సహజంగా పుట్టిన ప్రతివాడూ జన్మతః ఏ విశ్వాసాలూ లేని నాస్తికుడే.
వాడికి దేవుడం టే తెలీదు. దెయ్యం అంటే తెలీదు. మతం అంటే తెలియదు.
వాడు పెరిగే కొద్దీ అల్లరి చేయడం మొదలు పెడతాడు. వాడి అల్లరిని తట్టుకోలేక వాడికి ఓ దెయ్యాన్ని పరిచయం చేస్తారు. వాడి పసి మనసులో ఏదో దెయ్యం ఉంది అని తొలుత నాటేస్తారు.
వాడికి ఎదిగే కొద్దీ ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుణ్ణి పరిచయం చేస్తారు. దేవుడు దెయ్యం నుంచి రక్షిస్తాడని,కష్టాలను గట్టెక్కిస్తాడాని నూరిపోస్తారు.
ఆ భావనకు అలవాటు పడి పోతాడు.ఇంకొంచెం ఎదిగాకా స్కూల్లో వాడికి అచ్చం వీడి ఆలోచనల తోటే ఉండి వేరే రకపు దేవుడిని నమ్ముతున్న వాళ్ళు కనపడతారు.
వాడికి ఆశ్చర్యం వేస్తుంది. కొత్త సందేహం కలుగుతుంది. దానిని పోగొట్టడానికి మతాన్ని పరిచయం చేస్తారు వాడికి. మనం నమ్మేవాడే అసలైన దేవుడు, మనల్ని భయపెట్టే దెయ్యమే అసలు సిసలు దెయ్యం అని నమ్మబలుకుతారు.
వాడిలో పక్కవాడికి ఉన్న నమ్మకాలను గౌరవించక పోవడం అనే బీజాన్ని వేసేస్తారు.
ఇంతలో హైస్కూల్ చదువుకు చేరుకుంటాడు. సైన్స్ పాఠం చదవడం మొదలు పెడతాడు.
గాలి ఆక్సిజన్, నైట్రోజన్,
హైడ్రోజన్ , కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువుల మయం అని, నీరు అంటే ఆక్షిజన్, హైడ్రోజన్ ల సమ్మేళనం అనేదీ తెలుసుకుంటాడు.
సోషల్ పాఠం కూడా మొదలవుతుంది. సూర్యుడు , చంద్రుడు, భూమి దేవుళ్ళు కాదని గ్రహాలనితెలుస్తుంది. కానీ ఇంటికి వెళ్తే అవి దేవుళ్ళని, కావాలంటే మన మత గ్రంధాలలో చదివి తెలుసుకోమని ఆ పుస్తకాలు ఇస్తారు. భక్తి సినిమాలు చూపిస్తారు. ప్రార్థనలు చేయిస్తారు. వాడిలో ఓ గందరగోళాన్ని పెంచి పోషిస్తారు.
ఈ ప్రక్రియతో నూటికి 50 మంది అస్తికులుగా మారిపోతారు. మిగిలిన 50మంది తార్కికంగా వాదించే వాళ్ళు ఇంకా నాస్తికులుగా వుంటారు. ఇంకొన్నాళ్ళు గడుస్తాయి. అతని చదువు పూర్తి అవుతుంది, ఉద్యోగం రాదు.
దేవుణ్ణినమ్ముకో మంటారు, కొన్నాళ్ళకు ఉద్యోగం వస్తుంది.మళ్లీ 50 శాతం అస్తికులు గా మారుతారు.
పెళ్లి వయసోస్తుంది. ఇంకా పెళ్లి కుదరదు, మళ్లీ దేవుడి ఎంట్రీ , పెళ్లి కుదురుతుంది, మళ్లీ 50 శాతం అస్తికులుగా మార్పు. ఈ లోపు ఇంట్లో ఎవరికయినా సుస్తీ చేస్తే మళ్లీ దేవుని పరిచయం , తగ్గగానే 50 శాతం మంది కన్వర్షన్.
దీనికి అదనంగా చూసారా అతను కూడ గతంలో నాస్తికుడే, ఒకరోజు భగవంతుడి లీలలని చూసాడు, మారిపోయాడిప్పుడు పూర్తిగా అంటూ వ్యక్తిగత స్థాయి నుండి సామూహిక స్థాయిలో జరిగే మార్కెటింగ్ టెక్నీక్ ల ద్వారా ఇంకొంత మంది ఆస్తికులై పోతారు.
అలా తమ జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే క్రమం లో భగవంతుడనే భావనకి లొంగిపోయినవారు లొంగిపోగా మిగిలిన ఒక నలుగురు మాత్రం నాస్తికులుగా మిగుల్తారు.
ఆ మిగిలిన నలుగురిని నాస్తికులనుండి, హేతువాదులు ఆనండి, తార్కిక వాదులనండి, సైన్స్ ని నమ్మినవారనండి, ఏధైనా అనండి, మిగిలిన ఆ నలుగురితో తొంబయి ఆరు మంది మనలాంటి అస్తికులం అనునిత్యం విభేధిస్తూనే ఉంటాం మన పిడి వాదంతో.
ఆ విభేదించడమన్నది పెద్ద విషయం ఏమీ కాదు కానీ అది చేయటానికి మనం వాడు తున్న సాధనాలు మాత్రం ఆ సైన్స్ కనిపెట్టిన రేడియో, టేలివిజన్, కంప్యూటర్ , స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ , రాకెట్ , సాటిలైట్ , వాట్ నాట్ ఎవ్రీథింగ్. !!!
ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజాల్ని నిజాయితీగా ఒప్పుకోండి
Think once, Think rationally, don't believe anything without reasoning.
మానవత్వమే అసలైన మతమని గుర్తించండి. హేతుబద్ద ఆలోచన, తార్కికత, ప్రశ్నించడం, నిరూపణ అయిన సత్యాలనే నమ్మడం, మూడ నమ్మకాలను విడనాడటం, సాంఘిక సంస్కరణకు తోడ్పడటం, మంచి పౌరులుగా ఎదగడం వంటి లక్షణాలను విద్యార్దులలో పెంచండి.
సేకరణ

No comments:
Post a Comment