టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచుతున్నామా?
* ( శౌచాలయ దినోత్సవం సందర్భంగా..)
పెద్ద ఇల్లు కట్టుకుంటాం. విశాలమయిన హాలూ, బెడ్రూంలూ, కిచెన్, పూజ గది ఉండేలా చూసుకుంటాం.
బాత్రూమ్, లెట్రిన్ మాత్రం చిన్నగా కట్టి మన కొంచెపు బుద్ది చూపించుకుంటాం.
మనింట్లో మనం ఓ పది నిమిషాలు ప్రశాంతంగా గడిపేది, హాయిగా నిట్టూర్చేది అక్కడే కదా! దాన్నెందుకు ఇరుకుగా, అసహ్యంగా మార్చుకుంటాం?
దాన్నో మురికి కూపంగా మార్చేస్తాం. ఇంట్లో పనికిరాని వస్తువులను అక్కడ స్టోర్ చేస్తాం. అందులో కి దూరి ముటముట లాడుతూ, ముక్కు మూసుకుని మూడు నిమిషాల్లో బయట పడేందుకు ప్రయత్నిస్తాం.
హాయిగా, ప్రశాంతంగా పూర్తవ్వాల్సిన ప్రకృతి కార్యం అంత ఇబ్బందిగా, బలవంతంగా పూర్తి చెయ్యాలా?
శరీరం లోని మలినాలను వదిలించుకొని దేహామనే దేవాలయాన్ని శుభ్రం చేసుకొనేది అక్కడే. అలాంటి ప్రదేశాన్ని పూజ గది కన్నా, ప్రార్ధనామందిరం కన్నా శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి కదా!
అదో నిషిద్ధ ప్రాంతమని, దానిని మరెవరో శుభ్రం చెయ్యాలని అనుకోవడమెందుకు? మన ఇంట్లో, మన దైనందిన జీవితంలో అదొక భాగం. పూజ గదో, ప్రార్థనా మందిరమో లేక పోయినా బతకొచ్చు కానీ బాత్రూం,టాయిలెట్ లేక పోతే బ్రతక గలమా!
కనుక మనకి ఆరోగ్యాన్ని, ప్రశాంతత ను ఇచ్చే బాత్రూం, టాయిలెట్ లను మనమే శుభ్రం చేసుకుందాం. రెండు రోజుల కొకసారి ఓ పది నిమిషాలు కేటాయిద్దాం.
వెనుకటికి ఇంటిని చూసి ఇల్లాలిని చూడమనే వారు. ఆ సామెతను తిరగ రాసి టాయిలెట్ ను చూసి ఇంటోళ్లను అంచనా వేయమందాం.
మన బుద్ధి కోతి బుద్ది లాంటిది. కొందరు ఇంట్లో శుభ్రంగా ఉంచుకున్నా పబ్లిక్ టాయిలెట్స్ లో అడుగు పెడితే వంకర బుద్ది చూపిస్తారు. ఉమ్మడం, కిళ్ళీలు నమిలి ఉమ్మడం, సిగరెట్ పీకలు పడేయడం, విసర్జన పూర్తయ్యాక నీళ్ళు పొయ్యక పోవడం ..... ఇంకొందరయితే అపరిచితుల్లా మారి గోడలపై తమ పైత్యాన్నంతా కపిత్వంగా గీకడం లాంటి వికారాల్ని ప్రదర్శిస్తారు.
ఇదే పని ఇంట్లో చెయ్యండి. తల్లో...చెల్లో....ఆలో..... చీరి చింతకు కడతారు.
కాబట్టి అది మన ఇంట్లో టాయిలెట్ అయినా, పబ్లిక్ టాయిలెట్ అయినా దాన్ని పవిత్రంగా భావించి శుభ్రంగా ఉంచుకోవడం, అవసరానికి వినియోగించుకోవడం మన బాధ్యత.
మన బాధ్యతను గుర్తెరిగి మసలు కుందాం. మనుషులమని నిరూపించుకుందాం.
( ఈ post ను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా share చేసి అవగాహనా పెంపునకు సహకరించండి. అయితే మూల రచయిత పేరు తొలగించి సొంత post గా చెలామణి చేసుకోవడం విజ్ఞత కాదని గుర్తించండి.) - - © టీ.వీ.రావు
Source - Whatsapp Message

No comments:
Post a Comment