ఎగరాకు ఎగరాకు కోడిపిల్ల ఏదో ఒకరోజు అవుతావు బిస్మిల్లా
గింజలు వేస్తున్నారు తిని బాగా బలంగా అవుతున్నాను అని
అనుకున్నది కోడిపిల్ల పెరిగి పెద్ద అయితే కోసుకోని తింటారు అని తెలియక పాపం అలాగే
పూర్వం ఒక వ్యక్తి వివాహం చేసుకుంటే
కుటుంబ సమస్యలు వాటి తో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఇవన్నీ కలిసి మనిషి కి మనశ్శాంతిని
లేకుండా చేస్తాయి అని బావించి, ఈ సంసారం బాధ నాకు వద్దు బాబు అని అనుకొని సన్యాసం తీసుకుని అడవికి వెళ్లి ఒక గుహ లో తప్పసు చేసుకుంటూ కాలం గడపడము మెదలుపెటాడు.
అయితే బ్రతకడం కోసం సమీప గ్రామాలు వెళ్ళి బిక్షాటన చేసి వారు ఇచ్చిన తిండిగింజల తో జీవనం కొనసాగించేవాడు.
అది అడవి కావడంచేత
ఎలుకలు ఏక్కువ గా వున్నయి, అవి గుహ లోకి ప్రవేశించి తిండి గింజలను తినడం తో పాటు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా పాడు చేసేవి వాటిని చంపేద్దామా అంటే పాపమని భావించాడు మరి ఎలా ఈ సమస్య నుంచి బయట పడ్డాటం అని ఆలోచించి పిల్లి ని తెచ్చి పెంచుకుంటే దాని అరుపులు విని ఇవి పారిపోతాయి అని భావించాడు, అలాగే ఒక పిల్లిని తెచ్చుకుని పెంచుకున్నాడు అది దొరికిన ఎలకలను వేటాడి తినేసింది దాని అరుపులు విని మిగిలిన ఎలకలు పారిపోయి హమ్మయ్య ఎలుకల బెడద తగ్గిపోయింది అని అనుకున్నాడు.
ఏలుకలు లేకుండా పోయే సరికి పిల్లి కి ఆహారం లేకుండా పోయింది అది ఆకలితో అలమటిస్తూ అరవడము మెదలు పెట్టింది.దీనికి ఆకలిగా ఉంది కాబోలు పాలు పోస్తే దినీ ఆకలి తీరిపోతుంది అని అనుకున్నాడు, వెంటనే తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు పెట్టి ఒక పాడి ఆవును తెచ్చుకున్నాడు.
పాలు తాగి పిల్లి ప్రశాంతంగా ఉండటం మొదలు పెట్టింది హమ్మయ్య పిల్లి బాధ తగ్గింది అనుకున్నాడు.
ఆవు గుహ చుట్టూ ఉన్న గడ్డి తినేసింది, ఆ చుట్టూ పక్కల గడ్డి అయిపోయింది, అది అకలి బాధ తట్టుకోలేక అరవడం మొదలు పెట్టింది. దీనికి కాస్త గడ్డి వేస్తే అరవడం ఆపివేస్తుంది భావించాడు.
బిక్షాటనకు వెళుతున్న సమయంలో ఓంటరి గా ఒక మహిళ గడ్డి కోస్తు కనిపించింది, వెంటనే ఆమే వద్దకు పోయి ఏమమ్మా నేను ఇక్కడ అడవిలో తపస్సు చేసుకుంటూ వుంటాను, నాకు ఒక ఆవు ఉంది దానికి గడ్డి వెయడానికి ఎవరూ లేరు నీవు నాతో వస్తావా అని అడిగాడు, ఓక నిమిషం ఆలోచించి
ఆవు గడ్డివేస్తా నీకు అన్నం చేసి పెడతా, ఉరికే నీ వెంటరావడం కుదరదు, నా మెడలో తాడు వెస్తే వస్తా సరేనా అంది.
పాపం మన వాడికి వేరే దారి లేక సరేనని ఒప్పుకున్నాడు తాళికట్టి పెండ్లిచేసుకుని అవిడా ను వెంట తెచ్చుకున్నాడు.
ఆవుకు ఆమె గడ్డి వేయడంతో అది శాంతించినది హమ్మయ్య మనశ్శాంతిగా ఉంది అనుకున్నాడు. అయితే అలా కొద్ది రోజులు గడిచేసరికి వారికి ఒక పిల్లాడు జన్మించాడు
వాడు పెరిగి పెద్దయి అల్లరి చేయడంతోపాటు ఆకలిగా ఉందని కేకలు వేయడం మొదలు పెట్టాడు. మరి భిక్షాటన చేసినది సరిపోక పనిచేయడం ప్రారంభించవలసి వచ్చింది.
ఇలా ఉండగా మరొక ఆడపిల్ల కూడా వారికి జన్మించినది.
ఇద్దరు పెరిగి పెద్ద వారు కావడం మొదలైంది,
చేసుకున్నవారికి చేసుకున్నంతా అన్నటూ వుంది మన వాడి బ్రతుకు.
పిల్లల కు విద్యాబుద్ధులు చెప్పించాలి మనం సమీప గ్రామానికి వెళ్లడం మంచిది అని అవిడా చెప్పడం జరిగింది. అందుకు ఆయన సరిగా అంగీకరించలేదు ఆవిడ కోపం వచ్చింది విద్యాబుద్ధులు లేకపోతే వీడు కూడా నీలాగే ఎందుకు పనికిరాకుండా పోతాడు,మర్యాదగా ఈ అడవి వదిలి ఊరు చేసుకుందాం అని గట్టిగా వాదించింది, చేసేదేమీ లేక భార్యాపిల్లలతో తను ఇంతకు ముందు వదిలేసిన గ్రామానికి మళ్లీ రావలసి వచ్చింది. అందుకే అంటారు భూమి గుండ్రంగా ఉంది అని తాను ఎక్కడినుంచి వద్దు అని పారిపోయాడు అక్కడికే వచ్చి జీవితాన్ని తిరిగి ప్రారంభించవలసి వచ్చింది.
కాబట్టి ఏది కూడా మన చేతుల్లో ఉండదు సర్వం సర్వేశ్వరుని అధీనంలోనే ఉంటుంది మాయ మనల్ని మోహింప చేస్తూ ఉంటుంది ఒకసారి దాని వలలో పడితే
మనం తిరిగి చూసుకునే సరికి జరగవలసిన నష్టం జరిగిపోయి ఉంటుంది.
ఈ సంసార జీవితం వద్దు అనుకుని పోయినవాడు సన్యాసం తీసుకున్న వాడు పైగా అక్కడ సంపాదించినది కూడా కాదు, ఏవరో దానం చేయడం ద్వారా వచ్చిన తిండిగింజలు తనా లాగే అకలి గా వున్న మరొక జివి తింటే తిన్నాయి అని అనుకోని ఉండి ఉంటే హాయిగా జీవితం సాగిపోయేది.
నేను, నాది అనే ఆహం ఏంతా పని చేసిందో చదివారు కదా!
ఒక చిన్న ఎలుక జీవితాన్ని
చిందరవందర చేసింది
కాబట్టి మనం చెయ్యగలిగింది ఏమీ లేదు నా వల్లే అంత అవుతుంది అనే భ్రమలో ఇంత జరిగింది.
ఏ పని అయిన త్రికరణశుద్ధిగా ఆ సర్వాంతర్యామి నాతో చేయిస్తున్నాడు అని భావిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మనిషికి మరింత మనశ్శాంతి చేకూరుతుంది.

No comments:
Post a Comment