Friday, September 23, 2022

ఈ. ప్రపంచములో ఇద్దరు గజదొంగలు వున్నారు. వారు మానవుని ఆయుస్సును హరించివేయుచున్నారు.

 *ఇద్దరు దొంగలు*

✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.
🙏🌺🌺🌺🌺🌻🌻🌺🌺🌺🌺🙏

ఈ. ప్రపంచములో ఇద్దరు గజదొంగలు వున్నారు. వారు మానవుని ఆయుస్సును హరించివేయుచున్నారు. 

ఆహారం, నిద్ర అను ఈ ఇరువురే ఆ గజదొంగలు.

మానవుని అమూల్యమైన ఆయుస్సునంతను వారు వ్యర్థమొనర్చివేయుచున్నారు. వారిరువురుని జయించిననే తప్ప జీవుడు కడతేరుటకు ఏ మాత్రము అవకాశము లేదు.

మితాహారము, మితనిద్ర అను ఈ రెండు సూత్రములను ఆశ్రయించి, వాటిని చక్కగా అమలు జరిపినపుడు మాత్రమే జీవుడు శాంతిని సుఖమును నోచుకొనగలడు.

ఉదయము నిద్రలేచినది మొదలు ఆహార విషయములో ఎంతయో సమయము వృథాగా గడచిపోవుచున్నది. అట్లే నిద్రలో కాబట్టి ఆ రెండింటియెడల ఒకింత సంయమము అలవరచుకొనుట చాల అవసరము.

అపుడు భగవధ్యానమునకు ఎంతయో సమయము దొఱకును. శరీరమునకు అవసరమైన ఆహారము, అవసరమైన నిద్ర గైకొనుచుండినచో ఆరోగ్యము చక్కబడును. దైవచింతనకు సమయము బాగుగా లభించును.

కాబట్టి జన్మ సార్థక మొనరించదలంచు సాధకులు, ముముక్షువులు, ఆహారము, నిద్ర అను ఈ యిరువురు దొంగల విషయములో కడు జాగరూకులై యుండవలెను.

వారు తమ జీవితమును హరించివేయకుండు లాగున బహు జాగ్రతతో కనిపెట్టుచు, అప్రమత్తులై వ్యవహరించవలయును.

*లోకాస్సమస్తా సుఖినోభవంతు*

*సేకరణ:* 
🙏🌺🌺🌺🌺🌻🌻🌺🌺🌺🌺🙏

No comments:

Post a Comment