Tuesday, November 30, 2021

మనసు మాటల ముత్యాలు

మనసు మాటల ముత్యాలు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సేకరణ:

🌹 మనల్ని మెచ్చుకునే వారందరూ మనవారు,
తిట్టేవారందరూ పరాయివారు అనుకోకూడదు...
ఏ మెప్పువెనక ఏ మోసముందో
ఏ తిట్లవెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి."

🌹 కొన్ని బంధాలు
మన పుట్టుకతోనే ఏర్పడతాయి
కొన్ని బంధాలు
మనం ఏర్పరచుకుంటాం..
కానీ కొందరు మాత్రం
ఏ బంధం లేకుండా మనతో
ఆత్మబంధువుల్లా ఉంటారు.
అలాంటి వారిని
ఎప్పటికీ వదులుకోకండి.

🌹 కాలం ఎప్పుడూ
ఒకేలా ఉండదు.
తలపొగరుతో తిరిగిన వాడిని
తలదించుకునేలా చేస్తుంది.
తలదించుకుని బ్రతికినవాడిని
ధైర్యంగా బతికేలా చేస్తుంది.
నవ్విన వాడిని ఏడిపిస్తుంది.
ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది.
కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే..!!

🌹 లోకం పోకడ.....

బంధం బాగున్నప్పుడు
అందరి విషయాలు నీకు చెప్తారు.
బంధం వీగినప్పుడు...
నీ విషయాలు అందరికీ చెప్తారు....!!

🌹 గెలవాలి అనే స్ఫూర్తితో పోరాడు...
ఓడినా...తట్టుకోగలవు...
గెలిచి తీరాలనే అహంతో పోరాడకు...
ఓడిపోతే తట్టుకోలేవు...
అది పోటీ అయినా...జీవితమైనా...!!

🌹 ముఖంపై చేదుగా మాట్లాడే వారు
ఎప్పుడూ మోసం చేయరు.
భయపడవలసింది తియ్యగా
మాట్లాడే వారితోనే..
మనసులో అసూయ
పెంచుకుంటారు,
సమయం వచ్చినప్పుడు
మారిపోతారు.
అద్దం బలహీనమైనదే
కానీ నిజాన్ని చూపడంలో
ఎప్పుడూ భయపడదు..!!

🌹 కోపం, బాధ, ప్రేమ
ఇవి అందరి మీద చూపించలేము.
మనం ఇష్టపడే వారి మీద,
ప్రేమించే వారి మీద
మాత్రమే చూపించగలం.
మీరు ఎంత తిట్టినా,
బాధ పెట్టినా
నీకోసం ఏదైనా భరిస్తారు.
అలాంటివారిని వదులుకోకండి.
మీరు దూరం అయితే వాళ్లు తట్టుకోలేరు
అని గుర్తుంచుకోండి.

🌹 ఎప్పుడూ సంతోషంగా
ఉండాలి అనే కోరిక కన్నా
ఎప్పుడూ సంతృప్తి గా ఉండాలి
అనే కోరిక చాలా విలువైనది.

🌹 విద్య నేర్చుకున్నాక
గురువుని మరచిపోకు.
ధనం వచ్చాక
మిత్రులని మరచిపోకు.
భార్య వచ్చాక
కన్న వారిని మరచిపోకు.
గౌరవం వచ్చాక
గతం మరచిపోకు.
అవసరం తీరాక
సహాయం చేసిన వారిని
*మరచిపోకు.

సేకరణ

No comments:

Post a Comment