*🧘♂️152-కర్మ - జన్మ🧘♀️*
🕉️🌞🌏🌙🌟🚩
*సర్వ స్థరతు దుర్గాణి*
*సర్వే భద్రాణి పశ్యతు!*
*సర్వః సద్బుద్ధి మాప్నోతు*
*సర్వః సర్వత్ర నందతు!!*
*భావము:-*
*అంతా కష్టాలని దాటిపోవుదురు గాక!*
*అంతా క్షేమంగా ఉందురు గాక!*
*అందరికీ మంచి బుద్ధులే కలుగును గాక!*
*అంతా అన్ని చోట్లా అనందాన్ని పొందెదరు గాక!*
*"మీ కేరెక్టర్ ఎలాంటిది!?*
ఏ కేషియరైనా ఎప్పుడైనా పొరబాటున మీకు ఎక్కువ చిల్లర ఇస్తే దాన్ని తిరిగి అతనికి ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచుకున్నారా?
మీ బాస్‌తో కాని, కొలీగ్స్ లేదా మీ జీవితంలో మీకు గత ఏడాదిగా తారసపడ్డ ఎవరితోనైనా మీరు ఏదైనా చిన్న అబద్ధమైనా సరే ఆడారా?
మీ ఆఫీసులోని కాగితాలని లేదా ఇంటర్నెట్ ని మీ వ్యక్తిగత అవసరానికి వాడారా?
మీరు Tax ని ఎగొగొట్టారా?
చదివి ఇస్తానని ఎవరి దగ్గరనించైనా తీసుకున్న పుస్తకం తిరిగి ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచేసుకున్నారా?
ఆఫీసుకి సబ్‌మిట్ చేసిన మీ ఖర్చుల స్టేట్‌మెంట్ ని పెంచి సబ్‌మిట్ చేసారా?
సి.డి ని అనాథరైజ్డ్ గా కాపీ చేసారా?
మీ పిల్లలు స్కూలుకి వెళ్ళకపోతే అందుకు టీచర్ కి తప్పుడు కారణం చెప్పారా?
మీ పిల్లల వయసు విషయంలో రైలు ప్రయాణంలో కన్సెషన్ కోసం తగ్గించి చెప్పారా?
మీరు ఇతరులకి అవసరం అయినప్పుడల్లా శారీరకంగా లేదా ఆర్థికంగా సహాయపడ్డారా?
మీరు అపకీర్తిని పొందినా సరే, మీ ఆదర్శాలకి కట్టుబడి ఉంటారా?
ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారనే కీర్తి మీకు ఉందా?
మీరు సంపాదించిన దాంట్లోంచి కొంత బీదలకి దానం చేస్తారా?
మీరు ప్రభుత్వోద్యోగి ఆయితే లంచం తీసుకోకుండా పనిచేస్తారా?
మీరు నెలకోసారైనా గుడికి వెళ్తారా?
మీరు నిత్యం దైవ ప్రార్థన చేస్తారా?
మనం చేసే ప్రతీ కర్మ యొక్క ఫలితం మన మనసుకి తెలుసు. దాని ఫలితం యొక్క సంకేతాన్ని మనలోని అంతరాత్మ మన మనసుకి అంతర్గతంగా తప్పక ఇస్తుంది.
ఆ సూచనని గ్రహించి దాన్ని బట్టి కర్మని ఆచరించడమా లేక మిన్నకుండటమా అన్నది మనం అలవాటు చేసుకోవాలి.
🕉️🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment