నేటి మంచిమాట పెద్దలమాట.
ఇతరుడయినా సరే - మనకు మేలు చేకూర్చేవాడే బంధువు. మనవాడే ఐనా మనకు బాధ కల్గించేవాడు శత్రువే. వ్యాధి దేహంలో పుట్టిందే అయినా బాధ కల్గిస్తుంటే - ఎక్కడో అరణ్యంలో పుట్టిన ఓషధి బాధను తొలగించి ఆరోగ్యాన్ని కల్గిస్తూంది కదా!*
కావున ఎవడు శత్రువో, ఎవడు మిత్రుడో, వాళ్ల స్వభావాలు
ఎలా ఉంటాయో, ఖచ్చితంగా నిర్ణయించడం కష్టం. మిత్రరూప
శత్రువులూ, శత్రురూప మిత్రులూ ఎందరో ఉంటారు.
వీళ్లని
గుర్తించడానికి ఒక విధానం చెప్పబడింది. మన
వాడు కాకపోయినా పరాయివాడే అయినా మనకు మేలు
కల్గించేవాడే నిజమైన బంధువు ఆత్మీయుడు. మనవాడే
రక్తసంబంధం కలవాడే అయినా మనల్ని పీడించేవాడు నిజంగా
శత్రువే అవుతాడు.
వ్యాధి శరీరంలో వస్తుంది. కానీ దాన్ని
తొలగించడానికి ఎక్కడో అరణ్యంలో పుట్టిన ఔషధీమూలిక
ఉపయోగ పడుతుంది కదా!
వీడు సొంతంవాడా పరాయివాడా..
అని కాదు చూడా ల్సింది. వాడు మనకు మంచి చేసేవాడా?
కీడు కల్గించేవాడా? అనే విషయం గమనించాలి. హితం కల్గించే
వాడు ఎవడైనా, ఎక్కడివాడైనా వాడే దగ్గరి బంధువు, అత్యంత
ఆత్మీయుడు. అరణ్య ఔషధి మన శరీరవ్యాధిని పోగొట్టినట్లు
పరాయివా డయినా మనకు హితం చేకూర్చేవాడు నిజమైన
హితుడు, సన్నిహితుడు. ఇతరులకు ఉపకారం చేసే జీవితంఅల్పకాలమే అయినా - వానియశస్సు ఆచంద్రార్కం నిలు స్తుంది. తోటివాళ్లకు తోడ్పడంలో ఉన్న ఆనందం అమోఘం! మహాపుణ్యం!
ఉషోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment