ఆధ్యాత్మిక జీవనము
🌷🌷🌷🌷🌷
ఈ ఆధునిక కాలంలో ఆధ్యాత్మికతకు సంబంధించి వెలువడే రకరకాల పుస్తకాలను చదివి, వాటిలోని పద్ధతులను సాధన చేసి, ఆ తర్వాత దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు చాలామంది. సాధకుడి స్థాయిని బట్టి పాటించవలసిన సూచనలు మారుతూ ఉంటాయి.
ఒకరికి పాయసం మరొకరికి విషం కావచ్చు. ప్రతివారూ, వారి వారి స్థాయిని బట్టి తమ తమ మానసిక, భౌతిక పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోవాలి.
ఒక మహాకట్టడాన్ని సరియైన పునాదుల మీద నిర్మిస్తేనే చక్కగా నిలబడుతుంది. లేకపోతే కూలిపోతుంది. సాధారణంగా మనం సత్యాన్ని ప్రేమించకుండా మనకు తోచిన ఏదో ఒక ఆలోచనను అంటి పెట్టుకుని దాని ద్వారా మనల్ని మనమే ప్రేమించుకుంటాము.
ఒక ఆలోచన ఎంత వరకూ సత్యాన్ని ప్రతిబింబిస్తోందన్న దానిని బట్టి కాక, ఆ ఆలోచన మనది కాబట్టి దానిని మనం ప్రేమిస్తాం. ఇటువంటి మిడిమిడి జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే కదా.
"భగవంతుణ్ణి తెలుసుకోవడం మన శక్తికి మించిన పని అని అర్థం అయిన వారికే ఆయన గోచరమవుతాడు. భగవంతుణ్ణి నేను ఎరుగుదును అనుకునే వారికి, ఆయన ఎప్పటికీ గోచరింపడు" అని కఠోపనిషత్తు బోధిస్తోంది.
యథార్థమూ, అచంచలమూ అయిన భక్తి కలిగిన వాడికి ఆయన తన వైభవాన్ని అవగతం చేస్తాడు. భక్తుని యొక్క బాధ్యత ఏమిటంటే, అనంతమైన పరమాత్మతో సంపూర్ణంగా ఐక్యమై జీవించడమే.
ఎప్పుడైతే మనిషి భగవంతుని కోసం ప్రయత్నిస్తాడో, అప్పుడు ఆయన కూడా భక్తునికి దగ్గరవుతూ తనను తాను తెలియబరుచుకోవాలన్న ఆతురతను చూపిస్తాడు.
No comments:
Post a Comment