Wednesday, April 22, 2020

సత్సాంగత్యం

🌞👉 సత్సాంగత్యం🌞* 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

మానవుని జీవితానికి ఆలంబనగా నిలిచే ముగ్గురు స్నేహితులు....

మొదటిది సంపద.... అదృష్టం ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది

రెండవది. బంధువులు
స్మశానం వరకు తోడుగా ఉండి అక్కడ వదిలేస్తారు. మళ్లీ ఎప్పటికో కానీ తలవరు...

ఇక మూడవది...
మనం చేసిన పుణ్యం...
స్మశానం దాటిన తర్వాత కూడా మనల్ని అనుసరిస్తుంది

సజ్జన సాంగత్యం, సత్సంభాషణం సత్కర్మాచరణం ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢంగా తయారు చేస్తాయి...

మంచి స్నేహితులు ఉంటే
ఎంతటి దూరమైన ప్రయాణం కూడా దగ్గరే అనిపిస్తుంది.

సజ్జన సాంగత్యం వల్ల జీవన ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది.

సజ్జన సాంగత్యం అనేది సుగంధ పరిమళ ద్రవ్యాల దుకాణం లాంటిది... ఆ దుకాణం వద్దకు వెళితే చాలు మనం కొన్నా కొనకపోయినా సువాసన అంటుకునే తీరుతుంది...

అందుకే మానవ జన్మ పొందిన మనం నిరంతరం సజ్జన సాంగత్యం కలిగి ఉందాం...🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

No comments:

Post a Comment