Thursday, November 19, 2020

సన్యాసి మార్గం, గృహస్థు మార్గం

శుభోదయం.

పరమాత్మని సాక్షాత్కరించుకోవాలి అంటే, సాధకుడు తాను లేకుండా పోవడానికి సిద్ధపడాలి. కానీ మనం అన్ని వైపుల నుండి, "నేను" అనే దానికి బలం చేకూర్చే సాధననే చేస్తూవుంటాము. అయితే సాధకునిలో ఈ "నేను" పైకి లేస్తోందో, అప్పుడు అతను ఒక "సాక్షి"లా అయిపోవాలి. ఆ నేనుకి ఎటువంటి సాయము చేయకూడదు. ఆ విధమైన "మెలకువ" ఎప్పుడు వస్తుందో, అప్పుడు ఆ నేను లేకుండా పోయి, సాధకుడు శూన్యం అవుతాడు.

దుఃఖము లేకుండా ఎలా ఉండాలి? అని ప్రశ్నించకండి. దుఃఖాన్ని స్వీకరించండి. అదే భాగ్యము. అదే నియమము. అది ఉంది. దానితో పోట్లాడకండి. దానిని దాటిపోవాలి అనే ఆకాంక్షని వదలండి. దానికి వ్యతిరేకమైన దాన్ని పొందాలి అనే కోరిక వదలండి. ఇది నియమము అని స్వీకరించండి. మీరు అశాంతిగా వున్నప్పుడు మీరు ఏమి చేసినా మీ అశాంతి పెరుగుతూనే ఉంటుంది. అలాకాక మీరు ఆ అశాంతిని స్వీకరిస్తే, అది వెనక్కి పోవడం ప్రారంభింస్తుంది.

మీరు శాంతిని పొందాలి అనుకుంటే, మరి ఆ అశాంతిని ఎవరు స్వీకరించాలి? అందుకే పరమ అనుభూతిని పొందడానికి రెండు విధులున్నాయి. ఒకటి రెండింటినీ వదలి వేయడం. ఇది సన్యాసి మార్గం. రెండు, రెండింటినీ పట్టుకోవడం, ఇది గృహస్థు మార్గం.
💚💚💚💚💚💚💚

Source - Whatsapp Message

No comments:

Post a Comment