Monday, November 22, 2021

మంచి మాట...లు

ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు. ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం తో మీరు మీ కుటుంబగసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..అందరం బాగుండాలి అందులో మీరు మరీ బాగుండాలి
ఆదివారం --: 21-11-2021 :--

ఈ రోజు AVB మంచి మాట...లు


నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికి నమ్మకు ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే, ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు , కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనుకబడుతాము.. గడిచిన కాలం ఎన్ని కోట్లు పెట్టినా వెనకకు తీసుకురాలేము

ఎన్ని భూములు కొన్నామన్నది కాదు ముఖ్యం ఎదుటివారి మనసులో ఎంత స్థలం సంపాదించామన్నది ముఖ్యం మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం,అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం .

వెంటుంటాం అనే వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటాం అనే వాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన ముందరనటించే వాళ్ళే అవసరం ఉన్నంత వరకూ వాడుకుంటారు అవసరం తీరిపోయాక ఆడుకుంటారు ఇదే ఈ లోకం తీరు
సేకరణ. 🖊️మీ.ఆత్మీయుడు.. AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

No comments:

Post a Comment