మనకు రెండు రకాల జ్ఞానాలు ఏర్పడుతాయి.
1) సంజ్ఞాయుత జ్ఞానం
2) యథా భూత జ్ఞానం.
ఈ ప్రపంచాన్ని మనదైన అభిప్రాయాలు, ముద్రలు, నమ్మకాలు, విశ్వాసాలు, భావాలు, ఉద్దేశాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్నది మొదలగు వాటి గుండా చూస్తే కలిగే జ్ఞానానికి సంజ్ఞాయుత జ్ఞానం అనవచ్చు.
ఉదా.ఎదురుగా వున్న మనిషి మనిషిగానే కాక ఒక కులస్తుడిగా, మతస్తుడిగా లేక ధనవంతుడిగా కనపడటం.
పైన పేర్కొన్న వివిధ అంశాలు,అనగా అభిప్రాయం, నమ్మకం మొదలగు నవి లేకుండా చూచినప్పుడు కలిగే జ్ఞానానికి యథాభూత జ్ఞానం అనవచ్చు.
మనస్సు ధ్యాన స్థితి లో అనగా నిశ్చల స్థితి లో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని దాని సహజ లక్షణాల ఆధారంగా చూడవచ్చు. స్పందించ వచ్చు.
సంజ్ఞాయుత జ్ఞానం దుఃఖాన్ని కలిగిస్తే, యథా భూత జ్ఞానం ప్రశాంతత ని ఇస్తుంది.
No comments:
Post a Comment