పాముకు రెండు విషపు కోరలు ఉంటాయి...
ఆ కోరలు ఉన్నంత వరకు అది అందరినీ భయ పెడుతూ, కాటేస్తూ ఉంటుంది...
ఎప్పుడైతే ఆ రెండు కోరలు పీకేస్తామో అప్పటినుండి అది ఎవరిని భయ పెట్టకుండా ఒక మూలన దాగి ఉంటుంది...
*అలాగే మనిషి మనసులో కూడా అహంకార మమకారాలు అనే రెండు విషపు కోరలు ఉన్నాయి"*...
వీటి వలన మనిషి చేయరాని పనులెన్నో చేస్తూ మోయలేని భారమెంతో మోస్తూ తనకు, తన చుట్టూ ఉన్న సమాజానికి గొప్ప హానిని తలపెడుతున్నాడు...
దీని వలన అటు సమాజం, ఇటు తాను కూడా చెడిపోయి, నష్టాలు పాలు, కష్టాలు పాలగుచున్నాడు.
ఇది కూడని పని! ఇట్టి చర్యల వలన మనకు ఉపకారం చేకూరదు...
ఇలా జరగకుండా ఉండాలంటే మనిషి తనలో ఉన్న అహంకార మమకారాలు అనే రెండు కోరల్ని పీకి పారేయాలి...
సహనము, వినయము, విధేయత, ప్రేమ, త్యాగము వంటి గుణాలతో మనసును నింపుకోవాలి.
అప్పుడే మనసు అణిగి మణిగి ఉంటుంది.
ఇట్టి స్థితి వలన అటు సమాజానికి , ఇటు మనిషికి లాభం చేకూరుతుంది...
దేశమునకు, ప్రపంచానికి మంగళం కలుగుతుంది...
No comments:
Post a Comment