Monday, October 9, 2023

 *ప్రపంచ దంపతుల*
  *దినోత్సవ శుభాకాంక్షలు*
ఎక్కడో పుట్టి మరెక్కడో పెరిగి
 నీకు ఇల్లాలయి నీకు వారసు
 లను ఇచ్చి, నీవే తన జీవిత
 మని గడిపి,నీకు చివరివరకు
 తోడుగా నిలిచిన స్త్రిమూర్తి
 నీ భాగ స్వామి....

నీకోసమే తన అహాన్ని ప్రక్కకు 
 పెట్టి, నీ ప్రేమకై తపించి నీవే
 తన జీవితమని యెంచిన
 అటు తన వారిని దూరం
 చేసుకోలేక, ఇటు నీ వారికి
 దగ్గర కాలేక, తన సంతోషాలు
  తానే చిదిమేసు కుంటూ,నీకు
  వారసులను ఇచ్చి,మీ కోసమే
  బ్రతికే నీ భాగ స్వామి....

ఆర్థిక అసమానతలు భరించి
 తోబుట్టువులకు దూరమై,
 నీ కుటుంభానికి ఆయువు
 పట్టులామారి,సమాజములో
 నీ కుటుంబానికి ఒక స్థానం
 కల్పించిన.. నీ భాగస్వామి...

అలసిన తన భుజాన కుటుంబాన్నిమోసి,కుటుంభమే
తన పరువు ప్రతిష్ట అనితలచి
 పరువుగా కాపాడి అందరికి
 దారులేర్పరచి తన దారిని
 పూర్తిగా మరచిపోయి నీవే 
 తన దారి యని యెంచిన
 పుణ్య మూర్తి,నీ కోసమే
  బ్రతికే నీ భాగస్వామి.... 

భార్యా భర్తలుగా,సహవా
 సులుగా తోడుగ నీడై నిలిచి 
 నీవే తన ప్రపంచ మని నిండు
 నూరేళ్లు ఒకరికొకరు తోడై
 నిలిచిన అన్యోన్య దాంపత్య
 జీవన తోటలో విరబూసిన
 దంపతులనే పుష్పాలకు ఇవే
*మా శుభాకాంక్షలు*.🙏

No comments:

Post a Comment