🕉 శ్రీ గురుభ్యోనమః
భగవాన్ చాలా కాలం మౌనంగా ఉన్నారు. ఆయన మౌనంగా ఉండాలని ఉండలేదు. చాలాకాలం నన్ను ఎవరూ పలకరించలేదు, అందుచేత నాకు మాట్లాడ వలసిన అవసరం రాలేదు అని చెప్పారు.
సాధకులు అవకాశం ఉంటే వారానికి ఒక రోజు మౌనంగా ఉండటం మంచిదే, దాని వలన శక్తి పెరుగుతుంది. వాగుడు తగ్గుతుంది. నాలుక కంట్రోల్ లో ఉంటుంది.
ఈ నాలుక చాలా ప్రమాదం. అజాగ్రత్తగా మాట్లాడితే విరోధాలు తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా మాట్లాడితే స్నేహాలు తెచ్చిపెడుతుంది.
ఇంతకంటే కత్తి మెరుగు. కత్తితోటి తగిలిన గాయం తొందరగా తగ్గుతుంది కానీ, నాలుకతోటి అనవసరమైన మాటలు మాట్లాడితే, ఆ గాయాలు అలాగే ఉండిపోతాయి.
అందుచేత మనం మాట్లాడే మాటలు సాత్వికంగా, హితవుగా, మితంగా ఉండాలి. మనకు నాలుక ఉందని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మనకు పాపాన్ని తెచ్చిపెడుతుంది.
No comments:
Post a Comment