చిన్మయానంద మిషన్ వ్యవస్థాపకులు స్వామి చిన్మయానంద..
"నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక నాస్తికుణ్ణి. హై స్కూలు చదువు ముగిసిన తరువాత దక్షిణ దేశ యాత్రలో ఉన్నప్పుడు తిరువన్నామలై లోని రమణాశ్రమం వెళ్ళాను. రమణులు సన్నిధిలో ప్రవేశించగానే ఒక సోఫాకి ఆనుకుని కూర్చున్న కౌపీనధారి అయిన ఒక వృద్ధుని చూసాను. మహర్షి అకస్మాత్తుగా కళ్ళు తెరిచి నా వైపు సూటిగా చూసారు. నేనూ వారి కళ్ళల్లోకి చూసాను.
ఒకే ఒక్క చూపే, అంతకన్నా ఏమీ జరగలేదు.
ఆ ఒక్క క్షణంలో ఏమి జరిగిందో చెప్పలేను, కానీ నా అన్వేషణ ఆరంభం అయింది. నా బుద్ధికి బలాన్ని ఇవ్వడమే కాకుండా నా నాస్తికత్వం రాలిపోయింది.
"ఆ విధంగా రమణ సన్నిధి నుండి బయటకు వెళ్లిన పిల్లవాడు, అంతకు పది నిమిషాలు ముందు లోపలికి వెళ్లిన పిల్లవాడు మాత్రం కాదు."
నా కాలేజీ చదువులు, రాజకీయ కలాపాలు దాటిన తరువాత కొన్ని సంవత్సరాలకు హిమాలయాల అంచున ఉత్తర కాశీలో గంగ ఒడ్డున ఉన్న నా గురువు స్వామి తపోవనం పాదాల చెంతకు చేరాను.
గంగ ఒడ్డున తపోమయ జీవితాన్ని గడుపుతున్న నాకు అప్పుడు తెలిసింది.." ఇప్పుడు నేను సంపాదించిన దానినే, ఎన్నో సంవత్సరాల క్రితం తిరువన్నామలై రమణ మహర్షి ఒక్క క్షణంలో నాకు ఇచ్చారని అర్ధమయింది"
1982 చిన్మయానంద ఒక ఉపన్యాసంలో ఇలా చెప్పారు...
"వారు సత్య స్వరూపులు, ఒక చైతన్యస్థితి. ప్రపంచంలోని అన్ని పరమ పవిత్ర గ్రంథాల సారము శ్రీరమణులే. పరిపూర్ణమైన వైరాగ్యంతో ఒక గురువు ఎలా ఉండాలో తెలియజేసే ప్రత్యక్ష నిదర్శనం వారు. దానికి మానవ రూపం దాల్చినవారు శ్రీ రమణ మహర్షుల వారు.
#శ్రీగురుభ్యోనమః🙏🚩
No comments:
Post a Comment