Monday, May 10, 2021

ఆనందం ఉనికితోపాటు శాశ్వతంగా ఉంటుంది !

"ఋభుగీత "(351)
🕉🌞🌎🌙🌟🚩

🕉️ ఆనందం ఉనికితోపాటు శాశ్వతంగా ఉంటుంది !🕉️

📚✍️ మురళీ మోహన్

👌భగవంతుడిని నిర్గుణుడని చెప్పటంలో ఉద్దేశం ఆయనకు గుణాలు లేవని మాత్రమే కాదు. మనలోకూడా గుణాలన్నీ పోయిన తర్వాత మాత్రమే ఆయన మనకు సంపూర్ణంగా గోచరమౌతాడని తెలియజేయడం. ఆయన కోసం వెతికితే కనిపించడు. లోకంలోని లౌకిక ఫలాలను వెతకటం, అడగటం ఆపితే ఆయన గోచరమౌతాడు. మనిషి సంతోషం కోసం వెతుకులాటలో నిత్యం దుఃఖ పడుతూనే ఉంటాడు. ఆ వెతుకులాటలో తనలోనే ఉన్న ఆనందాన్ని గుర్తించలేకపోతున్నాడు. సంతోషం వస్తువులతో, అనుభవాలతో ఉంటుంది. కానీ అవి శాశ్వతంగా ఉండవు కనుక సంతోషం కూడా శాశ్వతంగా ఉండదు. ఆనందం ఉనికితో ఉంటుంది. ఉనికి శాశ్వతం కనుక ఆనందం శాశ్వతమే. అడ్డుగా ఉన్నదల్లా సంతోషం కోసం వెంపర్లాటే !

🕉🌞🌎🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment