రెప్పపాటు కాలంలో నాలాంటి వివేకానందులను వేలమందిని సృష్టించగలిగే శక్తిమంతుడు నా గురువు...అంటారు వివేకానంద.
అలాంటి రామకృష్ణుల నోట ప్రతి నిమిషం "భగవదిచ్ఛ" అనే మాట నానుతూ ఉంటుంది.
భగవదిచ్ఛను స్వాగతించడమే భక్తియోగం.
భగవదిచ్ఛను ఎదిరించడమే కర్మయోగం.
ఒకడు ముందుగానే లొంగిపోతాడు.
మరొకడు ఎదిరించి చివర్లో లొంగిపోతాడు.
ఏ యోగమైనా, ఏ మార్గమైనా చివర్లో లొంగిపోవడమే(శరణాగతి) పరమావధి.
ఓటమిని అంగీకరించడం,
పూర్తిగా నిస్సహాయంగా ఉండిపోవడం
అప్పుడు దాని నుండి వెలువడేదే వివేకం(wisdom).
నీవు చేయగలిగింది ఏమీలేదని అర్థం.
అదే సంపూర్ణ ఆత్మసమర్పణం...అంటారు UG.
పల్లంలోకి నీరే వచ్చి నిండిపోతుంది.
లొంగిపోతే దైవమే వచ్చి నీలో ఉండిపోతుంది.
"ఏ సాధనా చేయకపోవడమే మా సాధన"
అంటుంటారు గురువుగారు...
నిజానికి ఇదే అతి కష్టమైన సాధన అనిపిస్తుంది.
ఏదో ఒకటి చేస్తుండడం సులభం.
ఏమీ చేయకుండా ఉండడమే కష్టం.
కష్టపడి సాధిస్తేగాని మనకు తృప్తి ఉండదు.
సులభంగా దొరికేస్తే ఏ విలువా ఉండదు.
ఊరికే ఉండడం వలన సిద్ధి కలగడం కాదు,
ఊరికే ఉండడమే సిద్ధి.
నీవు నీవుగా ఉండటానికి నువ్వేమీ చేయనక్కర్లేదు.
కానీ నీవు నీవులా కాకుండా మరోలా ఉండటానికి నీవు చాలా(సాధనలు)చేయాలి...అంటారు UG.
"అది" ఇప్పటికే పరిపూర్ణం.
దానిని మనం కష్టపడి పరిపూర్ణం చేయనక్కర్లేదు.
"మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు" అంటారు క్రీస్తు.
రూపాయిలో ఉన్న ఓ "పైసా", రూపాయితో దబాయించి చెప్పవచ్చు- నేను లేకపోతే నీ పరిపూర్ణత్వానికే భంగం అని.
ఉన్నది సద్వస్తువు ఒక్కటే. దానికి విడిగా ఏమీలేదు....అనుకున్నాక మనం సత్యం కాకుండా ఎలా ఉంటాం.
ఈతరానివాడైనా సరే, అమృతసరస్సులో మునిగిపోయి ఎవడైనా మరణించగలడా?
"అది ఉన్నరీతిన ఉన్నది" అంతే.
పొందటమో, పోగొట్టుకోవడమో రెండూ చేయలేం.
సత్యం అనేదానిని-
నీవు పట్టుకోలేవు.
నీలో ఇముడ్చుకోలేవు.
నీవు వ్యక్తం చేయలేవు.
అంటారు UG.
అమాయకులైన పరమానంద శిష్యులు పదిమంది కలిసి ఓ నదిని దాటాక, అందరూ గట్టుకు చేరారా లేదా అని అనుమానమొచ్చి, అందులో ఒకడు తనను మినహాయించి లెక్కపెట్టేసరికి తొమ్మిదిమందే లెక్కతేలుతారు. ఒకడు నదిలో కొట్టుకుపోయాడని అందరూ ఘొల్లుమంటారు.
ఆ దారిన పోతున్న బుద్ధిమంతుడైన బాటసారి ఇది గమనించి, లెక్కించేవాడినుంచి లెక్క మొదలుపెట్టి పదిమందిని లెక్కించి, మీలో ఎవరూ కొట్టుకుపోలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని తెలియజేస్తాడు.
అలా తాను స్వతఃగా ముక్తస్వరూపుడు.
తాను పొగొట్టుకున్నదిగానీ,
క్రొత్తగా పొందవలసినదిగానీ
సాధన చేయవలసిన అగత్యంగానీ
తనకు అస్సలు లేనేలేదు.
ఆ అమాయక బాలుని వలె లెక్క(సాధన) చేస్తున్నాడు.
ఆ పదియవ వాడివి నీవే అని గుర్తుచేసేవాడు గురువు.
వెదికేవాడే.....చివరికి దొరికేవాడు కూడా.
పొరపాటున అద్దాలమహల్ లోనికి వెళ్లిన కుక్కకు
అనేక కుక్కలు ఉన్నట్టు భ్రమపడి ప్రతిబింబాల వైపుకు దాడి చేయడానికి ప్రయత్నించినట్టు
ఉండేది తానొక్కడే అయినా
తననే అజ్ఞానంతో అనేకంగా చూస్తూ
ద్వైతభావనతో ఘర్షణపడుతున్నాడు.
అద్వైతసిద్ధికై గురువును ఆశ్రయించి
సాధన చేస్తున్నాడు.
నిజానికి సాధనలోనూ, సాధ్యములోనూ
ఉండేది "తాను" ఒక్కడే.
ముల్లును మరో ముల్లుతో తొలగించునట్లు
భ్రమను మరో భ్రమతోనే తొలగించాలని
గురువు నిశ్చయించి, శిష్యునికి ఒక సాధనను నిర్దేశించి ఉన్న ముక్తినే ఇస్తాడు అంతే.
నిజానికి-
తనకు లేనిదానిని, తాను కానిదానిని
ఎవడూ ఇవ్వలేడు.
ఇవ్వబడినదంతా తనకున్న దానినే,
తానే అయి ఉన్నదానినే.
ఇతరులకు తాను క్రొత్తగా ఏదో పొందినట్టు
అనిపిస్తుందేగాని
సాధన ద్వారా తానెప్పుడూ ముక్తుడేనని,
పొగొట్టుకున్నది స్వరూపాన్ని కాదు,
జ్ఞప్తినే అని తెలుసుకుంటాడు.
మరపే - బంధం.
జ్ఞప్తియే - మోక్షం.
కథలోని ఓ పాత్ర ఆ కథారచయితకు తెలియకుండా కథలో నుంచి విరమించుకోగలదా?
కలలోని ఓ వ్యక్తి ఆ కలను కనేవానిలోంచి బయటకు దుముకగలడా?
నిజానికి 'నేను కర్తను కాను' అనడానికి కూడా
నీవు కర్తవు కావు.
ఈ మాటయినా నీ వెనక ఉండి
నిన్ను నడిపించేవాడు అంటేనే నీవు అనగలవు.
నీ ప్రతి పలుకూ భగవంతునిదే.
నీ ప్రతి కదలికా భగవంతునిదే.
ఈ జగత్కథలో పాత్రలే జీవులందరూ.
ఆ మహా కర్తే(రచయితే) పరమేశ్వరుడు.
ఆ కర్త తన వినోదము కొరకు రకరకాలుగా
పాత్రలను(జీవులను) సృష్టించి ఆడిస్తున్నాడు.
వినోదార్థం జరుగుతున్న ఈ ఆనందక్రీడలో "యెందుకు" అన్న ప్రశ్నకు అర్థం లేదు.
"ఈశ్వరుడు కర్త" అనేది నిజంగా తెలిసిననాడు
ఆ క్రీడలో నీవూ భాగస్వామ్యం అవుతావేగాని,
"ఎందుకు" అన్న ప్రశ్న వేయవు.
ఏ అయోమయానికీ లోను కావు.
ఏ సుఖదుఃఖాలకూ లోను కావు.
"కర్త"గా నీవెప్పుడైతే తప్పుకున్నావో
(ప్రారబ్ధ-ఆగామి-సంచిత)కర్మలు మూడూ నీ నుంచి తప్పుకుంటాయి.
నీవు "అకర్త"వు అవుతావు.
"అకర్త" తోలుబొమ్మలాంటివాడు.
తోలుబొమ్మకు సుఖదుఃఖాలు ఉండవు.
ఆడించేవాడు - చైతన్యస్వరూపుడు.
ఆటవస్తువులు - జడరూపాలు.
ఆడించేవాడు ఆడిస్తే ఆడుతాయి.
పెట్టెలో పడేస్తే ఊరికే ఉంటాయి.
అలా ఈ ఆత్మ అనే తెరపై ఆడే బొమ్మలు జీవులు.
అనే తెలివి కూడా దైవమే ఇస్తుంది జీవులకు.
జ్ఞానమూ దైవప్రసాదమే.
అజ్ఞానమూ దైవప్రసాదమే.
బంధమూ క్రీడే.
మోక్షమూ క్రీడే.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment