Tuesday, May 18, 2021

పరివర్తనతో మోక్షం

🔥పరివర్తనతో మోక్షం💥
🕉️🌞🌎🏵️🌼🚩

పూర్వం రైవతాద్రి పర్వత ప్రాంతాన వేద వేదాంగ పారంగతుడైన వేదమాలి అనే ప్రసిద్ధుడైన బ్రహ్మణుడు ఉండేవాడు. అతడు సర్వ జీవులయందు దయగలవాడు, హరిపూజా పరాయణుడు. బిడ్డలు, భార్య, బంధుమిత్రుల పోషణకై
డబ్బు సంపాదించసాగాడు. అమ్మకూడని వస్తువులు అమ్మేవాడు. వ్రతాలు, యజ్ఞాలు కూడా ధనార్జన కోసమే చేసాడు. అతనికి ఇద్దరు కుమారులు జన్మించగా వారికి యజమాలి, సుమాలి అని పేరు పెట్టి ఎంతో ప్రేమ వాత్సల్యంతో
పెంచాడు. వివిధ రకాలైన వ్యాపార వ్యవహారాల ద్వారా విపరీతమైన డబ్బు సంపాదించాడు.
ఒకనాడు తాను సంపాదించిన ధనమెంత ఉందో అని లెక్కించగా కొన్ని వేల కోట్లు ఉన్నదని తెలిసింది.సంతోషం ఆశ్చర్యం పొందాడు. అయితే తాను ధనార్జన దుర్జనల నుండి దానాలు స్వీకరించడం ద్వారా, అమ్మకూడనివి అమ్మటం
ద్వారా తపోవ తాది విక్రయాల ద్వారా సంపాదించాను కదా అని అనుకున్నాడు.అందువల్ల పరివర్తన రాలేదు. ఆ తీరలేదు. మేరు పర్వతమంత ఎత్తుగల బంగారు రాశులను సంపాదిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. మళ్ళీ
విచక్షణ లేకుండా ధనార్జనలో పడిపోయాడు.
మనసు కోరే కోర్కెలను తీర్చినా, మరల మరిన్ని కోరికలు కోరుతుంది. ముసలితనంలో శరీరం జీర్ణం కాగా వెంట్రుకలు, పళ్ళు, కళ్ళు, చెవులు, జీర్ణస్థితికి చేరుకుంటాయి.
కానీ ఆశ మాత్రం యవ్వనంతో వెలుగుతూనే ఉంటుంది. వేదమాలి ఇంద్రియాలన్నీ నెమ్మదించాయి. బలం తగ్గింది. కానీ ఆశ అనే బలం పెరిగింది.. ఆశగలవాడు పండితుడైనా, విద్వాంసుడైనా బుద్ధిమంతుడైనా కోపి షి, మూడుడు
అవుతాడు. మానవుల్లో ఆశ అనేది అపజయానికి కారణం. గెలవశక్యం కాని శత్రువది. కాబట్టి శాశ్వతానందం కోసం
ప్రాజ్ఞుడు ఆశను పరిత్యజించాలి. బలాన్ని, తేజస్సును, కీర్తిని, విద్యను, అభిమానాన్ని ఆశ త్వరగా నాశనం చేస్తుంది. ఆశలతో నిండిన మనిషికి దుర్మార్గుడైన వాడు కొంచెం ఇచ్చినా వాడు ఎంతో గొప్ప వాడుగా కనిపిస్తాడు. ఇది ఎంతో
ఆశ్చర్యకరమైన విషయం . ఆశతో నిండిన మనిషిమోహంతో, మహాగర్వంతో అవమానాలను, దుఃఖాన్ని పరిగణించడు. చింతాపూరితుడైన వేదమాలి తనను తాను చూసుకున్నాడు. ముసలితనం రావటంతో బలం తగ్గింది. ఇ
కనుండి పరలోకం గురించి ప్రయత్నించాలి అని నిశ్చయించుకుని తన ధనాన్ని నాలుగు భాగాలు చేసి తాను రెండు భాగాలు స్వీకరించి మిగిలిన రెండు భాగాలు తన కుమారులకిచ్చాడు వేదమాలి.
తాను ఈ జన్మలో డబ్బుతో పాటు సంపాదించిన పాపాన్ని కడిగేసుకునేందుకై చెరువులను, చలివేంద్రాలను, ఉద్యానవనా లను, దేవాలయాలను నిర్మించాడు.నిరంతరం అన్నదానం చేసి సమస్త ధనాన్ని దానం చేసి తపస్సు
ఆచరించేందుకై నరనారాయణ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ పరబ్రహ్మోపాసకుడు తేజోరాశి అగు జానంతి మహర్షి శిష్యులకు జ్ఞాన బోధ చేస్తున్నాడు.
ఆ మహర్షి శమాది గుణయుతుడు. రాగద్వేష రహితుడు.రాలి పడిన ఆకులను
భుజించేవాడు.
వేదమాలి అతనికి సాష్టాంగ దండ ప్రమాణం చేసాడు. వేదమాలికి అతిథి మర్యాదలు చేయమని మహర్షి శిష్యులకు చెప్పగా వారు ఎంతగానో ఆదరించారు వేదమాలిని, వారి ఆతిథ్యాన్ని పొందిన వేదమాలి జానంతి వద్దకు చేరుకుని చేతులు జోడించి వినయుడై, “మహరీ! నా కల్మషాగ్ని మీ దర్శనంతో నశించింది. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నన్ను ఉద్దరించండి" అని వేడుకొన్నాడు. జానంతి మహర్షి అతని వంక చిరునవ్వుతో చూసి ఓయీ
బ్రాహ్మణోత్తమా! విను పరమాత్మ మిత్రుడు అగు శ్రీ మహా విష్ణువును సేవించు, స్మరించు ఇతరులపై నిందలు వేయటం, చాడీలు చెప్పటం ఎప్పుడై చేయకు. ఎల్లప్పుడు పరోపకారం గురించి ఆలోచించు. మూర్ఖుల స్నేహాన్ని వదిలి హరిపూజనిమగ్నుడవు కమ్ము. కామ, క్రోధ, మథ మాత్సల్యాలను వదిలి లోకాన్ని ఆత్మ సమంగా చూసి శాంతి పొందు, అసూయ, డంబాచారాలు, అహంకారం, కాఠిన్యం వీడు. ప్రాణుల యందు దయ చూపు. సత్పురుషులను సేవించు. నీవు
చేసిన ధార్మిక కార్యాలు ఇతరులకు తెలపకు. అతిథుల్ని ఆదరించు. పత్ర, పుష్ప ఫలాలతో, దుర్వాలతో పల్లవాలతో నిష్కామంగా జగన్నాథుడగు నారాయణుని పూజించు.
ప్రతినిత్యం దేవాలయాన్ని శుభ్రపరుచు. జీర్ణమైన, శిథిలమైన, దేవాలయాలను బాగు చేయించు. విష్ణ్వాలయ మార్గాన్ని అలంకరించు. దీపాలు వెలిగించు. కందమూలాలు, ఫలాలతో నిత్యం మాధవుణ్ణి పూజించు. ప్రదక్షిణ
నమస్కారాలతో స్తోత్ర పాఠాలతో శ్రీహరిని ఆరాధించు. శక్తిననుసరించి ప్రతినిత్యం పురాణ శ్రవణం, పురాణ పఠనం చేయి. ఇలా చేస్తే నీకు నీవే
జ్ఞానవంతుడవు అవుతావు. జ్ఞానం వల్ల సమస్త పాప నాశనం జరుగుతుంది. అని చెప్పగా ఆ మార్గాన్ని
అనుసరించి కొంత జ్ఞానాన్ని పొందాడు వేదమాలి.
కొన్నాళ్ళకి వేదమాలి "నేను ఎవరిని? నా పని ఏమిటి?" అని తనలో తాను వేదన అనుభవించాడు. నా కెట్లు ఈ జన్మ కలిగింది. నా స్వరూపం ఏమిటి? ఇలా రేయింబవళ్ళు చింతనా పరుడై తన ప్రశ్నలకు సమాధానం దొరకక మరల జనంతి మహర్షిని కలిసి ఆయన పాదాలపై పడి "బ్రహ్మ జ్ఞాన శ్రేష్ఠా! నా మనసు మిక్కిలి భ్రమిస్తోంది. నేనేవరిని? నా పనేమిటి?

నాకీ జన్న ఎందుకు? కలిగింది. నా ఈ సందేహాలను నివృత్తి చేయండి" అన్నాడు. అప్పుడు జానంతి "ఓ మహానుభావా! నీ మాట నిజమే మనసు భ్రమించుట నిశ్చయమే. అహంకారం మనోధర్మంకాని ఆత్మ ధర్మం కాదు. అయినా
నేనెవరిని అని అడిగావు కదా, జాత్యాది శూన్యమైన అహానికి నేను ఏ విధంగా నామకరణం చేసేది? సాటిలేని స్వభావం కలది, గుణ రహితం, పరాత్మమూ, పరరహితము, అప్రమేయం అయిన ఆత్మకు నామకరణం ఎలా చేసేది?
పరం జ్యోతి స్వరూపం, పరిపూర్ణం అవ్యయాత్మ, అవిచ్ఛిన్న స్వభావం అనే ఆత్మ క్రియను ఎలా చెప్పేది.
స్వప్రకాశ స్వరూపం, నిత్యం, అనంతమూ అయిన పరమాత్మకు జన్మను క్రియను ఎలా చెప్పను.
జ్ఞానైక వేద్యము, పరి పూర్ణము, పరానందం అయిన పరమాత్మ కంటే ఈ జగత్తున భిన్నమైనది మరొకటి లేదు. జ్ఞానం కప్పబడినప్పుడు జగత్తంతా బ్రహ్మమయమే అవుతుంది. అని జానంతి మహర్షి బోధించాడు.
వేదమాలి ఆత్మలో ఆత్మ స్వరూపమున అచ్యుతుని సాక్షాత్కరించుకొని ఆనందించి పరబ్రహ్మ ఉపాధి రహితం, స్వయం ప్రకాశం. నిరంజనం అని తెలుసుకుని తను గురువుగా స్వీకరించిన జానంతి మహర్షికి నమస్కరించి ధ్యానపరు
డయ్యాడు. చాలా కాలం తర్వాత వేదమాలి . వారణాసి పురం వెళ్ళి మోక్షాన్ని పొందాడు.*

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment