Thursday, September 29, 2022

మోక్షం అంటే ఏమిటి?

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                       మోక్షం
                   ➖➖➖✍️

మోక్షం అంటే ఏమిటి?

ప్రతీ ప్రాణీ కూడా పాపమో, పుణ్యమో ఏదో ఒక కర్మ శేషం ఉంటేనే ఈ భూమి మీద పుడతాడు.

మోక్షం  అంటే  పాపము  మరియు పుణ్యము లేని స్థాయిని చేరడం. 

ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ భూమి మీద జన్మ ఎత్తవలసినన అవసరం ఉండదు.

మతం ఏదైనా మతంలో, మోక్షం అనేది ధ్యానం ద్వారా మానవులు సాధించగల ఆనందం మరియు శాంతి స్థితి.

బౌద్ధమతం,  జైన మతం మరియు హిందూ మతం యొక్క అతి ముఖ్యమైన సూత్రాలలో ఇది ఒకటి , ఎందుకంటే ఇది చేరుకోగల గరిష్ట స్థితిని సూచిస్తుంది.

మతంలో, మోక్షం అనేది అత్యున్నత స్థానంగా భావించబడుతుంది, దీనిలో మీరు మీ భుజాలపై మోసిన అన్ని బాధలకు మీరు వీడ్కోలు పలుకుతారు.

ఈ జన్మలోనే మోక్షం పొందడానికి మనకున్న కర్మ క్షయం అవ్వాలి. అంటే ఎన్నో పూర్వ జన్మలలో చేసిన పాపపు కర్మ మరియు పుణ్యపు కర్మల యొక్క ఫలం మొత్తాన్ని ఈ జన్మలోనే అనుభవించాలి.

మోక్షం పొందడానికి   సత్య  త్రేతా ద్వాపర యుగాలలో తపస్సు, యజ్ఞాలు, అతికష్టమైన దీక్షలతోనూ, సద్గురువు యొక్క అనుగ్రహంతోనూ మోక్షాన్ని పొందేవారు.  దానికి వారి ఆయుష్షు, శరీరం, మనస్సు, ఆ కాల పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండేవి.

ఇవి కలియుగ మానవులకు సాధ్యం కాని పని. దానికి మన ఆయుర్దాయం సరిపోదు. ఇలా జన్మ జన్మలలో చేసిన కర్మలకు ఫలాన్ని అనేక జన్మలు ఎత్తుతూ అనుభవిస్తాడు.    మళ్ళీ ఎత్తిన ఈ జన్మలలో కూడా పాపాలు, పుణ్యాలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ వీటి కోసం ఎత్త వలసిన జన్మల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. 

ఇలా జీవి జనన మరణ చక్రాలలో ఇరుక్కుంటాడు. చేసిన పాపపుణ్యాల ఫలితాలను కాసేపు దుఖం రూపంలో, మరికాసేపు సుఖం రూపంలో అనుభవిస్తూ ఈ సంసారం అనే సాగరంలో ఈదుతూ, ఒడ్డుకు చేరలేక మునిగిపోతూ ఉంటాడు.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment