Monday, September 12, 2022

ఆచార్య సద్బోధన: కామమును అనుభవించిన కొలది అది వృద్ధి చెందుచునే యుండును గాని తగ్గదు.

 110922a1826.   120922-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀631.
నేటి…

                ఆచార్య సద్బోధన:
                   ➖➖➖✍️


జ్ఞానికి నిరంతర శత్రువు ఈ కామము.

మోక్షము పొందువరకు ఈ కామము ఎన్నిజన్మలకైనను మనుజుని వేధించుచునే యుండును గావున దీనిని నిత్యశత్రువని పేర్కొనిరి.

కామమును అనుభవించిన కొలది అది వృద్ధి చెందుచునే యుండును గాని తగ్గదు.

అగ్నిలో నేయి వేయుచున్నంతవరకు జ్వాలలు పెరుగునే కాని తరగవు.

కామము కూడ అటువంటిదే.

అగ్ని తనువును ఏ విధముగా దహించునో, కామము అదేవిధముగా మనస్సును దహించును.

నేటి శత్రువులు రేపటి మిత్రులుగా మారవచ్చును. కాని కామము ఎప్పటికిని మనిషికి శత్రువుగనే యుండును.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment