Thursday, May 6, 2021

కరోనా కరోనా ఏం చేస్తావ్ అని అడిగితే

😡కరోనా కరోనా ఏం చేస్తావ్ అని అడిగితే:
😡ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో కూడా కాలుష్యం తగ్గించాను.
😡సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి విశ్రాంత కల్పించాను.
😡కుటుంబాలతో సమయం వెచ్చించేలా చేశాను.
😡డబ్బు ఒక్కటే ప్రాధాన్యము అనుకునే పరిగెత్తుకుని వాళ్ళకి బుద్ధి తెచ్చేలా చేశాను.
😡రోజు మందు లేకపోతే బతకలేను అనే వాళ్ళ చేత మందు లేకుండా ఉండేలా చేశాను.
😡డబ్బున్న ఏమీ చేయలేని ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కల్పించాను.
😡ప్రైవేట్ డాక్టర్లు ఎంత స్వార్ధపరులో జనాలకు చూపించాను.
😡వైద్య వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయో అందరికీ తెలిసేలా చేశాను.
😡ఎంత డబ్బు ఉన్నా మీకు నచ్చింది కావాల్సింది దొరకకపోతే ఆ బాధ ని ఎలా అధిగమించాలో నేర్పాను
😡బతికుంటే చాలురా భగవంతుడా అనుకునేలా చేశాను.
😡ఎన్ని కోపాలు తాపాలు ఉన్న బయటకు వెళ్ళలేక ఇంట్లో వాళ్లతోనే సర్దుకుపోయేలా చేశాను.
😡క్యాష్ తప్ప ఇంకేమీ అలవాటు లేని వాళ్ళ చేత ఆన్లైన్ పేమెంట్ అలవాటు చేశాను.
😡యాక్సిడెంట్లు లేకుండా చేశాను..
😡ఈ భూమి మనుషులకు మాత్రమే కాదు జంతు జీవరాశులకు కూడా అని వాటికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాను.
😡ఎల్లప్పుడూ బిజీగా ఉండే వాళ్ళు నాకు ఇప్పుడు ప్రశాంతంగా దొరుకుతుందా అని ఏడ్చే వాళ్లకి ఇంట్లో ఖాళీగా ఉంటే ఎంత నరకం అని తెలిసేలా చేశాను.
😡మేము అగ్రరాజ్యాల మని విర్రవీగే వాళ్ళని పడుకునేలా చేశాను..
😡వైద్యం మీద కాకుండా రక్షణ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టినందుకు బాధపడేలా చేశాను.
😡గవర్నమెంట్ హాస్పిటల్ లను ఇప్పటిదాకా ఇలా ఎందుకు ఉంచారు అన్న బాధపడేలా చేశాను.
😡డబ్బుతో అన్ని సుఖాలు ఇష్టాలు రావు సర్దుకుపోవడం లోనే వస్తుంది అని ప్రతి ఒక్కరికి నేర్పాను.
😡మనకెందుకు చావు వస్తుందా అని ధీమాగా ఉన్న వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించే అలా చేశాను..
😡క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని వాళ్లకు అది నేర్పాను
😡ఇలాంటి టైం లో కూడా సేవ చేసే వాళ్ళు ఉంటారు అని సమాజానికి చూపించాను.
💐 లోకం లో మనిషి పుట్టుక అద్భుతం!
🌸 నవ్వుతూ బ్రతకాలి నలుగుర్ని నవ్విస్తూ బ్రతకాలి!
🌿 అంతా మట్టే మట్టిలో పుట్టాము!😀 మట్టిలోకి పోతాము!🤷‍♂ 💞.

Source - Whatsapp Message

No comments:

Post a Comment