🌸లోచూపు🌸
జీవితం దృష్టి ప్రధానమైనది. ప్రతి ప్రాణికి చూపు చాలా అవసరమైనదేగాక విలువైనది కూడా! చూపునిచ్చే అవయవం కన్ను. దృష్టి ప్రాముఖ్యాన్ని గుర్తించిన మన పూర్వులు ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. భౌతికమైన ఈ జగత్తును, అందులోని మార్పులను గమనిస్తూ జీవన గమనం సాగించడం ఒకెత్తు. ఆంతరంగికమైన చూపును కలిగి ఉండటం మరొకెత్తు. అదే ‘లోచూపు’.
ఎవరికి వారు తమంతట తామే ఉన్నత మార్గంలో ప్రయాణించేటట్లు చేసేది ఈ లోచూపు. బాహ్య నేత్రాలు సాధారణ దృష్టినిస్తే, జ్ఞాననేత్రాలు ఆంతరంగిక దృష్టిని అందిస్తాయి. మామూలు చూపు కొన్నిసార్లు ఇంద్రియ లౌల్యానికి దారితీస్తుంది. అధోగతికీ లాక్కెళుతుంది. ‘కన్నుల చూచినందెల్లా కడు ఆసల దగిలి’ అని ఓ సంకీర్తనలో అన్నమయ్య చెప్పినట్లుగా, చూసిన ప్రతి విషయంపై ఆసక్తిని పెంచుకుంటే అది దుఃఖాలపాలు చేస్తుంది. ఆముప్పు దాపురించకూడదంటే జ్ఞాననేత్రాలు విప్పారాలి. ఆ కాంతిలో వ్యక్తిత్వం వికసించాలి. మొక్క సూర్యకాంతిని అందుకొని ఎదిగి మహావృక్షమై ప్రాణవాయువును, పుష్పఫలాలను, కలపను అందించి సమాజానికి ఉపయోగపడుతున్న స్పూర్తిని అందుకొని మనమూ వికసించిన వ్యక్తిత్వంతో సమాజసంక్షేమానికి కృషి చేయాలి.
అన్నమయ్య తన సంకీర్తన భాగవతంలో ‘ఎన్ని మార్లు సేవించిననూ కన్నులూ తనియవు’ అంటూ- భగవత్ సౌందర్యాన్ని వీక్షించడం నేత్రాలు చేసుకున్న గొప్ప యోగంగా అభివర్ణిస్తారు! ‘తెర తీయగరాదా నాలోని మచ్చరమను తెరతీయగారాదా తిరుపతి వేంకట రమణా’ అంటూ- నిన్ను దర్శించాలంటే పదివేల కన్నులు కావలెనయ్యా అంటారు త్యాగరాజస్వామి!
బాహ్యంగా చూసినదాన్ని విమర్శించడం మానవ సహజ లక్షణం. దీన్ని అధిగమించి లోచూపుతో నిన్ను నీవు విమర్శించుకో! నిన్ను నీవు సరిదిద్దుకో’ అంటారు విజ్ఞులు. ‘చదివితి తొల్లి, చదివేనింకా కొంత... ఎదిరి నన్నెరగను’ అంటారు అన్నమాచార్యులవారు ఓ సంకీర్తనంలో. ఎంతో కొంత చదివాను, ఇక ముందూ చదువుతాను. కాని నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ‘ఒరుల దూషింతు కాని, ఒక మారైన నా దురితకర్మములను దూషించను’ అంటూ బాహ్యదృష్టితో చూసి అందర్నీ తప్పుపడుతున్నాను కాని, అంతరదృష్టి కలిగి నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను అంటూ లోతైన జ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానం అందుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించారు.
లోచూపు సాధనకు ధ్యానం ఎంతో ఉపయుక్తమైనది. ఏకాగ్రమైన భావనతో మనసును కేంద్రీకరించినపుడు జ్ఞాననేత్రాలు విప్పారుతాయి. ధ్యానప్రక్రియ ఉత్తమ ఉపాసనామార్గం. అభ్యాసపూర్వకమైన ధ్యానం తమను తాము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానాజ్ఞాన విచక్షణ ఏర్పడి వివేకదర్శనం కలుగుతుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్యజీవనంలో ఆచరించేటట్లు చేస్తుంది. బుద్ధి ప్రచోదనం జరిగి మనసు నియంత్రితమై జీవితం సార్థకమయ్యేలా ఆశలు, ఆశయాలతో జీవనం సాగిపోతుంది. మంచి పనులు చేసే జ్ఞానాన్ని లోచూపు అందిస్తుంది. మనలోపల చుక్కానిలా ఉండి మనల్ని చక్కని మార్గంలో నడిపించే గురువే... లోచూపు!
💚💚💚💚💚💚
Source - Whatsapp Message

No comments:
Post a Comment