Wednesday, November 18, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

🍅మనం భవిష్యత్తు లో ఏమౌదామనుకుంటున్నామో దానికి హద్దు మన ఆలోచనే.

🍅మీరొక శాంత మూర్తి, స్నేహశీలి, మంచి వ్యక్తి అని అందరూ అనుకునేలా జీవించండి.

🍅"మానవ సేవయే మాధవసేవ" కనీసం కొన్ని గంటలని ఎదుటివారికోసం ఖర్చుపెట్టండి. మీ సమయాన్ని కొంత వృద్దాశ్రమంలోనో, అనాధాశ్రమం లోనో గడపండి. మీకు అనుభవమున్న విషయం పై ప్రసంగించండి. ఎవరికైనా చదువు నేర్పండి. ఎదో ఒక పని చేయండి. మీ తర్వాతి తరానికి వారసత్వముగా ఒక బాట చూపండి.

🍅మిమ్మల్ని ఒక టమోటా పండులా భావించుకోండి. దాన్ని పిండితే ,దానిలో ఉన్నదే బయటకు వస్తుంది.అలాగే మీ మనసుని మీరు ప్రశాంత, సానుకూల ఆలోచనలతో నింపి, దానికి ధైర్యం, శక్తి, జాలి, దయలాంటి లక్షణాలను అందిస్తే, ఎవరైనా మిమ్మల్ని పిండినపుడు మీలోనుండి ఈ లక్షణాలున్న జ్యూస్ బయటికి వస్తుంది.

🍅ఒక రోజంతా 'నేను' అను మాటవాడకుండా ప్రయత్నించి చూడండి. ఎదుటి వాళ్ళ మీద దృష్టి సారించండి.వాళ్లేమి చెబుతున్నారో వినండి. దానివల్ల ఎన్నో అద్భుత ,కొత్త విషయాలు. తెలుసుకుంటారు. మంచి స్నేహితులన్న బిరుదు కొట్టేస్తారు.

🍅మీ ఊపిరాడని పనులనుంచి, మీకుటుంబ జీవనం నుంచి కొంత సమయాన్ని మీ వ్యక్తిత్వ వికాసానికి కేటాయించటం ఎంతో అవసరం. అది ఎప్పటికి వృధాకాదు. మీరు ప్రశాంతంగా, విశ్రాంతిగా, ఉత్సాహంగా ఉంటేనే ఇంకా ఫల ప్రదంగా పనులు చేయగలరు.

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment