*🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴 గడిచిపోయిన విషయాలను పదే పదే స్పురణకు తెచ్చుకోవడము, ఫలితముగా బాధ అనుభవించడము మానవుని బలహీనతలలో చెప్పుకోదగినది. ఒకసారి చెప్పిన జోక్ కి పదిసార్లు నవ్వలేము కదా! నిన్న చదివిన వార్తాపత్రికను ఈ రోజు చదువము కదా! అలానే గడచిన విషయం ఎక్కడ జరిగిందో అక్కడే వదిలేయాలి. గతంను వెనుకకు తీసుకురాలేము. భవిష్యత్ అనేది మన చేతులలో లేదు. ఉన్న క్షణం ఒక్కటే మనది. ఈ బరువు బాధ్యతలు మనం మోయలేము. వీటిని భగవంతునికి అప్పజెప్పి మనకున్న క్షణంను మంచికోసం వినియోగించుకుందాం. ఏది జరగనివ్వండి, భగవంతుడే దిక్కు అన్న విశ్వాసంతో ఉందాం. గ్యారంటీ లేని ఈ జీవితానికి ఇంతకంటే ఏం అవసరం??! 🌴_*
No comments:
Post a Comment