వివిధ వస్తువులు సమకూర్చుకుంటాం.అవి అన్నీ చూసి తృప్తి పడతాం.
రకరకాల సంబంధాలు ఏర్పరచుకుంటాం,ఇవి చూసి నాకెంతో స్నేహబంధాలు వున్నాయి అని గర్వ పడతాం.
బోలుడంత ఆస్తి కూడ పెడతాం.ఇది చూసి గొప్పగా ఫీల్ అవుతాము.
ఎన్నో అనుభవాలు పొందుతాం, వాటిని నెమరువేసుకుంటూ పొంగిపోతాం.
రకరకాల సిద్ధాంతాలు, నమ్మకాలు పెట్టు కుంటాం.నేనే అది, అదే నేను అని ఉబ్బిపోతాం
ఈ రకంగా విషయాలతో ముడిపడిన నాది, నేను,నా అనే భావనతో మనస్సు నిండుతుంది.
చూసావా ఇదినాది.చూసావా ఇది నేనే,చూసావా నన్ను అని.
ఈ భావన గర్వాన్ని, సంతోషాన్ని,విలువని, మురిపాన్ని ఇస్తుంది.ఇది మరింతగా నేను ని వృద్ధి చేస్తుంది.
ఇప్పుడు ఇక్కడ నుండి పతనం మొదలు అవుతుంది.
ఎంత ఎక్కుతామో అంత ఎత్తు నుండి జారతాము.
బంధాలు, ఆస్తులు, అంతస్తులు,హోదాలు, అనుభూతులు శాశ్వతంగా వుండవు.వీటిని చూసి ఆకాశానికి పెరిగిన నేను అన్న భావన దుఃఖానికి దారితీస్తుంది.
No comments:
Post a Comment