Wednesday, May 26, 2021

బుద్ధుడు! ఓ సజీవ సాక్ష్యమా..అదెలా!?

ఈరోజు బుద్ద పౌర్ణమి సందర్భంగా ఒక చక్కటి సందేశం.
బుద్ధుడు! ఓ సజీవ సాక్ష్యమా..అదెలా!?
-----------------------------------------------
భిక్షపాత్రతో నిలబడివున్న బుద్ధుడిని చూడగానే ఆ రోజు..ఓ ఇంటతనికి పరమచిరాకు కలిగింది.

సోమరి పోతులు, తిండికూడా సంపాదించుకోలేని చవట
సన్నాసులు. వూరిమీదపడి జీవించే
పరాన్న భుక్కులు..ఇలాంటి వారివల్ల సమాజానికి ఆదర్శమా ఉపయోగమా!? పెడితే తింటారు. పొమ్మంటే పోతారు. ఇలాకాదు. ఏదేమైన ఈరోజు వీరికి బుద్ధిచెప్పాలి. అనుకున్నదే తడవుగా కోపంతో..

బుద్దుడ్ని చూస్తూ నానా మాటలూ అన్నాడు. తిట్టితిట్టి అలిసిపోయానని అర్ధమైయ్యిందతనికి. ఐనా బుద్దుడిలో మార్పులేదు సరికదా..
"అయ్యిందా..!? ఇంకేమైనా వుందా" అన్నట్టు..చిరునవ్వుతో చూసాడు అసలేమి జరగనట్టే ! పైగా.."సుఖిభవ" అంటూ అతన్ని
దీవించిమరీ కదిలాడు బుద్దుడు అక్కడినుండి.
ఇదిమరీ చిరెత్తుకొచ్చింది ఇంటతనికి. వెళ్లిపో తున్న బుద్ధుడిని ఆపిమరీ అడిగాడు.

@ నిన్ను ఇన్ని తిట్టానుకదా నన్ను దీవించటం ఏమిటీ..!? నికేమన్నా పిచ్చా. అసలు బుర్ర వుందా నీకు..!?
# భిక్షకోసం మీముందుకు వచ్చాను. దాత ఏమిచ్చినా స్వీకరించటం భిక్షకుడి ధర్మం.
దాత ఇష్టం.. భిక్షగా వారేమైనా ఇవ్వొచ్చు.
ఆ పాత్రని ఆహారంతో నింపితే..ఆ ఫలితం మీది. లేదూ! ఆ పాత్రని మీతిట్లతో నింపితే అపుడూ ఆ ఫలితం మీదే! కర్మ మీది. తత్
ఫలితమూ మీదైనపుడు నాకెందుకు చింత.

దాతగా మీపని మీరు చేశారు. స్వీకర్తగా నాపని నేను చేయాలిగా. ఏమిచ్చారన్న దానితో నాకు ప్రమేయం లేదు. మీరేమిచ్చినా ప్రతిగా మీపట్ల కృతజ్ఞతని వ్యక్త
పరచటం బిక్షకుడి ధర్మం. అదేకదా...చేసాను..అన్నాడు బుద్దుడు నవ్వుతూ.

ఇంటతను నివ్వెరపోయాడో క్షణం.
మరుక్షణం అతను బుద్ధుడి పాదాలవద్ద వున్నాడు. ఐనా అతని కళ్ళు వర్షిస్తూనే వున్నాయి ధారపాతంగా. బుద్ధుని మార్చా
లని పూనుకున్న అతనిలోనే సమూలమైన మార్పు వచ్చింది..

'బుద్ధుడు.. ఓ తామరాకుమీది నీటిబొట్టు వంటి వాడని. జీవిస్తూనే..జీవితాన్నెలా
అంటకుండా ఉండాలో; జీవిస్తూనే..
ఆ జీవితాన్ని ఇతరుల కోసమెలా
వాడాలో; తెలిపే ఓ సజీవ సాక్ష్యమని.
అతనికి అర్ధం అయ్యింది.

బుద్ధుడులాంటి వ్యక్తే బహుశా ఈ భూమ్మీద లేకుంటే..మానవాళికిది సాధ్యమేనన్న సంగతెలా నిరూపితమై ఉండేదని అతనికిపుడు అవగతమైయ్యింది.
👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment