నేటి జీవిత సత్యం. కాస్త ఓర్చుకో..!
ఓశిష్యుడు తన గురువు దగ్గర శిక్షణ పొందుతున్న రోజులవి.
గురువు శిష్యుడిచే ఇంటిని కట్టిస్తున్న సందర్భం.
శిష్యుడికి శరీరమంతా పుండ్లు పుండ్లు అయి వుంది.
భుజాలలోంచి ఎముకలు కనిపిస్తున్నాయి ఇంటిని కట్టడానికి రాళ్లు మోసి..మోసి.
గురువుగారు.. నేను నీకు అలా చెప్పలేదు ... ఇలా కట్టమని చెప్పాను అని ఉద్దేశపూర్వకంగానే కూలదోయిస్తున్నారు.ఇల్లు కడితే గాని జ్ఞానోపదేశం ఇవ్వరు శిష్యుడికి.
ఇంక గురువుగారు తనకు జ్ఞానస్వీకరణ ఇస్తారో ఇవ్వరో అని మహా సందిగ్ధంలో వున్నాడు శిష్యుడు.
పోనీ తన గురువు చెప్పినట్లు ఇల్లు కట్టి ఇవ్వడానికి తన శరీరం మహా పుండుగా మారిపోయింది.
ఓపిక లేదు. వేరే ప్రాంతం నుండి వచ్చిన కొంతమంది మార్పా శిష్యులు గురువుగారికి కొన్ని బహుమతులు తినుబండారాలూ తెచ్చారు. అందులో ఒక శిష్యుడు ఒక అందమైన కూజా ఒకటి గురువుగారికి బహుమానంగా తెచ్చారు.
గురువుగారి భార్య దాని నిండా తినుబండారాలూ నింపి కష్టపడి ఇల్లు కడుతున్న శిష్యుడికి ఇస్తుంది...
రాత్రి భోజన సమయంలో కూజా తెచ్చుకుని వాటిలో ఉన్న తినుబండారాలను తింటున్నప్పుడు అతని చూపు కూజా మీదికి వెళుతుంది.
చాలా అందంగా బహు ముచ్చటగా ఉంది ఆ కూజా.
తినడం ముగించి నిద్రకు ఉపక్రమిస్తాడు శిష్యుడు.. అయితే పక్కనే వున్న కూజాను చూస్తూ వుండగా ఆ జడపదార్థం మాట్లాడుతున్నట్టుగా భావిస్తాడు.
కూజా మాట్లాడడం మొదలు పెడుతుంది…
’మిత్రమా నేను ఇంత అందంగా ఎలా తయారయ్యానో తెలుసా?’అని అడుగుతుంది.
తెలీదు అన్నట్లు తల ఊపుతాడు.
నేను మా అమ్మ ఒడిలో ఉంటిని బంకమట్టిగా చెరువు గట్టున. ఒక కుమ్మరి వచ్చి గునపంతో పొడిచి నన్ను మా అమ్మ ఒడినుంచి వేరుచేసి తనబండీలో వేసుకుని వెళుతుండగా నేను అడిగాను. "అయ్యా ఏం చేస్తున్నావు?” అని అడిగాను.
దానికి ఆ కుమ్మరి "కాస్త ఓర్చుకో!" అన్నాడు.
నా మీద నీళ్లుపోసి కాళ్లతో బాగా తొక్కాడు. "అయ్యా ఎం చేస్తున్నావు"? అని అడిగాను.

నన్ను ఓ చట్రం మీద వేసి గిర్రున తిప్పాడు. "అయ్యా ఏం చేస్తున్నావు?నన్ను?” అని అడిగితే…
"కాస్త ఓర్చుకో!" అన్నాడు.
తన చేతులతో నన్ను తన ఇష్టం వచ్చినట్లు అదుముతూ ఉంటే అడిగాను… "ఆయ్యా నన్నేం చేస్తున్నావు"? అని.
దానికి అతనన్నాడు "కాస్త ఓర్చుకో!" అని.
నన్ను ఓమట్టి కూజాగా తయారు చేసి ఎండలోబెట్టాడు..
"అయ్యా" అనేలోపే "కాస్త ఓర్చుకో!" అన్నాడు.
ఎండిన తర్వాత నన్ను నిప్పుల కొలిమిలో పెట్టి కాల్చాడు.
"అయ్యా నన్నెందుకు ఇలా కాలుస్తున్నావు"? అంటే…"కాస్త ఓర్చుకో" అన్నాడు.
మళ్లీ నా మొఖానికి ఏవో రంగులన్నీ పూసాడు.
"అయ్యా ఏంటి నా మొఖానికిది"? అంటే… "కాస్త ఓర్చుకో " అన్నాడు.
నన్ను తీసుకెళ్లి అద్దం ముందు ఉంచాడు. నన్ను నేను నమ్మలేకపోయాను. ఇంత అందంగా తయారయ్యానా అని.
కుమ్మరి మహా గొప్పవాడు. అతడు చేసే ప్రతిగాయం, అతడు పెట్టే ప్రతి కష్టం, అతడు పెట్టే ప్రతి పరీక్షకు నేను ఓర్చుకోవడం వల్లే నేనింత అందంగా తయారయ్యాను.
”శిల్పి ఉలి పోటును భరించలేని రాయి శిల్పం కాలేదు! గురువు పరీక్ష కాలాన్ని భరించలేని శిష్యుడు జ్ఞాని కాలేడు!” అన్నది ఆ కూజా.
శిష్యుడు ఈ విధంగా ఒక ప్రాణంలేని అందమైన కూజా గురించి మనో విశ్లేషణ చేసి తనను తాను ఆత్మావలోకనం చేసుకున్నాడు.
గురువుసారం తెలుసుకుని మహాజ్ఞానిగా నిలిచాడు.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment