Sunday, September 18, 2022

అనన్య భక్తి !!

 *అనన్య  భక్తి !!*
అనన్య చింత యంతో మాం యే జనాః పర్యుపాసతే ... అన్నట్లు... ఈ జగత్తు లో దైవం తప్ప వేరేమి లేదు, అని విశ్వసించడమే , అనన్యభక్తి...
" విశ్వం విష్ణు స్వరూపం", ఇట్టి భావాన్ని, దివ్యత్వాన్ని స్మరించుచు, జీవితమును సార్ధకం చేసుకోవడమే అనన్య భక్తిగా పరిగణింప బడుతుంది... 
ఏది చూసినా దైవ స్వరూపమే, ఏమి చేసి నా దైవ సేవయే... ఎక్కడ నడచి నా, దైవ ప్రదక్షిణమే, అనే భావన తోనే జీవితమును గడపాలి...

 ఇది అందరికీ సులభ సాధ్యము కాదు, భగవంతుడు సర్వ వ్యాప కుడు అని చెప్పడం సులభమే కానీ,  ఆ సర్వ వ్యాపకత్వాన్ని అనుభవించడం చాలా కష్టము...

"భగవంతుడా నీవు తప్ప నాకు దిక్కెవ్వరు?! " అంటూనే ...  ఇంకొక ప్రక్క నా బంధువులు, నా వారు ఉన్నారని, వారినే తలచుకుంటూ ఉంటాము...
నిజంగా భగవంతుని తో అను రక్తి ని కలిగి ఉండాలి, దైవం సర్వవ్యాపకత్వం  ఒక్కసారి అనుభవం పొందితే , ప్రపంచ విషయాలపై ఆసక్తి  తగ్గిపోతుంది. 
ఆ ప్రయత్నం తో ఒక అడుగు ముందుకు వేయాలి, ఇది
భక్తుని మొదటి లక్షణము, ఎవ్వరినీ ద్వేషించకుండా ఉండాలి, ఏ జీవుని కి నమస్కరించి నా, దైవమునకు నమస్కరించి నట్లే! 
అదే విధంగా ఏ జీవుని తిరస్క రించినా దైవాన్ని తిరస్క రించినట్లే? అని మనము తెలుసుకోవాలి...
అప్పుడే అనన్య భక్తి అవుతుంది...

        

No comments:

Post a Comment