Wednesday, March 8, 2023

 *_ఇక్కడ ఎవ్వడు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా లేరు . ప్రతి ఒక్కరికి బోలెడన్ని బాధలున్నాయి. బ్రతుకు నీది- బ్రతుకు తెరువు బాధ్యత నీది. కష్టం నీది- కారే చెమట చుక్క నీది. ఏది ఏమైనా కష్టం నీ ముందు నిలబడినప్పుడు నీవు మాత్రమే దానిని ఎదించాలి. లేదా, ఓడిపోవాలి. అంతేకాని,నీ చేయి పట్టుకొని నిన్ను ఈ కష్టాల కడలి నుంచి దాటించే వారు ఎవ్వరు లేరు ఈ లోకంలో ముందు గుర్తించు._*

*_నిన్ను కష్టాల్లోకి తోసిన ప్రతి సందర్భము నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక అద్భుత అవకాశంగా భావించాలి. గమనం గమ్యం కోసమే అయితే సహనం నీకు ఆయుధం కావాలి. క్షణకాలం నీ మనసులో ఎగిసిపడే అలలకు ఎదురీద కలిగితే నిర్దేశించిన తీరం నీదే కదా!_*
*_జీవితం రోదించడానికి లేదు- ఆడుతూ పాడుతూ  నీ వనుకున్నది  సాధించడానికి ఉంది._*

*_జీవితంలోని కష్టాన్ని మరిచి సంతోషాన్ని నింపుకొ.. కాలంతో సావాసం కాకుండా- సహవాసం చేయు. కాలం గాయం చేస్తే దానికి మందు నీ నవ్వు కావాలి! గుండె గాయం చేస్తే నీ గెలుపు దానికి వారధి అవ్వాలి! జీవితమే గాయమైతే నీ సహనం దానికి భయాన్ని ఇవ్వాలి! కష్టమైనా, నష్టమైన, బాధైనా,సంతోషంగా ఏదైనా సరే ఎదుర్కో..అంతేకానీ పిరికివాడిలాగా రోదించకు. ☝️_*

*_✍️మీ... డా,, తుకారం జాదవ్.🙏_*
                    _ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్._
                          *_Cell : 7382583095._*

No comments:

Post a Comment