానో లేక నాకే “జూలు” కట్టుకుంటానో
నా ఇష్టం ! అంతా నా ఇష్టం!!
రచన:
జిజ్ఞాసి
(కర్నాటి శ్రీనుకుమార్)
ఉపాధ్యాయులు
“ప్రకృతి-వికృతి” వాట్సాప్ గ్రూప్ అడ్మిన్
నిడమనూర్,జి.నల్గొండ
చరవాణి: 9963729915
యుగాలు తిరిగినా..జగాలు కరిగినా..
ఉష్ణం ఉగ్రమైనా..ఉనికి మృగ్యమైనా..
బతుకు భారమైనా..మెతుకు దూరమైనా..
కడుపు కాలినా..కరవులొచ్చినా..
మనిషిని గదా మారను మరి
బర్డ్ ఫ్లూలే రానీ..స్వైన్ ఫ్లూలే రానీ..
సార్సులే రానీ.. మెర్సులే రానీ..
కలరాలే రానీ..కరోనాలే రానీ..
భోగాలే పోనీ..రోగాలే రానీ..
మనిషిని గదా మారను మరి
భూతాపమే రానీ..భూకంపమే రానీ..
సుడిగాలే రానీ..చుక్కలే కూలనీ..
సునామిలే రానీ..సంద్రమే పొంగనీ..
ప్రళయమే రానీ..విళయమే రానీ..
మనిషిని గదా మారను మరి
జగమంతా వనముంటే వద్దన్నా
వనమంతా జగముంటే ముద్దన్నా
కూర్చున్న కొమ్మనీ నిలువెల్లా నరికినా
నిల్చున్న భూమినీ తనువెల్లా చెఱచినా
మనిషిని గదా మారను మరి
స్వార్థ జీవినై ఏ మొక్కనూ వదలలే
పరాన్నభుక్కునై ఏ ప్రాణినీ వదలలే
కుంభ కర్ణునై ఏ ఒక్కటి వదలలే
కౄర భూతాన్నై ఏ దిక్కునీ వదలలే
మనిషిని గదా మారను మరి
జనవాసానికి జాడా కరవైంది
వనవాసానికి నీడా కరవైంది
ఏం మిగిలింది మనకు మనల్ని మనం దోచటం తప్ప
ఏం మిగిలింది మనకు మనల్ని మనం మింగటం తప్ప
అయినా..మనిషిని గదా మారను మరి
కాని
చేయి దాటింది..హద్దు మీరిపోయింది..
మాయదారి కరోనా నన్ను మించిపోయింది
నా ఆయువు పట్టింది.. నన్ను పీక్కు తింటోంది
నా జాతి మనుగడను నడి సంద్రంలోకి నెట్టింది
మనిషిని మాత్రమే నేను..మారాలేమో మరి?
జగమంత కుటుంబం- జగజ్జేతననుకున్నా
ఏకాకి జీవితం- ఎడారి బ్రతుకయ్యింది
వసుధైక కుటుంబం- విశ్వనేతననుకున్నా
అంటరాని జీవితం-
అజ్ఞాని బ్రతుకయ్యింది
మనిషిని మాత్రమే నేను..మారాలేమో మరి?
అవును ! ఇకనైనా మేలుకుంటా !!
ప్రకృతంతా నాదేనన్న తపనని మరచిపోతా
ప్రకృతిలో నేనొక భాగమని తెలుసుకుంటా
అవును ! ఇకనైనా మానుకుంటా !!
నా అంతు చూడాలని ‘ప్రకృతి’ ‘వికృతి’ లా మారుతోంది
నా వంతు సాయానికై నన్ను మనిషి లా మారమంటోంది
మారిన మనిషినై ‘ జన సాంద్రత ‘తగ్గిస్తానో మారిన మనిషినై ‘ వన సాంద్రత’ పెంచుతానో
ఊరకుంటానో ఉలిక్కిపడతానో
ఉద్యమిస్తానో ‘ఉనికి’ కోల్పోతానో
జూలు విదిలిస్తానో “జూలు” కూల్చుతానో
కాలు కదిలిస్తానో లేక నాకే “జూలు” కట్టుకుంటానో
నా ఇష్టం ! అంతా నా ఇష్టం!!
రచన:
జిజ్ఞాసి
(కర్నాటి శ్రీనుకుమార్)
ఉపాధ్యాయులు
“ప్రకృతి-వికృతి” వాట్సాప్ గ్రూప్ అడ్మిన్
నిడమనూర్,జి.నల్గొండ
చరవాణి: 9963729915
No comments:
Post a Comment