Monday, September 12, 2022

మంచి మాట.. లు(07-09-2022)

బుధవారం --:
07-09-2022 :--

ఈనాటి AVB మంచి మాటలు
జీవితం సాఫీగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది, కానీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది .

నీలో రక్తం చుక్కలు చిందికుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకర ఆయుధం మాట. దానిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు, తెలివైనవారు ఆలోచించి మాట్లాడుతారు .

మనకు మనస్సులో సంతోషం లేనపుడు మనం ఏడంతస్థుల మేడలో ఉన్నా ఏమీ లేని గుడిసెలో ఉన్నా ఒకటే ! . మనస్సులో ఓర్వలేనితనం ఉన్నప్పుడు నువ్వు ఏడుకొండలు ఎక్కినా, ఏడుస్తూ పూజచేసినా ఒక్కటే .

నీకున్నదంతా ఏదో ఒక రోజు ఇచ్చేయాల్సిందే, నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు . ఇచ్చే గొప్ప ఆవకాశాన్ని నువ్వే వాడుకో ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు .

సేకరణ ✒️ మీ .. AVB సుబ్బారావు*💐🌷🕉️🤝🙏

No comments:

Post a Comment