బాహ్య ప్రపంచం (అనగా రూపం, గంధం, శబ్దం, రసం, స్పర్శ,) మన ఇంద్రియాల ద్వారా (అనగా కళ్ళు, ముక్కు,చెవి,నాలుక, చర్మం), ఎల్ల వేళలా మనలో ప్రేరణలు కలిగిస్తుంది.
ఈ ప్రేరణలకు మనం ప్రతి స్పందిస్తాము. ఈ ప్రతి స్పందనలే మన అలవాట్లకు, ప్రవర్తనకు ,భావోద్వేగాలకు కారణం.
దాదాపుగా మనం ప్రతి స్పందించే తీరు ఒక అలవాటుని ఒక తీరుని ఒక నమూనాని కలిగి ఒక అసంకల్పిత ప్రతీకారం చర్య లాగా వుంటుంది. మన నియంత్రణ, పట్టు వుండదు.
*కాని ఒక చిన్న అవకాశం వుంది.అది ఏమిటంటే. కాల వ్యవధి.*
బాహ్య ప్రేరణకి మన స్పందనకి మధ్య కాలవ్యవధి.
ఈ కాల వ్యవధి లో మనం ఎన్ని రకాలుగా స్పందించ వచ్చో, ఎలాంటి స్పందన సరితూగ గలదో, నిర్ణయించ వచ్చు.
*ధ్యానం* మనకు ఈ వ్యవధి ని ఇస్తుంది.
*సతి, అంతర్దృష్టి* ఎలా స్పందిస్తున్నాం అని చెపుతుంది
*ప్రజ్ఞ* ఏది సరైన స్పందనో చెపుతుంది.
*శీలం* శీలాచరణకు దారితీస్తుంది.
*ధ్యానం* *సతి*, *అంతర్దృష్టి*, *ప్రజ్ఞ,* *శీలం* ఇవి *నిర్వాణానికి* దారి తీస్తాయి.
*ఇట్లు*
స్పందించే వాడు *లేని* స్పందన.
No comments:
Post a Comment