Sunday, March 12, 2023

ఇక్కడ గమనించటం అంటే మనసు చేసే మంత్రాన్ని, ఆ మనసే వినేంత శ్రద్ధగా చేయటం అన్నమాట !

 నేటి జీవిత సత్యం.          
                       
*"దేహంపైఉన్న ధ్యాసను చైతన్యంపై ఎలా నిలపాలి ?"*

*"అద్దంలో ప్రతిబింబం చూసుకునేప్పుడు మనకు ఆ అద్దంపై ధ్యాస ఉండదు.* 

*అద్దాన్నే చూడాలనుకుంటే అందుకు మన ప్రతిబింబం అడ్డేమీ కాదు.*

*ప్రతిబింబంపై ఉంచిన ధ్యాసను అద్దంపైకి తెచ్చుకుంటే సరిపోతుంది.* 

*అలాగే ప్రస్తుతం దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంగా ఉన్న 'అసలు నేనెవరు' అనే విచారణలోకి మార్చాలి.*

*కేవలం మంత్రజపం చేస్తూపోతే ఆధ్యాత్మికంగా ప్రయోజనం ఉండదు. మనలోనుండి ఆ జపాన్ని చేసేదెవరో గమనిస్తేనే సత్యం తెలుస్తుంది.*

*అంటే మనసుకు మూలంగా ఉన్న చైతన్యం తెలుస్తుంది.*

*ఇక్కడ గమనించటం అంటే మనసు చేసే మంత్రాన్ని, ఆ మనసే వినేంత శ్రద్ధగా చేయటం అన్నమాట !"

అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment