230922a2229. 240922-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀643.
నేటి…
ఆచార్య సద్బోధన:
➖➖➖✍️
మనిషి దేనినైతే ఎక్కువగా తలుస్తాడో దాని రూపాన్నే పొందుతాడు.
మనకు నిత్యమూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే సమస్యను వదిలి పరిష్కారం మీద దృష్టి పెట్టడం మానేసి, సమస్య పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాం.
కనుకే సమస్య తీరకపోగా మరింత జటిలం అవుతుంటుంది. తీవ్ర మనోవ్యధకు కారణం అవుతుంది.
ఫలితంగా మానసికంగా కృంగిపోయి పలు రకాల అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాం.
బుద్ధిమంతుడు అయినవాడు సమస్యను వదిలి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి.
అసలు సమస్యకు మనం లొంగకపోతే సగం పరిష్కారం దొరికినట్లే!
మిగతా మన ప్రయత్నం ద్వారా సాధించుకోవచ్చు. కనుక ఇలలో సమస్యలకు, అవరోధాలకు, అడ్డంకులకు లొంగవద్దు.
భగవంతుడే అన్నింటికీ సరైన పరష్కారం. కనుక ప్రయత్నం చేయండి. పరమాత్మను నమ్మండి. ఏ సమస్యా ఏమి చేయలేదు మనల్ని.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
No comments:
Post a Comment