365 రోజులు✈️ హార్ట్ ఫుల్ నెస్ 🌍 కథ తో
♥️ కథ-11 ♥️
అనుభూతి - నాకు స్ఫూర్తినిచ్చిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను
ప్రతీ క్షణం ఒక అవకాశమే -
ఓసారి, ఒక యువతి తన తండ్రితో కలిసి కారు నడుపుతోంది. కొన్ని మైళ్ల తర్వాత, వారొక తుఫానును ఎదుర్కొన్నారు.
ఆ అమ్మాయి తన తండ్రిని ఆత్రుతగా, “ఇప్పుడు ఏమి చేయాలి??” అని అడిగింది.
తండ్రి చాలా ప్రశాంతంగా "డ్రైవింగ్ కొనసాగించు," అని సమాధానం చెప్పాడు.
ఆ అమ్మాయి చెప్పినట్లే చేసింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత, తుఫాను తీవ్రతకు ఇతర కార్లు పక్కకు ఆగడం ఆమె గమనించింది.
అది చూసి ఆ అమ్మాయి కంగారుగా, “నేను కూడా వెనక్కి తగ్గాలా?” అని మళ్ళీ తన తండ్రిని అడిగింది.
దానికి తండ్రి, "వద్దు, డ్రైవింగ్ చేస్తూ ఉండు" అని బదులిచ్చాడు, ఆ అమ్మాయి అలాగే కొనసాగించింది.
అయితే, మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత, చాలా కార్లు పక్కకు ఆగిపోవడం ఆమె చూసింది.
అది చూసి, ఆమె తన కారు వేగం తగ్గించి, తండ్రితో, “నాన్న, దుమ్ము కారణంగా ఎదురుగా ఉన్న వాటిని నేను సరిగా చూడలేకపోతున్నాను, కాబట్టి నేను కూడా ఆగాలని అనుకుంటున్నాను”
"తుఫాను తీవ్రతరం అయ్యేలా కనిపిస్తోంది, అందరూ వెనక్కి తగ్గుతున్నారు," అని అంది.
కానీ ఆమె తండ్రి ఆమెను డ్రైవింగ్ కొనసాగించమని చెప్పాడు.
ఆమె మరికొంత సేపు ప్రయాణించేసరికి తుఫాను తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు, ఆమెకు ముందుకు వెళ్లడం మరింత కష్టంగా మారింది. సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడానికి కారును ఆపడం మంచిదని ఆమెకు అనిపించింది,
కానీ ఆమె తండ్రి ప్రయాణం కొనసాగించమనడంతో ఆమె తుఫాను గుండా ప్రయాణాన్ని కొనసాగించింది.
తుఫానులో కూడా ఆమె డ్రైవింగ్ చేస్తూనే ఉంది.
కొంతసేపటికి పరిస్థితి మెరుగుపడింది, మునుపటి కంటే ఇప్పుడు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కొన్ని మైళ్ల ప్రయాణం చేసిన తర్వాత, చివరకు వారు తుఫాను నుండి బయటపడి, సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నారు.
ఆమె తండ్రి, “ అమ్మా, ఇప్పుడు నువ్వు కారును పక్కకు ఆపి దిగొచ్చు” అని అన్నాడు.
దానికి ఆ అమ్మాయి, “ఇప్పుడు ఎందుకు? మనం తుఫాను నుండి బయటపడ్డాం కదా! ” అని ప్రశ్నించింది.
తండ్రి చిరునవ్వుతో, “నువ్వు బయటికి వచ్చి చూస్తే, మధ్యదారిలో ఆగిపోయిన వారందరూ ఇంకా తుఫానులో ఇబ్బందిపడడం నువ్వు గమనించవచ్చు. కానీ నువ్వు పట్టుదలతో ముందుకు సాగడం వలన, తుఫానును అధిగమించావు." అని సమాధానమిచ్చాడు.
మొట్టమొదటి అడుగులో చేసుకున్న శక్తివంతమైన సంకల్పం తుదివరకు కొనసాగిస్తే, సంపూర్ణ విజయం సాధించడంలో ఎప్పటికీ విఫలం కాదు.
కష్ట సమయాల్లో, ఎంతటి బలమైన వ్యక్తులైనా నిరాశపడతారు, కానీ మన మార్గానికి అడ్డుగా ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మనం అక్కడే ఉండి, మన స్వంత వేగంతో ముందుకు సాగుతూ ఉంటే, ఆ కష్ట సమయాల్లో విజయవంతంగా బయటకు రావడం ఖాయం. 🕊️
♾️
మీపై నమ్మకం ఉంచండి, ఎలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ ముందుకు వెళ్లే మార్గాన్ని కనుగొనండి.
- దాజీ
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
అనువాదబృందం ఆంధ్రప్రదేశ్
Source - Whatsapp Message

No comments:
Post a Comment