ఇందులో ఉన్న సత్యమేమిటో మీకు మీరే తేల్చుకోండి.
భగవన్మయమే అని బోధిస్తాడు ఓ భక్తుడు.
అంతా భగవంతుడే అయినప్పుడు
యెవరికి బోధిస్తున్నట్టు? భగవంతుడికేనా?
యెంత హాస్యాస్పదమైన పరిస్థితి అది!
"ఉన్నది ఒక్కటే; అది నేనే" అని అంటాడు తాత్వికుడు...
రెండవ వస్తువు, రెండవ వ్యక్తి లేనప్పుడు నీవు ఎవరికి చెబుతున్నట్టు?
యెంత హాస్యాస్పదమైన పరిస్థితి అది!
జగన్మిథ్య అంటాడు ఓ బోధకుడు.
జగన్మిథ్య అనే ఆ బోధకుడూ మిథ్యే...
వినే శ్రోతా మిథ్యే...
బోధా మిథ్యే...
అలాంటప్పుడు
వక్త సత్యమే చెప్పాడని అనగలమా?
శ్రోత సత్యమే విన్నాడని అనగలమా?
ఆ బోధను సత్యబోధ అని అనగలమా?
యెంత హాస్యాస్పదమైన పరిస్థితి అది!
ఒకానొక దశలో ఈ ఆధ్యాత్మిక రచయితలకు, బోధకులకు ఏం చెబుతున్నామో...ఎందుకు చెబుతున్నామో...అర్థంకాని పరిస్థితికి చేరుకుంటారు....
self contradictionకు(స్వవచో విఘాతానికి) గురి అవుతుంటారు...
అవన్నీ చివరికి పొంతన లేని మాటలప్రోగుగా మిగిలిపోతాయి.
అవే గ్రంథాలుగా రూపుదాలుస్తాయి...
జిజ్ఞాసువులు వాటిని ముందరేసుకుని తలమునకలవుతుంటారు...
అవన్నీ ఉత్త మోతే తప్ప
వాటిలో సారమేమీ ఉండదు.
చెప్పేవాడికి, వినేవాడికి ఇద్దరికీ అర్థంకానిదే వేదాంతం...అని ఓ కవి అన్నాడు.
చెప్పేవాడు, వినేవాడు ఇద్దరూ
అయోమయంలో ఉన్నవారే...
మా ఊళ్లో అందరూ అబద్దాలు చెప్పేవాళ్లే అన్నాడట ఒకడు...
ఇంతకీ అతను అబద్ధం చెప్పినట్టా? నిజం చెప్పినట్టా?
ఊళ్లోవాళ్లు అబద్దాలు చెప్పేవాళ్లా? నిజం చెప్పేవాళ్లా?
ఇదమిత్థంగా తేల్చి చెప్పడం కష్టం...
ఏ సమాధానం ఇచ్చినా, అది మరో ప్రశ్నకు దారితీస్తుంది.
ఎవడికీ ఏమీ అర్థమైంది ఏమీలేదు....
అని అర్థమైనవాడే జ్ఞాని...
నాకు తెలిసిందల్లా 'నాకేమీ తెలియదు' అనేదే...
అన్న సోక్రటీసు మనకు ఆదర్శం.
జీవితలక్ష్యం - ఏమీలేదు...అన్న వివేకానందులే మనకు ఆదర్శం.
గ్రహించడానికి ఏమీలేదని గ్రహించడమే జ్ఞానోదయం...అన్న UG మనకు ఆదర్శం.
'ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం'
అన్న సద్గురువు మనకు ఆదర్శం.
'తెలుసుకోవాలి' అనేవాడు - విజ్ఞాని.
'తెలుసు' అనేవాడు - అజ్ఞాని.
'తెలియదు' అనేవాడు - జ్ఞాని.
మన బుద్ధి పరిమితం.
మన భాష పరిమితం.
ఈ పరిమితులతో అపరిమితమైనదానిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం.
దోషముండే స్కేల్ తో నీవెంతగా కొలిచినా
లెక్క తేలదు.
ఈ పరిమితబుద్ధితో నీవెంతగా తర్కించినా
ఆత్మ దొరకదు.
"పొందలేం"అని చెప్పేవాడే
నీకు చాలా మేలు కూర్చేవాడు.
పొందాలి-పొందగలం అని చెప్పే
ప్రతివాడూ మోసగాడే.
పొందినవాడు చెప్పడు.
చెప్పినవాడు పొందలేదు.
అంతా మిథ్య....అని తెలిసినా
లేక
అంతా బ్రహ్మమే...అని తెలిసినా
ఊరికే ఉంటాడు...
ఏమీ మాట్లాడడు...
ఎవరికీ బోధించడు...
మరి నేనేం చెప్పినట్టు?
ఎందుకు చెప్పినట్టు?
ఎవరికీ చెప్పినట్టు?
'నేను' తప్ప ఏమీ లేదు కదా?
నాకు నేనే చెప్పుకుంటున్నానా?
అయ్యా...!
నేను గాక ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ...?
దయచేసి చెప్పండి...
ఉంటే, నా మాటలేవీ పట్టించుకోకండి...
ఇవి నా కోసం నాలో నేను చెప్పుకున్న మాటలే...
ఇవన్నీ నా కలవరింతలే... నా పలవరింతలే...
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment