🔮💓🔮💓🔮💓🔮💓🔮
👤 *ఆత్మ సౌందర్యం* 👤
బోర్లా పడ్డ కుండ ఎన్నడైనా నిండు తుందా?
పక్షి రెక్కలు విచ్చుకోకుండా ఎన్నడైనా ఎగర గలదా?
మనసు నిండా వ్యర్థ ఆలోచనలు నింపుకున్న వాడికి జ్ఞాన సారము మనసులోనికి పంపించే వీలుంటుందా?
ఇప్పుడు తలుపులన్నీ మూసేకుని, గదిలోపల అంతా వాసన వస్తుందని మనమేం చేస్తున్నాం..?
గదిలో - - సెంటు కొట్టుకుంటూ కూర్చుంటున్నాం!
అదికాదు మార్గం.
కిటికీలు తలుపులన్నీ తెరిచి వుంచితే చాలు..
ఏ సెంటూ కొట్టక్కర్లేదు...
మరి - ఆ కిటికీలు తలుపులకున్న గొళ్ళాలు తీస్తెనే కదా అవి తెరచుకునేది..
అలాగే మన లోపల తలంపులన్నీ మూసి ఉంచి, మనలో కంపు ( భాధలు, ఎమోషన్స్ ,రోగాలు ) కొడుతోంది అని మనమేం చేస్తున్నాం - -
టాబ్లెట్స్ - - పూజలు - -
దేవుడికి మొక్కడం - -
ఈ దేవుడు - - ఆ దేవుడు - -
అంటూ దేవుడి ముందు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిల్చుంటే ఎలా!?
అది గాదు మార్గం ..
ముందు ఆ తలంపులన్నీ బయటికి పంపాలి...
మరి
ధ్యానం చేస్తేనే గదా ఆ తలంపులకున్న గొళ్ళాలు తెరచుకునేది..
అప్పుడే గదా ఆన్ని తలంపులూ బయటికి వెళ్ళేది..?
"ముడి విప్పగ నేర్చగనే మొక్షరాజ్య మేలు"
అని వేమన అన్నట్టు..
ఏ ముడి విప్పడం తెలియాలి ఏంటి..?
విప్పడానికి ఏ ముడీ లేదు..
వున్నది ఒకటే ముడి..
అన్ని తలంపులు (ఆలోచనలు) వున్న మనసు ముడి..
ఆ మనస్సు
తిరుపతి లో లేదు - -
కాశీ లో లేదు - -
మక్కా లో లేదు - -
ఎవరి మనస్సు వారి దగ్గరే వుంది..
ఎవరి మనస్సు ముడి వారే విప్పుకోవాలి..
భయమెందుకు ?
మన అంతరానికి ఏది అవసరమో దాన్ని చేసుకుంటూ పోవడమే ముడి విప్పే మార్గం..
అప్పుడే గదా మోక్షమనే రాజ్యాన్ని ఏలేది..!
అదేదో సామెత అన్నట్టు..
"తలలు బోడులు కాదు అవ్వాల్సింది..
తలంపులు బోడులు అవ్వాలి" అని..
బయటికి నీటుగా, ఎన్నెన్నో ఫ్యాషన్ అందాలు, ఏవేవో డ్రస్సులతో అందంగా అలంకరించుకుంటే సరిపోతుందా..?
ఎన్నాళ్ళీ బాహ్య ప్రపంచానికి నచ్చడం కోసం వృధా ప్రయాస..
లోపల క్లీన్ గా వుండవద్దా..?
బాహ్యంగా అందంగా ఉంటే సరిపోతుందా..?
లోపల సౌందర్యాన్ని ఎవరు మెరుగులు దిద్దుతారు..?
మనమే దానికి బాధ్యులం..
*మనమే ఆత్మ సౌందర్యం పెంచుకోవాలి..!*
💜💙🧡💓💚💗💛❤️🤎
No comments:
Post a Comment