💥దీపావళి పండుగ ఆధ్యాత్మిక రహస్యము💥
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
దీపావళి పండుగను కొన్ని ప్రదేశాలలో ముఖ్యంగా ఉత్తర హిందూస్థానములో దీవాళి లేక దీపమాల అని కూడా అంటారు. దీని వలన ఈపండుగ ముఖ్యంగా వెలిగించబడిన దీపాలపండుగ అని అర్థమవుతుంది. గృహస్థులు తమ ఇంటిలో మూల మూలలా దీపాలను వెలిగించి ప్రకాశవంతము చేసే ఆచారము చాలాకాలము నుండి కొనసాగుతూ ఉంది. ఈ పండుగకు ముందే తమ తమ గృహాలను బాగా శుభ్రపరచి, రంగులు వేయించి, శక్తానుసారం అలంకరించుకుంటారు. పండుగ రోజున తల స్మానం చేసి, క్రొత్త వస్త్రాలు ధరించి లక్ష్మీ దేవిని పూజించి ఆహ్వానిస్తారు. ఉత్తరదేశంలో స్వస్తిక్ ను రచించి లక్ష్మిని ఆహ్వానించుటకు ముందు గణేశుని పూజిస్తారు. ఆ రోజు రకరకాల తీపి మిఠాయిలు తయారుచేసి లక్షిదేవికి సమర్పించి నోరు తీపి చేసుకుంటారు. ఇరుగుపొరుగు వారికి బంధు-మిత్రులకు మిఠాయిలు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతారు. కొన్ని చోట్ల కొత్త అక్కౌంటు పుస్తకాలను ప్రారంభించి పాతవాటిని తీసేస్తారు. పూర్వం నుండి దీపాలను వెలిగించే ఆచారానికి 5 కారణాలు చెప్పవచ్చు 1. దారి చూపేందుకు 2. వస్తువులను గుర్తించుటకు 3. దొంగలు, అడవి జంతువుల బారి నుండి రక్షించుకొనుటకు 4. ఏదైనా విజయం సాధించినపుడు లేక స్వతంత్రం లభించినపుడు జనులు సంతోషంగా దీపాలు వెలిగిస్తారు 5. దేవీ దేవతలను ఆహ్వానించేందుకు దీపాలు వెలిగిస్తారు.
మనుష్యులు కలియుగములో తమోప్రధానులై సరియైన దారి ఏదో తెలియక ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తిస్తూ అందరూ దు:ఖము-అశాంతిపాలై దిక్కు తోచక భగవంతున్ని పిలుస్తున్న అతిధర్మగ్లాని సమయంలో నిరాకార జ్యోతి స్వరూపమైన పరమపిత శివ పరమాత్మ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి మనుష్యుల ఆత్మలనే దీపాలను వెలిగించి సరియైన దారి చూపుతారు. మంచిదేదో చెడుదేదో గ్రహించలేక మనుష్యులు వికారాలకు వశమై చెడు మార్గంలో నడిచే సమయంలో నిరాకార శివుడు ఆత్మజ్ఞానము, పరమాత్మజ్ఞానము, సృష్టి రూపీ నాటకరంగ రహస్యము తెలిపి మంచి మార్గమేదో, చెడు మార్గమేదో గుర్తించునట్లు మనుష్యులకు రాజయోగం నేర్పిస్తారు. మనుష్యులలో దాగి ఉన్న వికారాలనే దొంగలు, అడవి జంతువుల నుండి రక్షించుకునేందుకు నిరాకార శివ పరమాత్మ దేహాభిమానములో ఉన్న మనుష్యులను ఆత్మాభిమానులుగా చేస్తారు. ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడు తమలో దాగిన దొంగలను గుర్తించి వాటిని తరిమేస్తారు. సంగమ యుగంలో నిరాకార శివుడు నేర్పిన జ్ఞాన-యోగాల ద్వారా మనుష్యులు వికారాలపై విజయము పొందుతారు. త్వరలో రాబోవు సత్యయుగంలో అందరి ఆత్మ జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. అందుకు గుర్తుగా ఇప్పుడు దీపాలు వెలిగిస్తారు. దేవీ దేవతల పూజ పగలు చేసినా, రాత్రి చేసినా దీపాలు తప్పకుండా వెలిగిస్తారు. కొన్ని మందిరాలలో అఖండ దీపాన్ని కూడా వెలిగిస్తారు. సత్యయుగంలో దేవతలు ఆత్మాభిమానులుగా ఉంటారు. అనగా వారి ఆత్మజ్యోతులు స్వతహాగా సదా వెలుగుతూనే ఉంటాయి. అందువలన దేవతలను పూజించేందుకు, ఆహ్వానించేందుకు భౌతికమైన దీపాలను వెలిగిస్తారు.
దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధము చేసినప్పుడు శ్రీకృష్ణుడు మూర్ఛిల్లుతాడు. అప్పుడు సత్యభామ అస్త్రశాస్త్రాలను ధరించి నరకాసురుడనే రాక్షసుడిని సంహరిస్తుంది.భక్తివూర్గంలో ఈ కథను ఆధారం చేసుకొని పండుగ చేసుకుంటారు.సత్యయుగంలో రాధా - కృష్ణుల వివాహం జరిగి రాజ్య సింహాసనాధికారులుగా పట్టాభిషిక్తులైనప్పుడు రంగు-రంగుల దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు ప్రతి సంవత్సరము పట్టాభిషేకము జరిగిన ఆ రోజును దీపావళి పండుగగా జరుపుకుంటారు.
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.
💥✨💥💫💥✨⚡✨
Source - Whatsapp Message
No comments:
Post a Comment