మానవుడు-దేవుడు
దేవుడు సర్వవ్యాపకుడు,సర్వశక్తివంతుడు మరియు సర్వజ్ఞుడు.ఈ గుణాలన్నీ మనిషిలో నిద్రాణంగా ఉంటాయి.అగోచరమైన దైవానికి భౌతికస్వరూపమే మానవుడు. మానవుడిని దైవీస్థితిలో నిలబెట్టే యోగము మరియు ధ్యానసాధన ద్వారా ఈ గుణాలన్నీ ప్రకటితమౌతాయి.ఈ దైవీగుణాలన్నిటినీ కల్గియుండడమే కాకుండా దైవాన్ని మరియు పరమాత్మను తెల్సుకోగల్గే శక్తివంతుడు మానవుడు.కాని ఇదంతా మర్చిపోయి భౌతిక శరీరములో ఇంద్రియవ్యామోహానికి బందీ అయినాడు.తన ప్రాణశక్తిని మరియు పరమాత్మను తెల్సుకోవడం ద్వారా తనను తాను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళగలడు. బ్రహ్మమే శరీరంలోని ప్రాణశక్తిగా ప్రకటితమవుతుంది. ఆ ప్రాణశక్తి దైవంతో నిరంతర సంబంధాన్ని కల్గియుంటుంది. శరీరానికి మరియు దానికి సంబంధించిన సంతోషాలకు పరిమితమైన చైతన్యము తన గురించి మరియు తన మూలము గురించి తెల్సుకుని తనను తాను అన్ని వస్తువులలో చూడగల్గినప్పుడు అహంకారపు జాడలు,హెచ్చుతగ్గు తారతమ్యాలు అదృశ్యమై,వాటిస్థానములో ఇతరులయెడ గౌరవము ,మన్నన పెరిగి వారిని నిస్వార్ధంగ సేవించాలనే కోరిక కల్గుతుంది.
తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి
No comments:
Post a Comment