🔥ఆధ్యాత్మిక జీవనము🔥
🌿ఈ ఆధునిక కాలంలో ఆధ్యాత్మికతకు సంబంధించి వెలువడే రకరకాల పుస్తకాలను చదివి, వాటిలోని పద్ధతులను సాధన చేసి, ఆ తర్వాత దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు చాలామంది. సాధకుడి స్థాయిని బట్టి పాటించవలసిన సూచనలు మారుతూ ఉంటాయి.
🌿ఒకరికి పాయసం మరొకరికి విషం కావచ్చు. ప్రతివారూ, వారి వారి స్థాయిని బట్టి తమ తమ మానసిక, భౌతిక పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోవాలి.
🌿ఒక మహాకట్టడాన్ని సరియైన పునాదుల మీద నిర్మిస్తేనే చక్కగా నిలబడుతుంది. లేకపోతే కూలిపోతుంది. సాధారణంగా మనం సత్యాన్ని ప్రేమించకుండా మనకు తోచిన ఏదో ఒక ఆలోచనను అంటి పెట్టుకుని దాని ద్వారా మనల్ని మనమే ప్రేమించుకుంటాము.
🌿ఒక ఆలోచన ఎంత వరకూ సత్యాన్ని ప్రతిబింబిస్తోందన్న దానిని బట్టి కాక, ఆ ఆలోచన మనది కాబట్టి దానిని మనం ప్రేమిస్తాం. ఇటువంటి మిడిమిడి జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే కదా.
🌿"భగవంతుణ్ణి తెలుసుకోవడం మన శక్తికి మించిన పని అని అర్థం అయిన వారికే ఆయన గోచరమవుతాడు. భగవంతుణ్ణి నేను ఎరుగుదును అనుకునే వారికి, ఆయన ఎప్పటికీ గోచరింపడు" అని కఠోపనిషత్తు బోధిస్తోంది.
🌿యథార్థమూ, అచంచలమూ అయిన భక్తి కలిగిన వాడికి ఆయన తన వైభవాన్ని అవగతం చేస్తాడు. భక్తుని యొక్క బాధ్యత ఏమిటంటే, అనంతమైన పరమాత్మతో సంపూర్ణంగా ఐక్యమై జీవించడమే.
🌿ఎప్పుడైతే మనిషి భగవంతుని కోసం ప్రయత్నిస్తాడో, అప్పుడు ఆయన కూడా భక్తునికి దగ్గరవుతూ తనను తాను తెలియబరుచుకోవాలన్న ఆతురతను చూపిస్తాడు.
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment