Tuesday, September 13, 2022

స్వామి వివేకానంద జీవిత గాథ:-77.

 110922d1448.    120922-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀77.
ఓం నమో భగవతే రామకృష్ణాయ

స్వామి వివేకానంద జీవిత గాథ:-77.
               ➖➖➖✍️

*స్వయంగా నరేంద్రుడు ( స్వామి వివేకానంద )ఇలా చెప్పాడు*....
                ▪️〰️▪️

ఒక్కో రోజు  ఇంట్లో అందరికీ చాలినంత ఆహారం లేదని తెలుసుకొని, చేత చిల్లిగవ్వ లేకపోవడంతో, 'ఒక మిత్రుడు భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడని అమ్మతో చెప్పి, బయటకు వెళ్లిపోయే వాణ్ణి.  ఇంట్లో వారికి సరిపడే ఆహారం ఉంటుందనే ఉద్దేశంతో ప్రస్తులతోనే గడిపేవాణ్ణి.  బయటి వారికి ఈ విషయాలు తెలుపడానికి అభిమానం అడ్డుపడేది. 

ఇంతకు ముందు మాదిరే సంపన్నులైన మిత్రులు తమ ఇళ్లకు  వచ్చి నా పాటలతో తమ ఆనందాన్ని ఇనుమడింపజేయమని కోరేవారు. వారి కోర్కెను తిరస్కరించలేక, కొన్ని సమయాలలో వారితోబాటు వెళ్లి నా పాటలతో వారిని సంతోషపరచేవాణ్ణి. కాని నా మనస్సులోని భావాలను వారికి వ్యక్తపరచాలని అభిలషించేవాణ్ణి కాను.  

*ఏ ఒకరిద్దరో అప్పుడప్పుడు ఆప్యాయంగా, 'ఈ రోజు నువ్వెందుకు నిరుత్సాహంగా, బలహీనంగా కనిపిస్తున్నావు? కారణం ఏమిటో దయచేసి చెప్పు' అని అడిగేవారు. వారిలో ఒక మిత్రుడు, ఇంకొక మిత్రుడి ద్వారా నా పరిస్థితి తెలుసుకొని, అజ్ఞాతంగా మా అమ్మకు ఉత్తరాలు వ్రాస్తూ, డబ్బు పంపసాగాడు. ఈ విధంగా అతడు నన్ను శాశ్వతంగా ఋణబద్ధుణ్ణి చేసివేశాడు*."
 

"నా మిత్రులలో కొందరు వక్రమార్గంలో డబ్బు సంపాదించేవారు. నా స్థితి గురించి విన్న వారు ఈ తరుణాన్ని వినియోగించుకొని నన్ను తమ వైప లాగడానికి ప్రయత్నించారు. వారిలో కొందరు నా మాదిరి హఠాత్తుగా పరిస్థితులు తారుమారు కావడంతో పొట్ట గడపడానికై అవినీతి మార్గాల్లో వెళ్లిన వారు. వారు నిజంగానే నా పట్ల జాలి వహించారు. మహామాయ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. 

ధనవంతురాలైన ఒక స్త్రీ చాలాకాలంగా నా మీద కన్ను వేసింది. ప్రస్తుతం నా పరిస్థితిని సదవకాశంగా తీసుకొని ఆస్తితో పాటు తననూ స్వీకరించి దారిద్ర్యానికి స్వస్తి చెప్పమని కబురు పంపించింది!ఆ ప్రతిపాదనను జుగుప్పతో తిరస్కరించాను. మరో స్త్రీ కూడా నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది. 

*'అమ్మాయీ! ఒక గుప్పెడు బూడిద కాబోయే ఈ శారీరక సుఖం కోసం ఇంతదాకా ఏదేదో చేశావు! ఇదుగో మరణం నీ ముందే ఉంది. దానిని ప్రతిఘటించడానికి నువ్వు ఏదైనా చేసివున్నావా? తుచ్చమైన తలంపులను వదలిపెట్టు. భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించు*' అని ఆమెకు హితవు చెప్పాను."✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment